Jagapati babu : అన్నం కూడా తినలేని దీనమైన స్థితి లో జగపతి బాబు .. అసలేమైంది !

Authored By aruna | The Telugu News | Published on: February 14, 2023, 6:00 pm

Jagapati babu : హీరో జగపతిబాబు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అప్పటి సినిమాలలో జగపతిబాబుకు లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. టాలీవుడ్ లో శోభన్ బాబు తర్వాత జగపతి బాబుకే లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. 70 కి పైగా హీరోగా సినిమాలలో నటించిన జగపతిబాబు, బాలయ్య లెజెండ్ సినిమాతో విలన్ గా మారిపోయాడు. ఈ సినిమాలో బాలయ్య పోటీగా జగపతిబాబు నటించారు. ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో జగపతిబాబు వరుసగా విలన్ క్యారెక్టర్స్ చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్స్ కి జగపతిబాబు డేట్స్ దొరకటం కష్టంగా మారింది. అయితే రీసెంట్గా జగపతిబాబు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అవమానాలను చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ నేను కెరీర్ ప్రారంభంలో సాహసం అనే సినిమా చేశాను. ఇందులో నాది సెకండ్ హీరో పాత్ర. అయితే షూటింగ్ హైదరాబాద్ లో కాకుండా వేరే లొకేషన్ లో పెట్టడంతో ఇంటి ఫుడ్ ని చాలా మిస్ అయ్యే వాడిని. డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే రకరకాల వంటకాలు ఉంటే ముద్ద దిగని నా పరిస్థితి చూసి నిర్మాత నన్ను పస్తులు ఉంచేవాడు.

Jagapati babu in poor health condition

Jagapati babu in poor health condition

షూటింగ్ వారం రోజులు పాటు జరిగితే ఆ వారం రోజులు అన్నం తినకుండా బ్రతికాను. ఆ రోజు నాకు జరిగిన అవమానం లైఫ్ లో మంచి గుణపాఠం నేర్పింది. కొత్తగా వచ్చిన హీరోని చూసి చులకనగా చూసేవారు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు జగపతిబాబు. దీంతో జగపతిబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం జగపతిబాబు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. గతేడాది పరంపర, ఆటగాళ్లు సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ సలార్ ‘ సినిమాలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp