Jabardasth Rocking Rakesh : రాకింగ్ రాకేష్, జోర్ధార్ సుజాత పెళ్లి ఎప్పుడు.. జబర్దస్త్ బాబు ఏమన్నాడంటే!
Jabardasth Rocking Rakesh : జబర్దస్త్ కమెడియ్ రాకింగ్ రాకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుదీర్ఘ కాలంగా జబర్దస్త్ లో ఆకట్టుకుంటూ ఉన్నాడు. చిన్న పిల్లలతో కలిసి స్కిట్ లు చేసి తన మీదే పంచ్ లు వేయించుకుని అందరిని నవ్వించి.. ఇప్పుడు టీం లీడర్ గా జబర్దస్త్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు. ఈ సమయంలో అతడు తన సహా నటి అయినా జోర్దార్ సుజాత తో ప్రేమలో పడ్డట్టుగా అధికారికంగా ప్రకటించాడు. గత కొన్ని రోజులుగా సుజాత మరియు రాకేష్ లు కలిసి జబర్దస్త్ లో సందడి చేస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడ సన్నిహిత్యం ప్రేమగా మారిందట.ఇద్దరు కూడా స్కిట్లలో కామెడీ పండించడం కోసం లవ్ లో ఉన్నట్లు గా నటిస్తున్నారేమో అని అంతా అనుకున్నారు.
కానీ అనూహ్యంగా ఇటీవల జరిగిన వాలెంటైన్స్ డే స్పెషల్ శ్రీదేవి డ్రామా కంపెనీలో వారిద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టారు. అదే సమయంలో ఒక రింగ్ పెట్టి మరి సుజాతకు ప్రపోజ్ చేశాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై ఇద్దరి వివాహ నిశ్చితార్ధం కూడా అయినట్లే అంటున్నారు. ఇతర జబర్దస్త్ లవ్ స్టోరీల విషయం పక్కన పెడితే సుజాత మరియు రాకేష్ ప్రేమ వ్యవహారం నిజమైనదని క్లారిటీ వచ్చేసింది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారని ఒక ప్రకటన కూడా వచ్చింది.తాజాగా జబర్దస్త్ కామెడియన్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాకేష్ మరియు సుజాత ఈడు జోడు చాలా బాగుంటుంది. వారిద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రయాణిస్తూ ఉంటారు.

Jabardasth Rocking Rakesh and sujatha love and marriage update
ప్రతి ఒక సందర్భంలో వాళ్లిద్దరూ ఒకరి పై ఒకరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. వారిద్దరు కలిసి జీవితం పంచుకుంటే కచ్చితంగా బాగుంటుంది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ సంవత్సరంలోనే వారి పెళ్లి జరగబోతుంది అంటూ బాబు చెప్పుకొచ్చాడు. వారిద్దరి పెళ్లి విషయమై ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారని… ఇంట్లో వాళ్ళని ఒప్పించి తర్వాతే వారు బయట ప్రకటించారని బాబు అన్నాడు. బాబు చెబుతున్న దాని ప్రకారం చూస్తుంటే ఈ ఏడాది చివరి వరకు రాకేష్ మరియు సుజాత పెళ్లి పీఠలు ఎక్కడం ఖాయం అనిపిస్తుంది. ఇద్దరు ఒకటి అవ్వడం మాత్రమే కాదు ఆ తర్వాత జబర్దస్త్ లో కూడూఆ సందడి చేయడం జరుగుతుందని తెలుస్తోంది.