Jabardasth Pavithra : జబర్ధస్త్ స్టేజ్‌పై రచ్చ చేసే లేడి కమెడీయన్ పవిత్ర ఎవరు, ఆమె గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
Jabardasth Pavithra : జబర్ధస్త్ షో ఎంతో మంది కమెడీయన్స్‌ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ షో ఎంతో మందికి పునర్జన్మని ఇచ్చిందని చెప్పాలి. ఈ షో తర్వాతే చాలా మందికి సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. జబర్దస్త్ కామెడీ షోలో ఒకప్పుడు లేడీ కమెడియన్లు ఉండేవాళ్లు కాదు. అబ్బాయిలే అమ్మాయిల వేషం వేసుకునేవాళ్లు. దానికి కారణం స్కిట్‌లో భాగంగా ఒక్కోసారి కొట్టాల్సి ఉంటుంది.. లేదంటే తిట్టాల్సి వస్తుంది. ఎక్కువగా భార్య భర్తల మధ్య, ఇద్దరు లవర్స్ మధ్య జరిగే ఫన్నీ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈ షోలో అమ్మాయిలు కూడా అవసరమవుతారు. ఈమధ్య లేడీ గెటప్ వేసుకునే కమెడియన్స్ అసలు కనిపించట్లేదు.
కారణం ప్రస్తుతం లేడీ కమెడియన్స్ ఎంట్రీ ఇస్తున్నారు.పైగా కొత్తవాళ్ళు పరిచయం అవుతున్నారు.ఈ మధ్యే మరో అమ్మాయి కూడా జబర్దస్త్ కామెడీ షోలో చాలా హంగామా చేస్తుంది. ఆమె పేరు పవిత్ర. పొట్టి పిల్ల అయిన కూడా చాలా గట్టి పిల్లనే. ఆమె వేసే పంచ్‌లు అదిరిపోతుంటాయి. భాస్కర్, వెంకీ మంకీస్, హైపర్ ఆది.. ఇలా ప్రతీ టీమ్‌లోనూ కామన్‌గా కనిపిస్తుంది పవిత్ర. కొన్ని స్కిట్స్ అయితే ఈమె చుట్టూనే తిరుగుతున్నాయి. పవిత్ర పంచులకు జబర్దస్త్ స్టేజ్ అంతా అదిరిపోతుంది. తక్కువ టైంలో చాలా పాపులర్ కావడంతో ఆమె గురించి తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు.

jabardasth new lady comedian pavithra and her background
Jabardasth Pavithra : పవిత్రనా, మజాకానా..
టిక్ టాక్ తో ఫేమస్ అయిన పవిత్ర జబర్ధస్త్ లీడర్స్ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత సీరియల్స్ ఆఫర్స్ కూడా అందుకుంటుంది. ఇంతక ముందు పలు సీరియల్స్‌లో చేసిన పెద్దగా గుర్తింపు రాకపోవడంతో జబర్ధస్త్ బాట పట్టింది. అక్కడ అదగొట్టడంతో ఈ అమ్మడికి ఇప్పుడు ఆఫర్స్ మీద ఆఫర్స్ వస్తున్నాయి. చూస్తుంటే రానున్న రోజులలో పవిత్ర హంగామా మాములుగా ఉండేలా
కనిపించడం లేదు.