Jabardasth Rocking Rakesh : రాకింగ్ రాకేష్, జోర్ధార్ సుజాతల నిశ్చితార్థం.. స్టేజ్ మీద మరో కొత్త నాటకమా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth Rocking Rakesh : రాకింగ్ రాకేష్, జోర్ధార్ సుజాతల నిశ్చితార్థం.. స్టేజ్ మీద మరో కొత్త నాటకమా?

 Authored By prabhas | The Telugu News | Updated on :4 May 2022,8:00 pm

Jabardasth Rocking Rakesh : జబర్దస్త్ స్టేజ్ మీద నడిచేవన్నీ టీఆర్పీ స్టంట్లే. వారు కొట్టుకున్నా, తిట్టుకునా, అలిగి వెళ్లిపోయినా, ప్రేమ పాఠాలు చెప్పుకున్నా, దండలు మార్చుకున్నా, ఉంగరాలు పెట్టినా, తాళి కట్టినా కూడా అవన్నీ టీఆర్పీ స్ట్రాటజీలే. ఇక ఈ మధ్య కన్నీరు పెట్టుకుంటూ నానా హంగామా చేస్తున్నారు. అది కూడా చివరకు టీఆర్పీల కోసమే. మొత్తానికి జబర్దస్త్ షోను నమ్మే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు.తాజాగా మల్లెమాల టీం, జబర్దస్త్ డైరెక్షన్ టీం సుజాత రాకేష్ ట్రాకును బాగా ఫోకస్ చేస్తోంది.

ఒకప్పుడు ఇదే టీం.. రాకేష్, రోహిణిని అంత ఎత్తుకు లేపింది. ఇద్దరి మధ్య ఏదో ఉందన్నట్టుగా భ్రమ కల్పించారు. కానీ ఇప్పుడు సుజాత రాకేష్‌లను వాడేసుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరూ కలిసి చేసే స్కిట్లు, వేసే డైలాగ్స్, వారి రొమాన్స్ ఇవన్నీ చూస్తుంటే.. ఎవ్వరైనా నమ్మేట్టుగానే ఉంటుంది.తాజాగా వదిలిన ప్రోమోలో మరో అడుగు ముందుకు వేశారు. ది స్పెషల్ మూమెంట్..మిస్ అవ్వకండి అంటూ ఈ ఇద్దరికీ నిశ్చితార్థం అయినట్టుగా చూపించారు.

Jabardasth Rocking Rakesh And Sujatha Engagement In Extra Jabardasth Promo

Jabardasth Rocking Rakesh And Sujatha Engagement In Extra Jabardasth Promo

తీరా ఎపిసోడ్ చూస్తే మాత్రం అది స్కిట్‌లో భాగంగానే ఉంటుంది. కానీ ఈ ప్రోమోలో మాత్రం ఈ ఇద్దరూ రెచ్చిపోయారు. నిశ్చితార్థం రింగులు మార్చుకున్నట్టుగా ఓవర్ యాక్షన్ చేశారు. అందరి కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.పెళ్లాయ్యాక నీకు కష్టాలు రావని చెప్పను.. కన్నీళ్లు రావని చెప్పను.. కానీ ఈ రెండు వచ్చినప్పుడు నీ పక్కనే నేను ఉంటాను అని మాత్రం మాటిస్తున్నాను అని రాకేష్ తన స్టైల్లో చెప్పేస్తాడు. దీంతో సుజాత మరింత ఉప్పొంగిపోతుంది. మొత్తానికి ఈ డ్రామా అయితే బాగానే పండినట్టు కనిపిస్తోంది.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది