Jabardasth : రోజా అవుట్ ఇంద్రజ ఇన్.. అసలు విషయం ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth : రోజా అవుట్ ఇంద్రజ ఇన్.. అసలు విషయం ఏంటి?

 Authored By aruna | The Telugu News | Updated on :7 November 2021,1:20 pm

Jabardasth : జబర్దస్త్‌గా జడ్జిగా రోజా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె డేట్స్ ఖాళీగా లేని సమయంలో వేరే వారిని గెస్ట్ జడ్జ్‌లుగా పిలుస్తున్నారు. గతంలో రోజాకు సర్జరీ జరిగిన సమయంలో నటి ఇంద్రజను జడ్జ్‌గా తీసుకొచ్చారు. అయితే ఆమె జడ్జ్‌మెంట్ ఇచ్చే విధానం చూసి చాలా మంది అభిమానులు ఫిదా అయిపోయారు. ఆమె మాట్లాడే పద్దతి కూడా జనాలకు నచ్చేసింది. ఎంతలా అంటే రోజా స్థానంలో ఆమెనే జడ్జ్‌గా కొనసాగించాలని డిమాండ్ చేసే అంత. అయితే రోజా మళ్లీ జబర్దస్త్ ‌షోలో పాల్గొనడంతో.. ఇంద్రజ‌ను తప్పించారు.

Jabardasth Indraja once again come as judge in Roja place

Jabardasth Indraja once again come as judge in Roja place

అయితే ప్రేక్షకుల్లో ఇంద్రజకు ఉన్న ఫాలోయింగ్ చూసిన మల్లెమాల టీమ్.. ఆమెకు మరో షో‌కు జడ్జ్‌గా ఉండేలా చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జ్‌గా ఇంద్రజను తీసుకొచ్చారు. అక్కడ కూడా ఇంద్రజ తనదైన జడ్జ్‌మెంట్‌తో షో‌కు క్రేజ్ తీసుకొచ్చారు. అంతేకాకుండా కొన్ని ఏపిసోడ్‌లో తన మనసు ఎంత మంచిదో కూడా చాటుకున్నారు. వృద్దాశ్రమానికి తన నుంచి ప్రతి నెల డబ్బులు పంపిస్తానని చెప్పుకొన్నారు. దీంతో అభిమానుల్లో ఆమెపై అభిమానం మరింతగా పెరిగింది.

Jabardasth : రోజా స్థానంలో ఇంద్రజ..

Jabardasth Indraja once again come as judge in Roja place

Jabardasth Indraja once again come as judge in Roja place

తాజాగా ఇంద్రజ మరోసారి జబర్దస్త్ షోలో కనిపించారు. రోజా లేకపోవడంతో.. ఆ స్థానంలో జడ్జ్‌గా వచ్చారు. మనో పక్కన కూర్చొని షోకు అందాన్ని తీసుకొచ్చారు. దీంతో రోజాకు ఏమైంది.. జబర్దస్త్‌కు ఎందుకు రాలేదన్న చర్చ మొదలైంది. వీలైనంత వరకు మరి అత్యవసరం అయితే తప్ప రోజా జబర్దస్త్‌కు డేట్స్ కేటాయించకుండ ఉండరు. మరి అంత ఇంపార్టెంట్ పని రోజాకు ఇప్పుడు ఏముందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే రాజకీయాలు, ఫ్యామిలీకి సంబంధించి బిజీగా ఉండటం వల్లే రోజా జబర్దస్త్‌కు రాలేకపోయారని, కొన్ని ఏపిసోడ్ల తర్వాత మళ్లీ కనిపిస్తారని టాక్.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది