Jabardasth Rithu : ఇలాంటివి చేయడం ఇంట్లో ఇష్టముండవట.. స్టేజ్ మీద జబర్దస్త్ రీతూ ఎమోషనల్

Authored By aruna | The Telugu News | Published on: August 4, 2022, 5:20 pm

Jabardasth Rithu : తెరపై ఎంటర్టైన్మెంట్ ఇస్తే అందరూ నవ్వుతారు.ఎంజాయ్ చేస్తారు. కానీ అదే తెరపై మన వాళ్లు కనిపిస్తారంటే.. అక్కడికి వెళ్తారంటే ఒప్పుకోరు. ఇష్టపడరు. మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. వారిని గడప దాటి బయట అడుగు పెట్టేందుకే ఇంట్లో వాళ్లు ఒప్పుకోరు. అలా ఎంతో మంది ఇంటి లోపలే ఉండాల్సి వస్తుంటుంది. కానీ కొంత మంది మాత్రం ధైర్యం చేసి ముందుకు అడుగు వేస్తారు. అలాంటి వారు తెరపై రాణిస్తుంటారు. అయితే తాజాగా వదిలిన రాఖీ స్పెషల్ ప్రోమో అదిరిపోయింది. రాఖీ ఈవెంట్‌ను ఈసారి మల్లెమాల కాస్త వెరైటీ ట్రై చేసింది. చెల్లెల్లంతా కూడా అన్నయ్యలకు సర్ ప్రైజ్‌లు ఇస్తారట.

ఈ ఈవెంట్‌లో శ్రీముఖి అదరగొట్టేసింది. పరదేవీ తన అక్కతో , భాను తన అన్నతో, రోల్ రైడా తన చెల్లితో ఇలా అందరూ వచ్చారు. ఈ ఈవెంట్‌కు నవీన్ చంద్ర గెస్టుగా వచ్చాడు. అయితే ఇందులో జబర్దస్త్ రీతూ ఎపిసోడ్ మాత్రం అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేసింది. అందరూ అన్నాచెల్లెళ్లు రాఖీ పండుగను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ రీతూ మాత్రం ఒంటరిగా ఉండిపోయింది. దీంతో ఆమెను స్టేజ్ మీదకు పిలిచింది శ్రీముఖి. నీకు ఇలా మీ అన్నకు రాఖీ కట్టాలని లేదా? అని అడిగింది. ఉంది.. కానీ మా అన్నయ్య రాడు.. అసలు నేను ఇక్కడ ఉండటమే ఇష్టం లేదు అని రీతూ చెబుతుంది. దీంతో అందరూ ఎమోషనల్ అవుతారు.

Jabardasth Rithu Chowdhary Gets Emotional in Etv Rakhi event

Jabardasth Rithu Chowdhary Gets Emotional in Etv Rakhi event

అయితే నీకు ఒక సర్ ప్రైజ్ ఉంది అని శ్రీముఖి చెబుతుంది. అమ్ములు అని ఓ వాయిస్ వినిపిస్తుంది. దీంతో రీతూ మరింత ఎమోషనల్ అవుతుంది. స్టేజ్ మీదకు వచ్చిన తన అన్నయ్యను చూసి రీతూ కంటతడి పెట్టేసుకుని హగ్ చేసుకుంటుంది. అలా రీతూ తన అన్నను అలా చూడటంతో ఎమోషనల్ అవుతుంది. మల్లెమాల, శ్రీదేవీ డ్రామా కంపెనీ టీంలు ఇలాంటి సర్ ప్రైజ్‌లతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక ఈప్రోమోలో ఎమోషనల్ కంటెంట్ బాగానే ఉంది. మొత్తానికి రాఖీ ఈవెంట్ మాత్రం గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp