Suriya – Jai Bhim : మరో వివాదంలో సూర్య ‘జై భీమ్’.. సినతల్లి పాత్రధారికి హీరో రూ.10 లక్షల సాయం..
Suriya – Jai Bhim : ఓటీటీలో ‘జై భీమ్’ సినిమా విడుదలైన నాటి నుంచి ఆ సినిమా గురించి దాదాపుగా ప్రతీ ఒక్కరు చర్చించుకుంటున్నారు. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ సినిమాకు ఓటీటీలో హయ్యెస్ట్ వ్యూస్ లభిస్తున్నాయి. కాగా, తాజాగా ఇందులో హీరోగా నటించిన సూర్య వివాదాల్లో చిక్కుకున్నాడు.‘జై భీమ్’ ఫిల్మ్‌లో వన్నియార్ అనే కులస్థులను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారంటూ తమిళనాడు పీఎంకే పార్టీకి చెందిన అన్బుమణి ఆరోపించారు.
దీనిపై సూర్య స్పందించారు. ఒకరిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం తానెప్పుడూ చేయబోనని క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే హీరో సూర్యకు మద్దతు తెలుపుతున్నారు నెటిజన్లు. నెటిజన్లతో పాటు ఇతర హీరోల అభిమానులు సైతం సూర్యకు మద్దతు తెలుపుతున్నారు. ‘వీ స్టాండ్ విత్ సూరియా వాట్ హ్యాపెన్‌డ్’ హ్యాష్‌ట్యాగ్‌ను క్రియేట్ చేసి హీరో సూర్యకు మద్దతు తెలుపుతున్నారు.
Suriya – Jai Bhim : తాను అలా చేయలేదంటూ క్లారిటీనిచ్చిన సూర్య..
ఈ సంగతులు ఇలా ఉంచితే.. రియల్ లైఫ్‌లో సినతల్లి పాత్ర ధారియైన మహిళకు సూర్య పది లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. గిరిజన విద్యార్థుల కోసం సూర్య తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్‌కు ఇటీవల కోటి రూపాయల విరాళమిచ్చారు. ‘జై భీమ్’ విడుదలైన నాటి నుంచి గిరిజనుడైన సినతల్లి భర్త రాజన్నకు జరిగిన అన్యాయం గురించి ప్రతీ చోటా చర్చ జరుగుతున్నది. పోలీసులు దొంగతనం కేసులో ఇరికించి అతడిని ఇబ్బందులకు గురి చేసి కొట్టడం వల్ల అతడు చనిపోయాడు.
ఈ క్రమంలోనే సినతల్లికి మద్దుతుగా నిలిచిన లాయర్ జస్టిస్ చంద్రు పాత్రను హీరో సూర్య పోషించారు. ‘జై భీమ్’ చిత్రం విడుదలైన నాటి నుంచి వివాదం చేయాలని చూస్తున్నాయి కొన్ని పార్టీలు.. ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదం తెరమీదకు రాగా సూర్య దానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. మొత్తంగా ‘జై భీమ్’ సినిమా ప్రతీ ఒక్కరు కంపల్సరీగా చూడాల్సిన సినిమా అని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.