Jabardasth : 20 ఏళ్లుగా ప్రయత్నిస్తుండగా ‘జబర్దస్త్’లో అతనికి అవకాశం.. ఆ కమెడియన్ ఎవరంటే..?
Jabardasth SattiPandu : తెలుగు పాపులర్ కామెడీ షోగా ‘జబర్దస్త్’ ఉన్న సంగతి అందరికీ విదితమే. అందరినీ కడుపుబ్బ నవ్వించేందుకుగాను ఇందులో స్కిట్స్ చేసే కమెడియన్స్ ప్రయత్నిస్తుంటారు. అయితే, ఈ షోలో ప్రదర్శించేందుకుగాను ఓ కమెడియన్ దాదాపు 20 ఏళ్లు ప్రయత్నించాడు. ఈ విషయం ఆయన చెప్పడం ద్వారానే తెలిసింది. ఇంతకీ ఆయనెవరంటే..‘జబర్దస్త్’ షోలో సత్తిపండు అలియాస్ పీఎన్ వీ సత్యనారాయణ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసే ఉంటుంది. తనదైన టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తుంటాడు సత్తి పండు. ఇటీవల సత్తిపండు భార్యా భర్తల అన్యోన్యతపై స్కిట్ ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
కాగా, తాజాగా తాను ‘జబర్దస్త్’లో అవకాశం కోసం పడిన కష్టాల గురించి తెలిపాడు.‘జబర్దస్త్’లో ఇప్పటి వరకు సుమారుగా 250 వరకు స్కిట్లు ప్రదర్శించిన సత్తిపండు.. దాదాపు 20 ఏళ్లుగా ప్రయత్నాలు చేసిన తర్వాత ‘జబర్దస్త్’లో అవకాశం దక్కించుకున్నాడు. అన్ని ఏళ్ల పాటు అవకాశాల కోసం సినిమాలు, టీవీల్లో ప్రదర్శనల కోసం ప్రయత్నించినట్లు సత్తిపండు చెప్పుకొచ్చాడు. తాను ఈ రంగంలోకి రాక మునుపు నాటకాలు వేసినట్టు సత్తిపండు చెప్పాడు. అయితే, ఇప్పుడు సత్తి పండు తన కెరీర్ లో సెట్ అయినట్లు వివరించాడు.

jabardasth sattipandu shared his life story
Jabardasth : ప్రస్తుతం పలు సినిమాల్లోనూ ఆయనకు అవకాశాలు..
ఓ వైపున ‘జబర్దస్త్’ షోలో స్కిట్స్ చేస్తూనే వెండితెరపైన కూడా కమెడియన్‌గా పాత్రలు పోషిస్తున్నారు. అలా బుల్లితెర, వెండితెర రెండిటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు సత్తిపండు. విక్టరీ వెంకటేశ్ ‘దృశ్యం–2’, ‘ఆర్డీఎక్స్ లవ్’, ‘విజేత’, ‘హలో శ్యామ్’, ‘ప్రేమ కోసం’ చిత్రాల్లో ఇప్పటి వరకు తాను నటించినట్లు సత్తి పండు చెప్పాడు. ప్రస్తుతం ‘హలో ఆది’, ‘అతిథి దేవోభవ’, గీతా ఆర్ట్స్‌లో అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కుతున్న ఫిల్మ్‌తో పాటు నందమూరి కల్యాణ్‌రామ్ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపాడు సత్తిపండు. మొత్తంగా సత్తిపండు అలియాస్ పీఎన్ వీ సత్యనారాయణ నటించడమే లక్ష్యంగా ఇండస్ట్రీకి వచ్చి తన కల సాకారం చేసుకునేందుకుగాను కష్టపడుతున్నాడు.