jabardasth : ఇమ్మాన్యుయేల్ కు వేరే పెళ్లి అయితే ఏం చేస్తావ్.. రోజా ప్రశ్నకు వర్ష స‌మాధానానికి అందరు షాక్‌..! వీడియో

 Authored By jagadesh | The Telugu News | Updated on :19 July 2021,12:50 pm

jabardasth : జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో jabardasth  గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గత 8 ఏళ్ల నుంచి అప్రతిహాతంగా ఈ కామెడీ షో సక్సెస్ ఫుల్  jabardasth  గా నడుస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జబర్దస్త్ ను బీట్ చేసే షో రాలేదు. మధ్యలో చాలా కామెడీ షోలు వచ్చాయి.. పోయాయి కానీ.. జబర్దస్త్ ను మాత్రం బీట్ చేయలేకపోయాయి. జబర్దస్త్ అంత ఫేమస్ అయిందంటే దానికి కారణం.. ఆ షోలో.. ఫుల్ టు కామెడీ ఉండటమే. ఇప్పుడే కాదు.. ఇంకో పదేళ్ల పాటు జబర్దస్త్ ప్రోగ్రామ్ నడిచినా.. అదే టాప్ లో ఉంటుంది. బుల్లితెర మీద జబర్దస్త్  jabardasth  ను మించిన షో లేదంటే అతిశయోక్తి కాదు.

jabardasth latest promo varsha and immanuel

jabardasth latest promo varsha and immanuel

జబర్దస్త్ లో ఎక్కువ ఫేమస్ అయ్యేది జంటలే. ముందు ఫేమస్ అయింది సుడిగాలి సుధీర్, రష్మీ జంట. ఆ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న జంట ఇమ్మాన్యుయేల్, వర్ష జంట. ఈ జంటకు ఉన్న క్రేజ్ మరెవ్వరికీ లేదు. వర్ష, ఇమ్మాన్యుయేల్ స్టేజ్ మీద కనబడితే చాలు… ఇక నవ్వులే నవ్వులు. ఆ జంటను చూడటానికే చాలామంది జబర్దస్త్ చూస్తుంటారు. ఇద్దరి మధ్య ఏముంది అనే విషయం ఎవ్వరికీ తెలియనప్పటికీ.. ఒకరంటే మాత్రం మరొకరికి చాలా ఇష్టం.

jabardasth latest promo varsha and immanuel

jabardasth latest promo varsha and immanuel

Jabardasth : ఇమ్మాన్యుయేల్ కు వేరే అమ్మాయితో పెళ్లి అయితే వర్ష పరిస్థితి ఏంటి?

నిజంగా.. వీళ్ల మధ్య ప్రేమ ఉందా? వర్ష, ఇమ్మాన్యుయేల్ ప్రేమలో ఉన్నారా? ఇద్దరూ పెళ్లి చేసుకుంటారా? లేక స్టేజ్ మీదనే వీళ్ల ప్రేమ వ్యవహారం నడుస్తోందా? అసలు.. వీళ్ల మధ్య ఏముందో తెలుసుకోవడం కోసం.. జబర్దస్త్ జడ్జి jabardasth  రోజా Roja .. వర్షను ప్రశ్నించింది. స్టేజ్ మీద స్కిట్ లో ఇమ్మాన్యుయేల్ కు వేరే పెళ్లి అయితేనే నువ్వు ఇంతలా బాధపడుతున్నావు. నిజంగా ఇమ్మాన్యుయేల్ కు వేరే పెళ్లి అయితే ఏం చేస్తావ్? అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించగా.. వెంటనే భావోద్వేగానికి గురయింది వర్ష. అంటే ఏ అమ్మాయికైనా.. మనం ఉండాలి అని అనుకున్న ఆ ప్లేస్ లో వేరేవాళ్లు ఉంటే చాలా కష్టం మేడమ్.. తట్టుకోలేము.. అంటూ స్టేజ్ మీదనే ఏడ్చేసింది వర్ష.

jabardasth latest promo varsha and immanuel

jabardasth latest promo varsha and immanuel

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇది జరిగింది గత వారం ఎపిసోడ్ స్కిట్ లో. అయితే.. దాన్నే కాన్సెప్ట్ గా తీసుకొని వచ్చే వారం స్కిట్ లో ఉపయోగించుకున్నారు. టిక్ టాక్ స్టార్ రీతు చౌదరి.. వర్ష ప్లేస్ లో ఉండి.. ఇమ్మాన్యుయేల్ ప్లేస్ లో అజార్ ఉన్నాడు. ఇక.. వర్ష అప్పుడు ఏ డైలాగ్స్ చెప్పిందో.. రీతూ చౌదరి కూడా అవే డైలాగ్స్ చెబుతుండటం.. పక్కనే ఇమ్మాన్యుయేల్ ఉండటంతో.. ఇక స్టేజ్ మొత్తం నవ్వులే నవ్వులు. తాజాగా వచ్చే వారానికి సంబంధించిన జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా చూసేయండి.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఇంతకంటే అవమానం ఉంటుందా?.. టిక్ టాక్ భాను పరువుదీసిన హైపర్ ఆది..!

ఇది కూడా చ‌ద‌వండి ==> బిగ్‌బాస్ సీజన్ 5కు సర్వం సిద్దం.. జబర్దస్త్ , టిక్ టాక్ నుంచి కంటెస్టెంట్స్ వీరేనట..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఊపు ఊపేసిన యాంకర్ విష్ణు ప్రియ.. నాభి అందాలతో రచ్చ.. వీడియో వైరల్

ఇది కూడా చ‌ద‌వండి ==> ముగ్గురు మొనగాళ్ళు మూవీలో చిరుకి డూప్‌గా ఆ ఇద్దరు మొనగాళ్ళు వీరే…!

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి