roja : రాకేష్, సుజాత ట్రాక్‌పై కామెంట్స్.. రోజా వదిలేలా లేదు

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 13 November 2021, 7:38 pm

roja  రోహిణి జబర్దస్త్ ఎంట్రీ తర్వాత ఆమెకు మరింతగా క్రేజ్ వచ్చింది. రాకింగ్ రాకేష్ స్కిట్స్‌లో ఆమె ఎంట్రీ తర్వాత వారిద్దరి మధ్య కాంబినేషన్ బాగా సెట్ అయింది. అయితే వీరిద్దరు పైకి ఫ్రెండ్స్ అని చెబుతున్న.. నెటిజన్లు మాత్రం వీరి మధ్య ఏదో ఉంది అని చర్చించుకుంటున్నారు. ఇటీవల రాకేష్ రోహిణికి స్టేజ్ మీదే ప్రపోజ్ చేయడం.. వెనకాల అదిరిపోయే మ్యూజిక్, లవ్ సింబల్స్ తెరపై కనిపించడం బాగా వైరల్‌గా మారింది.

అంతేకాకుండా ఓ సందర్భంలో రాకేష్ రోహిణికి ముద్దు పెట్టిన్టట్టుగా చూపెట్టారు. అంతా క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. దీంతో వారి మధ్య ఏదో ఉందని చర్చ మరింతగా పెరిగిపోయింది.అయితే గత రెండు స్కిట్ల నుంచి రాకేష్ టీమ్‌లో జోర్దార్ సుజాత కనిపిస్తుంది. అయితే రోజా మాత్రం రాకేష్- రోహిణిల లవ్ ట్రాక్‌పై తనదైన శైలిలో కామెంట్స్ చేసింది. తాజా స్కిట్‌లో రోహిణి బామ్మ క్యారెక్టర్ వేయగా..

Jabardasth roja comments on rohini and rocking rakesh track

Jabardasth roja comments on rohini and rocking rakesh track

roja  : సిగ్గుపడ్డ రోహిణి

రాకేష్, సుజాతలు భార్యాభర్తలుగా నటించారు. అయితే జడ్జ్‌మెంట్ సమయంలో రోజా మాట్లాడుతూ.. ‘మనసులో నీ బాధ, కసి అంత లాస్ట్‌లో చెప్పావు కదా.. భామ్మ అనడం నాకు బాధగా ఉంది.. ఎలా ఒప్పుకుంటావు నువ్వు అసలు’ అని రోహిణిని అడిగింది.అప్పుడు మీకు కోడలు అంటే ఎట్లుండాలి అని రాకేష్ అన్నాడు. దీంతో రోహిణి కర్ర తీసుకుని రాకేష్‌ను కొట్టాడానికి వస్తుంది. రాకేష్ అమ్మకు నచ్చింది వదిలేసేయండి అని అంటాడు.

అప్పుడు మళ్లి కలుగజేసుకున్న రోజా… ఈ జలసీ చూస్తుంటే నాకు ఏదో డౌటుగా ఉంది అని కామెంట్ చేస్తుంది. రోహిణి మాత్రం ఇదంతా జల్సా కోసమే అని అంటుంది. రోజా మాత్రం ఏ మాత్రం తగ్గకుండా మళ్లీ అదే కామెంట్స్ చేస్తుంది. మొత్తం అందరికి కనిపిస్తుంది ఏదో జరుగుతుందని అంటుంది. చివర్లో రాకేష్ మాట్లాడుతూ.. నా కళ్లకు రోహిణి ఎనర్జిటెక్‌గా కనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు రోహిణి స్పందిస్తూ.. సుజాత విన్నావా అని ఫన్నీ డైలాగ్‌ వదులుతుంది.

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి