Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ సీజన్ 5కు సర్వం సిద్దం.. జబర్దస్త్ , టిక్ టాక్ నుంచి కంటెస్టెంట్స్ వీరేనట..!
Bigg Boss 5 Telugu : త్వరలో బిగ్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు Bigg Boss 5 Telugu సీజన్ 5కు సర్వం సిద్ధమైందట. ఇప్పటికే బిగ్ హౌజ్ కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్టు సమాచారం. ఇక త్వరలో తెలుగు బిగ్‌బాస్ సీజన్ 5 Bigg Boss 5 Telugu ప్రసారానికి ముహూర్తం పెట్టనున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 5 హోస్ట్ మారనున్నట్టు కొత్త టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్ కి కింగ్ నాగార్జునకు బదులు టాలీవుడ్ టాల్ హీరో, నంబర్ 1 యారీ హోస్ట్ రానా దగ్గుబాటి వ్యవహరించనున్నట్టు సమాచారం.ఈ బిగ్ రియాలిటీ షోకి తెలుగులో ఇప్పటి వరకు బిగ్‌బాస్ Bigg Boss 5 Telugu నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. సీజన్ 1కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు.
ఆ తర్వాత సీజన్ 2కు నాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. సీజన్ 3, సీజన్4 లకు మన్మధుడు, కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. కాగా తరలో మొదలబోతున్న 5వ సీజన్‌కు నాగార్జున హోస్ట్ చేయలేనని నిర్వాహకులకు చెప్పినట్టు సమాచారం. అంతేకాదు తన ప్లేస్ లో సీజన్ 5కి రానాని హోస్ట్ గా తీసుకోమని సలహా కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో నిర్వాహకులు రానాతో సంప్రదింపులు జరిపారట. ప్రస్తుతం రానా పవన్ కళ్యాణ్ సినిమాతో సహ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.
Bigg Boss 5 Telugu : కొత్తవాళ్లతో ప్రయోగం చేయకుండా బాగా ఫెమీలియర్ పర్సన్స్ నే తీసుకోవాలని ప్లాన్ చేశారు.
దాంతో తన డేట్స్ సర్ధుబాటును బట్టి బిగ్‌బాస్ సీజన్ 5ను ప్లాన్ చేస్తున్నారట. రానా దగ్గుబాటి ఓకే అంటే బిగ్‌బాస్ సీజన్ 5 హోస్ట్‌గా భారీగానే రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూమ్, గూగుల్ మీట్ ద్వారా బిగ్‌బాస్ సీజన్ 5లో పార్టిసిపేట్ చేసేవాళ్లను ఇంటర్వ్యూలు కూడా చేసినట్టు టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారినే తాజా సీజన్ కి ఎంపిక చేయనున్నారు. ఇక ఈ సీజన్‌లో కొత్తవాళ్లతో ప్రయోగం చేయకుండా బాగా ఫెమీలియర్ పర్సన్స్ నే తీసుకోవాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా టిక్ టాక్ దుర్గారావు, హైపర్ ఆది, సింగర్ మంగ్లీ (సత్యవతి), టిక్ టాక్ స్టార్ భాను, యాంకర్ ప్రత్యూష, శేఖర్ మాస్టర్, యాంకర్ శివ, కమెడియన్ ప్రవీణ్, యాంకర్ వర్షిణి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ వంటి వాళ్లు బిగ్‌బాస్ సీజన్ 5లోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే వీరితో రెమ్యునరేషన్ విషయమై చర్చలు కూడా సాగినట్టు సమాచారం. చూడాలి మరి బిగ్‌బాస్ సీజన్ 5లో ఎవరెవరు సందడి చేయనున్నారో.