Jabardasth Varsha : జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ర్ష ఇలా మారిందేంటి.. 20 ఎక‌రాలు ఇస్తే శోభ‌నానికి రెడీ అంటుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jabardasth Varsha : జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ర్ష ఇలా మారిందేంటి.. 20 ఎక‌రాలు ఇస్తే శోభ‌నానికి రెడీ అంటుంది..!

Jabardasth Varsha : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు వర్ష‌. యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో ఆరంభంలోనే వర్ష మోడల్‌గా మారి అందచందాలతో మాయ చేసింది. ఇలా ఆ రంగంలో ఉన్నప్పుడే ఎన్నో ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే ‘అభిషేకం’ అనే సీరియల్‌లో నటించే ఆఫర్ వచ్చింది. దీంతో ఆ తర్వాత ‘తూర్పు పడమర’, ‘ప్రేమ ఎంత మధురం’ వంటి సీరియళ్లతో మెప్పించి మంచి పేరు తెచ్చుకుంది. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో సీరియళ్లలో నటించి సత్తా […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 July 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Jabardasth Varsha : జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ర్ష ఇలా మారిందేంటి.. 20 ఎక‌రాలు ఇస్తే శోభ‌నానికి రెడీ అంటుంది..!

Jabardasth Varsha : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు వర్ష‌. యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో ఆరంభంలోనే వర్ష మోడల్‌గా మారి అందచందాలతో మాయ చేసింది. ఇలా ఆ రంగంలో ఉన్నప్పుడే ఎన్నో ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే ‘అభిషేకం’ అనే సీరియల్‌లో నటించే ఆఫర్ వచ్చింది. దీంతో ఆ తర్వాత ‘తూర్పు పడమర’, ‘ప్రేమ ఎంత మధురం’ వంటి సీరియళ్లతో మెప్పించి మంచి పేరు తెచ్చుకుంది. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో సీరియళ్లలో నటించి సత్తా చాటుకున్న వ‌ర్ష ఊహించ‌ని విధంగా జ‌బ‌ర్ధ‌స్త్ ఆఫ‌ర్ ద‌క్కించుకుంది. ఇక అందులో అద్భుతంగా చేయ‌డంతో అప్ప‌టి నుండి పర్మినెంట్ మెంబర్ అయిపోయింది.

Jabardasth Varsha : ఏంటి వ‌ర్ష ఇది..

ముఖ్యంగా ఇమాన్యూయేల్‌కు జోడీగా సెన్సేషన్ అయింది. జబర్ధస్త్ షోలో చాలా కాలంగా వర్ష, ఇమాన్యూయేల్.. ఇదే క్రేజ్‌ను కంటిన్యూ చేస్తూ సత్తా చాటుతున్నారు. ఇలా జబర్ధస్త్‌, స్పెషల్ ఈవెంట్లతో పాటు ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ షోలోనూ భాగమై ప్రేక్షకులకు ఓ రేంజ్‌లో అలరిస్తున్నారు. వీటితో పాటు యూట్యూబ్‌లో ప్రసారం అయ్యే కొన్ని రకాల షోలను కూడా వీళ్లిద్దరూ జంటగా హోస్ట్ చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా జ‌బ‌ర్ధ‌స్త్ షోకి సంబంధించిన ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో జబర్దస్త్ వర్ష చేసిన పని అందరికి షాకిస్తుంది. ఆమె ఓ భూస్వామికి లొంగిపోవడం ఆశ్చర్యంగా మారింది. భూమి ఇస్తానంటే భార్యగా నటించేందుకు రెడీ అయ్యింది.

Jabardasth Varsha జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ర్ష ఇలా మారిందేంటి 20 ఎక‌రాలు ఇస్తే శోభ‌నానికి రెడీ అంటుంది

Jabardasth Varsha : జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ర్ష ఇలా మారిందేంటి.. 20 ఎక‌రాలు ఇస్తే శోభ‌నానికి రెడీ అంటుంది..!

కానీ తీరా శోభనం అని తెలియడంతో షాక్‌ తినాల్సి వచ్చింది. రియాజ్‌ భార్య వర్షకి లైనేస్తున్నాడు పక్కింటి అజార్‌. దీంతో ఈ విషయాన్ని గమనించిన వర్ష.. తన భర్త రియాజ్‌కి చెప్పింది. అతను అజార్‌ పై గొడవకు వెళ్లాడు. నా భార్యని ఎందుకు చూస్తున్నావని ప్రశ్నించగా, మా నాన్నకి వంద ఎకరాలుంది. నాకు ఇక్కడ భార్య, కొడుకు ఉన్నాడని అబద్దం చెప్పాను, కానీ ఇప్పుడు చూడ్డానికి నాన్న వస్తున్నాడు, భార్యగా నటించేందుకు ఎవరూ రావడం లేదు. 20ఎకరాలు రాసిస్తా అని చెప్పినా ఎవరూ ముందుకు రావడం లేదంటూ వాపోయాడు అజార్‌. రియాజ్‌ కి అదిరిపోయే ప్లాన్‌ వచ్చింది. ఇరవై ఎకరాలంటే మామూలు కాదు, ఒకరోజు అజార్‌కి భార్యగా నటించమి తన భార్య వర్షకి చెబుతాడు. ఇరవైఎకరాల కోసం ఒక రోజున అజార్ కి భార్యగా నటించేందుకు వెళ్తుంది వర్ష. కొడుకుగా, రియాజే వెళ్లడం విశేషం. అయితే ఇంట్లోకి వెళ్లాక.. అజార్‌ తండ్రి(ఇమ్మాన్యుయెల్‌).. కొడుక్కి శోభనం ఏర్పాటు చేస్తుంటాడు.ఎవరికి శోభనం అని రియాజ్‌ అడగ్గా, మీ అమ్మా నాన్నకి అని చెప్పడం విశేషం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది