Jabardasth Comedians : మళ్లీ రోడ్డున పడ్డ జబర్దస్త్‌ కమెడియన్స్.. ఈ అడుక్కోవడం ఏంట్రా బాబు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jabardasth Comedians : మళ్లీ రోడ్డున పడ్డ జబర్దస్త్‌ కమెడియన్స్.. ఈ అడుక్కోవడం ఏంట్రా బాబు!

Jabardasth Comedians : ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో ఎంతో మంది కమెడియన్స్‌ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. వారు ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తే అందులో కూడా పాల్గొని ఈటీవీ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడం పరిపాటిగా వస్తుంది. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈటీవీలో ప్రసారమైన స్పెషల్ కార్యక్రమంలో జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క కమెడియన్స్ సందడి చేశారు. ఎప్పటిలాగే కార్యక్రమానికి మంచి రేటింగ్ వచ్చింది. […]

 Authored By aruna | The Telugu News | Updated on :3 September 2022,9:30 pm

Jabardasth Comedians : ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో ఎంతో మంది కమెడియన్స్‌ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. వారు ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తే అందులో కూడా పాల్గొని ఈటీవీ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడం పరిపాటిగా వస్తుంది. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈటీవీలో ప్రసారమైన స్పెషల్ కార్యక్రమంలో జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క కమెడియన్స్ సందడి చేశారు. ఎప్పటిలాగే కార్యక్రమానికి మంచి రేటింగ్ వచ్చింది. యాంకర్ గా ప్రదీప్‌ వ్యవహరించగా పలువురు జబర్దస్త్ కమెడియన్స్ కార్యక్రమంలో సందడి చేయడం జరిగింది.

ఇక గతంలో ఒకసారి వర్ష మరియు ఇమాన్యుల్ లు రోడ్ల మీద తిరుగుతూ అడుక్కునే వారిగా నటించి ప్రేక్షకులకు వినోదాన్ని పండించారు. ఇప్పుడు అదే తరహాలో బుల్లెట్ భాస్కర్ టీం రోడ్ల మీద తిరుగుతూ అడుక్కునే వారిగా కనిపించారు. వారిని ఏ ఒక్కరు గుర్తు పట్టకుండా పూర్తిగా అడుక్కునే వారి గెటప్ లో మారిపోయారు. రోడ్ల మీద తిరుగుతూ వాహనదారులను ఇబ్బంది పెడుతూ వారు నవ్వులు పూజించారు. కానీ ఈ స్కిట్ చాలా మందికి నచ్చడం లేదు. కొందరు రోడ్ల మీద అడుక్కునే వాళ్లను అవమానించినట్లే అంటూ విమర్శిస్తుంటే మరి కొందరు మాత్రం ఇదెక్కడి విడ్డూరమంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Jabardasth Comedians And team members who became beggars again

Jabardasth Comedians And team members who became beggars again

రోడ్ల మీద పడి ఇలా అడుక్కోవడం ఏంట్రా బాబు అంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం వినోదం పండించేందుకు వీరు చేస్తున్న ప్రయత్నం నిజంగా అద్భుతం.. ఎవరూ చేయలేని విధంగా వీరు చేస్తున్నారు. వీరిని ఎంతగా అభినందించిన తప్పు లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి రకరకాలుగా అడుక్కునే స్కిట్ పై కామెంట్స్ వస్తున్నాయి. ఈ కామెంట్స్ ఎక్కువగా వస్తున్న నేపద్యంలో ముందు ముందు మళ్ళీ కూడా అడుక్కునే స్కిట్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక స్కిట్ సక్సెస్ అయిందంటే దానికి కంటిన్యూషన్ జబర్దస్త్ లో లేదా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉంటూనే ఉంటుంది. కనుక ఈ అడుక్కునే స్కిట్ కూడా తప్పకుండా కంటిన్యూ అవుతుందని బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది