jabardasth varsha : వర్ష పరువుతీసిన ఇమాన్యుయేల్.. రోజా కూడా తగ్గట్లే!
jabardasth varsha : వర్ష – ఇమాన్యుయేల్ జోడిగా మెప్పించారు. వీరి మధ్య జబర్దస్త్ నిర్వాహకులు నడిపిన ట్రాక్ కొద్ది రోజులు బాగానే వర్కౌట్ అయింది. అయితే ఆ తర్వాత వారిద్దరి పైనే కౌంటర్‌లు వేస్తూ స్కిట్స్‌ను నడిపిస్తున్నారు. అలా కామెడీ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. ఇటీవలి కాలంలో వర్ష మీద ఇమ్మాన్యుయేల్, ఇమ్మాన్యుయేల్ మీద వర్ష కూడా కౌంటర్స్ వేసుకుంటున్నారు.
ఇక, ఇమ్మాన్యుయేల్ అయితే సమయం దొరికితే చాలు పంచుల వర్షం కురిపిస్తున్నాడు. ప్రస్తుతం వీరిద్దరు బుల్లెట్ భాస్కర్ స్కిట్స్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా స్కిట్‌లో ఇమ్మాన్యుయేల్ వర్ష పరువు తీశాడు. అయితే రోజా కూడా ఏ మాత్రం తగ్గకుండా వర్షపై కౌంటర్స్ వేసింది. నేను అభినేత్రిలా ఉన్నానని వర్ష అంటే.. అసలు నెత్తురే ఉండదు అభినేత్రిలతో ఎందుకు అని ఇమ్మాన్యుయేల్ అంటాడు. వండర్ వర్ష అని వర్ష అంటే.. ఇంకా నయం వంటోడి వర్ష అని పెట్టుకోలేదు ఇమ్మాన్యుయేల్ కౌంట్ వేస్తాడు.

jabardasth emmanuel Powerful punches on varsha full comedy
jabardasth varsha : వర్షపై రోజా సెటైర్లు..
లేడీస్ వచ్చాక జబర్దస్త్ ఎక్కడికో వెళ్లింది అని వర్ష అనగా.. జబర్దస్త్ ఎక్కడికి వెళ్లలేదు అమ్మా, లేడీ గెటప్‌లందరూ ఎక్కడికో వెళ్లిపోయారని పంచ్ విసురుతాడు. నేను అందగా లేనా అని వర్ష అనగానే.. చిన్న సాయిగాడికి చిన్న సైజ్ బట్టలేసినట్టు దారుణమైన కామెంట్ చేస్తాడు. దానికి స్పందించిన రోజా.. ఇంతవరకు ఏమో గానీ, ఇకపై అలా అనిపిస్తుందేమోనని భయంగా ఉందంటూ చెప్పింది. దీంతో మనో, ఇమ్మాన్యుయేల్, వర్ష.. అక్కడున్నవారంతా నవ్వేస్తారు. ఇలా వరుస పంచులతో ఇమ్మాన్యుయేల్ పరువు తీసేశాడు.