Jabardasth : జబర్దస్త్‌గా జడ్జిగా రోజా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె డేట్స్ ఖాళీగా లేని సమయంలో వేరే వారిని గెస్ట్ జడ్జ్‌లుగా పిలుస్తున్నారు. గతంలో రోజాకు సర్జరీ జరిగిన సమయంలో నటి ఇంద్రజను జడ్జ్‌గా తీసుకొచ్చారు. అయితే ఆమె జడ్జ్‌మెంట్ ఇచ్చే విధానం చూసి చాలా మంది అభిమానులు ఫిదా అయిపోయారు. ఆమె మాట్లాడే పద్దతి కూడా జనాలకు నచ్చేసింది. ఎంతలా అంటే రోజా స్థానంలో ఆమెనే జడ్జ్‌గా కొనసాగించాలని డిమాండ్ చేసే అంత. అయితే రోజా మళ్లీ జబర్దస్త్ షోలో పాల్గొనడంతో.. ఇంద్రజను తప్పించారు.
అయితే ప్రేక్షకుల్లో ఇంద్రజకు ఉన్న ఫాలోయింగ్ చూసిన మల్లెమాల టీమ్.. ఆమెకు మరో షోకు జడ్జ్‌గా ఉండేలా చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జ్‌గా ఇంద్రజను తీసుకొచ్చారు. అక్కడ కూడా ఇంద్రజ తనదైన జడ్జ్‌మెంట్‌తో షోకు క్రేజ్ తీసుకొచ్చారు. అంతేకాకుండా కొన్ని ఏపిసోడ్‌లో తన మనసు ఎంత మంచిదో కూడా చాటుకున్నారు. వృద్దాశ్రమానికి తన నుంచి ప్రతి నెల డబ్బులు పంపిస్తానని చెప్పుకొన్నారు. దీంతో అభిమానుల్లో ఆమెపై అభిమానం మరింతగా పెరిగింది.
తాజాగా ఇంద్రజ మరోసారి జబర్దస్త్ షోలో కనిపించారు. రోజా లేకపోవడంతో.. ఆ స్థానంలో జడ్జ్‌గా వచ్చారు. మనో పక్కన కూర్చొని షోకు అందాన్ని తీసుకొచ్చారు. దీంతో రోజాకు ఏమైంది.. జబర్దస్త్‌కు ఎందుకు రాలేదన్న చర్చ మొదలైంది. వీలైనంత వరకు మరి అత్యవసరం అయితే తప్ప రోజా జబర్దస్త్‌కు డేట్స్ కేటాయించకుండ ఉండరు. మరి అంత ఇంపార్టెంట్ పని రోజాకు ఇప్పుడు ఏముందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే రాజకీయాలు, ఫ్యామిలీకి సంబంధించి బిజీగా ఉండటం వల్లే రోజా జబర్దస్త్‌కు రాలేకపోయారని, కొన్ని ఏపిసోడ్ల తర్వాత మళ్లీ కనిపిస్తారని టాక్.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.