Janaki Kalaganaledu 13 August 2022 Episode : అడ్డంగా బుక్ అయిన మల్లిక.. జెస్సి కి వార్నింగ్ ఇచ్చిన జానకి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 13 August 2022 Episode : అడ్డంగా బుక్ అయిన మల్లిక.. జెస్సి కి వార్నింగ్ ఇచ్చిన జానకి..

 Authored By prabhas | The Telugu News | Updated on :13 August 2022,11:00 am

Janaki Kalaganaledu 13 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగలేదు. ఈ సీరియల్ అభిమానిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా విడుదల కాదు. 366 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. జ్ఞానంబ మల్లికను రెండు రోజులు అన్నం తినకుండా ఒక కన్నేసి ఉండమని చికితాకి చెప్తుంది. అప్పుడు చికితను అప్పుడు మల్లికా చికిత కు మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిచ్చి తనని అక్కడి నుంచి పంపించేస్తుంది. తను అటు వెళ్ళగానే భోజనం చేస్తుంది. తను భోజనం చేస్తుండగా… జ్ఞానం భ గోవిందరాజు కాలేజ్ నుంచి తిరిగి ఇంటికి వస్తారు. అప్పుడు మల్లిక వాళ్లు రావడం చూసి అన్నం ప్లేట్ ను తన వెనక పెట్టుకొని కవర్ చేయాలని చూస్తుంది. కానీ గోవిందరాజు ఆ ప్లేట్ ను చూస్తాడు. అప్పుడు జ్ఞానంబ కూడా చూస్తుంది.అప్పుడు మల్లికాని జ్ఞానంబ చెడమడ తిట్టి నీకు రెండు రోజులు కాదు నాలుగు రోజులు తిండి లేకుండా చేస్తాను.

ఛికిత పిలిచి తనని కూడ తిడుతుంది. నీకు బుర్ర ప‌ని చెయ్య‌డం లేదు. అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే జానకి జెస్సి జ్ఞానంబ ని తిట్టడం చూస్తుంది. అప్పుడు జానకితో తన గురించి చెప్తుంది. అలాంటి అత్తలతో ఎలా భరిస్తారో ఏంటో అని అంటుంది. అప్పుడు జానకి నీకు అసలు తన గురించి ఏం తెలుసు. తను ఒక దేవత నాకు అత్త కావచ్చు. కానీ నన్ను అమ్మలాగా చూసుకుంటుంది. అని అంటుంది. అప్పుడు జెస్సి ఆవిడ మీ అత్త నా.. ఐ బాబోయ్ ఎలా భరిస్తున్నారు జానకి గారు. అలాంటి వాళ్లతో మాత్రం నా వల్ల కాదు ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా. అని అంటుంది జెస్సి. అప్పుడు జానకి, జ్ఞానంబా గురించి అంత చెప్తుంది. తనకి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది జానకి. అప్పుడు జెస్సి జానకికి సారీ చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది.

Janaki Kalaganaledu 13 August 2022 Full Episode

Janaki Kalaganaledu 13 August 2022 Full Episode

ఇక సాయంత్రం అవుతుంది. అప్పుడు అక్కడికి రామ జానకిని తీసుకెళ్లడానికి వస్తాడు. జానకి వెళ్తూ జెస్సి గురించి రామాకు చెప్తుంది. రామ అవును నేను ఉదయం ఆమెను చూశాను. అమ్మ తనని కొట్టబోయింది మేమే అడ్డుకున్నాము. అని ఆ అమ్మాయి చాలా మొండి దాని లాగా ఉంది జానకి గారు అని చెప్తాడు. కట్ చేస్తే ఆ జెస్సి అఖిల్ ప్రేమలో మునిగిపోతుంది. వాళ్లు ఇద్దరూ ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ అఖిల్ ని ఎవరితో మాట్లాడుతున్నావు అని అఖిల్ ని అడుగుతుంది. కంగారుపడుతూ ఫ్రెండ్ అని చెప్తాడు. దానికి ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అంటుంది. కట్ చేస్తే మల్లికా ఆకలితో మండిపోతూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపు ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది