Anchor Sowmya Rao : ఒక్క ఎపిసోడ్ కోసం యాంకర్ సౌమ్యకి ఈటీవీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Anchor Sowmya Rao : జబర్దస్త్ ప్రోగ్రామ్ గురించి తెలుసు కదా. ఇప్పుడు కాదు.. గత 10 ఏళ్ల నుంచి ఆ ప్రోగ్రామ్ తెలుగు బుల్లితెర మీద నెంబర్ వన్ గా నిలుస్తూ వస్తోంది. టాప్ టీఆర్పీని సాధిస్తూ నెంబర్ వన్ షోగా నిలుస్తున్న జబర్దస్త్ లో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి పేరు వచ్చింది. యాంకర్స్ కావచ్చు.. కమెడియన్స్ కావచ్చు. అందరికీ చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. సినిమాల్లో ఆఫర్స్ కూడా వచ్చాయి. అలా మంచి ఫేమ్ తెచ్చుకొని స్టార్ హీరోయిన్ స్థాయిని పొందిన యాంకర్లలో అనసూయ ఒకరు.
రష్మీకి కూడా ఇంచుమించు అంతే పేరు వచ్చింది. అయితే.. అనసూయ స్థానంలో కొన్ని నెలల కింద సౌమ్య వచ్చిన విషయం తెలిసిందే. అనసూయ ఉన్నప్పుడు తనకే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్లు. సౌమ్య యాంకరింగ్ కు కొత్త. తను టీవీ సీరియళ్లలో హీరోయిన్ గా నటించి అక్కడి నుంచి యాంకరింగ్ లోకి వచ్చింది. జబర్దస్త్ లో యాంకర్ అవడం అంటే మామూలు విషయం కాదు. వాళ్లకు ఫేమ్, పాపులారిటీ వచ్చేసినట్టే.

do you how much remuneration of jabardasth Anchor Sowmya Rao
Anchor Sowmya Rao : ఈటీవీలోని శ్రీమంతుడు సీరియల్ నటే సౌమ్యా రావు
ఈటీవీలో వచ్చే శ్రీమంతుడు సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న సౌమ్యా రావు.. జబర్దస్త్ లో యాంకర్ గా చేరింది. సౌమ్యరావు జబర్దస్త్ లో మంచిగానే సెటిల్ అయింది. బాగానే యాంకరింగ్ చేస్తోంది. తనకు ఒక్క ఎపిసోడ్ కు జబర్దస్త్ వాళ్లు రూ.85 వేలు ఇస్తున్నారట. అంటే నెలకు 4 ఎపిసోడ్స్. దాదాపు రూ.3.5 లక్షల ఆదాయం అది కూడా కేవలం నెలలోనే. ఇది కేవలం జబర్దస్త్ ద్వారా మాత్రమే తనకు వచ్చే ఆదాయం. ఇంకా సీరియల్, ఇతర ఈవెంట్స్ద ద్వారా కూడా రెండు చేతులా సంపాదిస్తూ దీపం ఉన్నప్పుడే సౌమ్య ఇంటిని చక్కదిద్దుకుంటోంది.