Anchor Sowmya Rao : జబర్దస్త్‌ కొత్త యాంకర్‌ సౌమ్య కి ఇస్తున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? రష్మీ ఫ్యాన్స్ షాక్‌ అవుతారు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 14 November 2022, 6:20 pm

Anchor Sowmya Rao ; జబర్దస్త్ నుండి అనసూయ తప్పుకోవడంతో ఆ స్థానంలో కన్నడ టీవీ నటి సౌమ్య రావు వచ్చిన విషయం తెలిసిందే. రష్మీ మరియు అనసూయ లకు ఏమాత్రం తగ్గకుండా సౌమ్య జబర్దస్త్ స్టేజ్ పై ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది. మొదటి ఎపిసోడ్ లో ఆమె సక్సెస్ అయిందని చెప్పాలి. నటిగా ఎన్నో సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువ అయిన ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ ఫార్మాట్ కు తగ్గట్లుగా ఉంది అంటూ హైపర్ ఆది మరియు రాంప్రసాద్ మల్లెమాల వారిని ఒప్పించి మరీ తీసుకొచ్చారట. రష్మీ గౌతమ్ రెండు జబర్దస్త్ లకు యాంకర్ గా వ్యవహరించడం వల్ల కాస్త డ్యామేజ్ జరుగుతుందని..

అందుకే సౌమ్య ను తీసుకు వచ్చినట్లుగా మల్లెమాల వారు చెబుతున్నారు. ఒక్కొక్క ఎపిసోడ్ కోసం రష్మీ గౌతమ్‌ దాదాపుగా 4.5 లక్షల నుండి 5.5 లక్షల రూపాయల పారితోషకమును మల్లెమాల వారు ఇస్తున్నారు. కానీ సౌమ్య కు మాత్రం కేవలం రెండు లక్షల రూపాయల పారితోషికం మాత్రమే ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. రష్మి గౌతమ్ తో పోలిస్తే సౌమ్య కనీసం సగం రెమ్యూనరేషన్ కూడా అందుకోవడం లేదు. అది రష్మీ గౌతమ్‌ స్థాయి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. హీరోయిన్ గా కూడా రష్మీ ఏ స్థాయిలో సినిమా లు చేస్తుందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

jabardasth new anchor soumya rao remuneration

jabardasth new anchor soumya rao remuneration

జబర్దస్త్ కారణంగానే ఈమెకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కనుక ముందు ముందు సౌమ్య కూడా హీరోయిన్ గా వరుసగా సినిమాలు నటించే అవకాశాలు ఉన్నాయి. వచ్చిరాని తెలుగు లో మాట్లాడుతూ సౌమ్య ఆకట్టుకుంటుంది అంటూ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. హైపర్ ఆది తో పాటు ఇతర జబర్దస్త్ కమెడియన్స్ తో మరియు జడ్జిలతో ఆమె కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవుతుందంటూ కూడా ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. కనుక త్వరలోనే సౌమ్య రెమ్యూనరేషన్ మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి