Rocking Rakesh : అందరు రోజా కాళ్ల మీద పడ్డవాళ్లే.. రాకింగ్ రాకేష్ వారి గురించి అలా అన్నాడేంటి..!
Rocking Rakesh : ఈ సారి ఏపీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా మారాయో మనం చూశాం. టీడీపీ, జనసేన , బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని ఎదుర్కొన్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఇక ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎం బాధ్యతలు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అందుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గెలుపుకోసం ఈసారి […]
ప్రధానాంశాలు:
Rocking Rakesh : అందరు రోజా కాళ్ల మీద పడ్డవాళ్లే.. రాకింగ్ రాకేష్ వారి గురించి అలా అన్నాడేంటి..!
Rocking Rakesh : ఈ సారి ఏపీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా మారాయో మనం చూశాం. టీడీపీ, జనసేన , బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని ఎదుర్కొన్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఇక ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎం బాధ్యతలు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అందుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గెలుపుకోసం ఈసారి ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రచారంలో పాల్గొన్నారు. జబర్దస్త్ ఆర్టిస్టులందరూ పవన్ విజయం కోసం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, జనసేన పార్టీ తరపున ప్రచారం చేశారు.
Rocking Rakesh ఏరు దాటాక తెప్ప తగలేసారు..
అయితే ఎన్నికల ప్రచార సమయంలో జబర్ధస్త్ నటులు మాజీ మంత్రి రోజాపై ఘాటు విమర్శలు చేశారు. కానీ ఒక్క రాకింగ్ రాకేష్ మాత్రమే రోజాకు మద్దతుగా నిలుస్తూ వైసీపీకి సపోర్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు రాకేష్‌ను టార్గెట్ చేస్తూ బూతులు తిట్టడంతో పాటు నీకు ఇండస్ట్రీలో ఆఫర్లు లేకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకేష్ మాట్లాడుతూ.. రోజా గారిని అమ్మ అని పిలుస్తూ ఉంటాను తాను ఇబ్బందులలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పి అండగా నిలబడింది. తనతో పాటు చాలామంది ఆమె సహాయం కూడా పొందారని తెలిపారు.
స్వయంగా తన చేతుల మీదనే ఎంతోమందికి మేలు చేసిందో తెలిపారు.. ఎవరైనా ఆపదలో ఉండి ఆమె కాళ్ళ మీద పడితే వెంటనే సహాయం చేసేది. ఆమె ఆస్తులు అమ్మి కూడా డబ్బు సహాయం చేసింది అంటూ తెలిపారు. అలాంటి రోజూ అమ్మను ఈరోజు విమర్శించే వారి వ్యక్తిగతనికే వదిలేస్తున్నాను అంటూ తెలిపారు.. ఏరు దాటాక తెప్ప తగిలి రకం వాళ్లు.. రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదు కేవలం మనిషి వ్యక్తిత్వాలే ముఖ్యం అంటూ.. రోజా పైన కామెంట్స్ చేశారు రాకింగ్ రాకేష్. తాజాగా రాకింగ్ రాకేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.మరి దీనిపై ఇతర జబర్ధస్త్ నటులు ఏవైన పంచ్‌లు వేస్తారా చూడాలి.