Jabardasth Faima : నాలుగు ఏళ్ల ప్రవీణ్ ప్రేమకు క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ ఫైమా
Jabardasth Faima : ఒకప్పుడు హాలీవుడ్ లో స్టార్స్ ప్రేమలు, బ్రేకప్ లు కామన్ కనిపించేవి. ఆ తర్వాత బాలీవుడ్ కు ఆ జాడ్యం పాకింది. సినిమా ఇండస్ట్రీలో అది ఏ భాష అయినా కూడా ప్రేమ వ్యవహారాలు చాలా కామన్ విషయం గా మారింది. పెద్ద ఎత్తున ప్రేమ వ్యవహారాలు ఉంటున్న సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం తగ్గకుండా ఇప్పుడు బుల్లి తెర సెలబ్రెటీలు కూడా ప్రేమలో పడటం.. ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలవడం చేస్తున్నారు. సుధీర్ రష్మి ల ప్రేమ వ్యవహారం టీవీ షో ల టీఆర్‌పీ రేటింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఇద్దరి మద్య మంచి స్నేహమే ఉన్నా కూడా చాలా ఉన్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇదే సమయంలో మరి కొన్ని జంటలు కూడా బుల్లి తెరపై సందడి చేస్తున్నాయి.
వర్ష మరియు ఇమాన్యూల్ ల మద్య ప్రేమ వ్యవహారం అంటూ ప్రచారం జరుగుతోంది. కాని వారి ప్రేమలో ఎంత వరకు నిజం ఉంది.. వారిది కూడా టీఆర్పీ రేటింగ్ కోసం ప్రేమ అయ్యి ఉంటుందా అంటూ చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో నాలుగు ఏళ్లుగా ఒక జంట అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు. పటాస్ ఫైమా మరియు పటాస్ ప్రవీణ్ లు గత నాలుగు సంవత్సరాలుగా తమ ప్రేమ వ్యవహారంపై చర్చించుకుంటున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం ప్రవీణ్ తన ప్రేమ విషయాన్ని ఫైమాకు తెలియజేశాడు. కాని అప్పటి నుండి ఫైమా అతడి ప్రేమకు నో చెప్పకుండా.. ఓకే చెప్పకుండా సస్పెన్స్ లో ఉంచుతూ వచ్చింది. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది.

jabardast faima clarity to praveen love
Jabardasth Faima : జబర్దస్త్ తో ఫైమా సూపర్ మాస్
పటాస్ తర్వాత జబర్దస్త్ లో ఇప్పుడు ఫైమా సందడి కొనసాగుతుంది. రోజా తో పాటు ప్రతి ఒక్కరి అభిమాన కంటెస్టెంట్ గా ఫైమా నిలిచింది. ఫైమా కు ఈమద్య కాలంలో అనూహ్యంగా ఆధరణ పెరిగింది. ఈ సమయంలో ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రవీణ్ పై తనకు ఉన్న అభిప్రాయంను క్లారిటీ ఇచ్చింది. ప్రవీణ్ నాలుగు సంవత్సరాలుగా నన్ను ప్రేమించడం చాలా సంతోషంగా ఉంది. ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాను అంటూ ఇలా వెంట పడుతూ ఉంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ప్రవీణ్ ను ప్రేమిస్తున్నావా అంటూ చాలా మంది అడుగుతున్నారు. దానికి ఇదే నా సమాధానం అంటూ ప్రవీణ్ ను హగ్ చేసుకుని.. ముసి ముసి నవ్వులు నవ్వేసింది. అంటే ఆమె కూడా ప్రేమిస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చేసింది. అయితే ప్రవీణ్ కు ఐ లవ్ యూ అని మాత్రం చెప్పలేదు. దాంతో ఇంకాస్త సస్పెన్స్ లోనే ఫైమా ఉంచింది. ఆ సస్పెన్స్ కు క్లారిటీ ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి.