Jabardasth Varsha – Emmanuel : ఇమాన్యూల్‌, వర్ష మధ్య గొడవలు.. కెమెరా ముందు వరకే వారి డ్రామా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth Varsha – Emmanuel : ఇమాన్యూల్‌, వర్ష మధ్య గొడవలు.. కెమెరా ముందు వరకే వారి డ్రామా!

 Authored By prabhas | The Telugu News | Updated on :26 December 2022,1:20 pm

Jabardasth Varsha – Emmanuel : జబర్దస్త్ అనగానే కొంత మంది పేర్లు టక్కున గుర్తుకు వస్తాయి. అందులో ఇమాన్యుల్ మరియు వర్ష ల యొక్క పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉంటాయి. వీరిద్దరి కలర్ కలవక పోయినా మనసులు కలిసి ప్రేమలో ఉన్నారని ఇన్నాళ్లు జనాలు భావించారు. కానీ అసలు విషయం ఏంటంటే జబర్దస్త్ రేటింగ్ కోసం వారి యొక్క అవకాశాల కోసం మాత్రమే ఇద్దరు ప్రేమలో ఉన్నట్లుగా నటించారు. ఇద్దరు కూడా ఒకరికొకరును అర్థం చేసుకొని ప్రేమించుకుంటున్నారని ఇన్నాళ్లు భావించిన వారికి షాకింగ్ విషయం ఒకటి క్లారిటీ వచ్చింది. అసలు విషయం ఏంటంటే మొదట్లో ఇద్దరు స్నేహితులుగా ఉన్న

మాట వాస్తవమే కానీ ఈ మధ్య కాలంలో వీరిద్దరూ గొడవ పడ్డారట. అది ఏ విషయంలో గొడవపడ్డారు అనేది తెలియదు.. కానీ ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆ విభేదాల కారణంగా ఇద్దరు ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా స్టేజ్ పై కనిపించడం లేదు. అదే సమయంలో చాలా నార్మల్ గానే ఇద్దరి మధ్య సన్నివేశాలు కొనసాగుతున్నాయి. బుల్లి తెర వర్గాల వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం వల్లే గొడవ మొదలైంది అంటున్నాను. ఆన్ స్క్రీన్ వరకు అయితే పర్వాలేదు కానీ ఆఫ్ స్క్రీన్ లో ప్రేమ పెళ్లి అంటే అస్సలు ఒప్పుకునేది

jabardasth varsha and emmanuel love story breakup

jabardasth varsha and emmanuel love story breakup

లేదు అంటూ వర్ష తెగేసి చెప్పడంతో పాటు అప్పటి నుండి ఇమాన్యుల్ కి దూరంగా ఉంటుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ టీం మెంబెర్స్ అంతా కూడా ఈ విషయమై వర్ష కి చెప్పి చూసే ప్రయత్నం చేశారట. ఆమె మాత్రం ఇమాన్యుల్‌ తో సన్నిహితంగా ఉండేందుకు ఆసక్తి చూపించడం లేదని అయితే జబర్దస్త్ కార్యక్రమం కోసం అతడితో కలిసి వర్క్ చేసేందుకు మాత్రం ఓకే చెప్పిందట. వారు ఎన్ని డ్రామాలు చేసినా.. ఎంత లవ్ ప్రదర్శించిన కేవలం కెమెరా ముందే, కెమెరా ఆఫ్ అయితే వారిద్దరూ బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది వారికి తెలియాలి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి