Janaki Kalaganaledu 15 Oct Today Episode : జానకి వల్ల రామాకు ఎటువంటి ప్రమాదం ఏర్పడుతుందోనని భయపడ్డ జ్ఞానాంబ ఏ నిర్ణయం తీసుకుంది?
Janaki Kalaganaledu 15 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 15 అక్టోబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎంత పిలిచినా జానకి అస్సలు పలకదు. బయటికి నుంచి అందరూ పిలుస్తుంటారు. అందరూ తెగ భయపడుతుంటారు. అందరూ అత్తయ్య గారు అత్తయ్య గారు అని పిలుస్తుంటారు. దీంతో జానకి తెచ్చిన చీర కట్టుకొని రెడీ అయి తలుపు తీస్తుంది జ్ఞానాంబ. దీంతో మల్లిక షాక్ కు గురవుతుంది. ఏమైందమ్మా.. ఇంతసేపు డోర్ తీయలేదు అని రామా అడుగుతాడు. వస్తాను కదా.. ఎందుకు అలా తలుపులు కొడుతున్నారు అని అంటుంది జ్ఞానాంబ. చీరకట్టుకుంటున్నాను.. అని అంటుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 15 october 2021 episode
ఇంతలో కేక్ రెడీ చేస్తాడు రామా. జానకిని పిలిచి కేక్ కట్ చేయమని కోరుతాడు. అక్కడికి వచ్చాక కూడా జ్ఞానాంబ ఏదో ముభావంగా ఉంటుంది. ఏమైంది అని ఎవ్వరు అడిగినా చెప్పదు. లేదు జ్ఞానాంబ నువ్వు రామచంద్రాపురం వెళ్లి వచ్చినప్పటి నుంచి ఏదోలా ఉన్నావు. ఏమైంది అని అడుగుతాడు గోవింద రాజులు. ఏంటమ్మా అంత పొడిపొడిగా మాట్లాడుతున్నావు. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు అమ్మ అంటాడు రామా. నీకు చెప్పకుండా ఎలా ఉంటాను. నా ప్రేమ, భయం ఏదైనా నీ కోసమే.. నీ వల్లనే.. అంటుంది. ఆ తర్వాత జానకి కేక్ కట్ చేస్తుంది. అందరూ సంబరాల్లో మునిగి తేలుతారు కానీ జ్ఞానాంబ మాత్రం అలాగే బాధపడుతూ ఉంటుంది.
Janaki Kalaganaledu 15 Oct Today Episode : జానకి కేక్ తినిపిస్తే తినని జ్ఞానాంబ
కేక్ కట్ చేశాక.. జ్ఞానాంబకు కేక్ ను జానకి తినిపించబోతే.. ముందు రామాకు తినిపించు అని అంటుంది జ్ఞానాంబ. అత్తయ్య గారు మీరు నా అమ్మ లాంటి వారు. అందుకే ముందు మీకు తినిపిస్తున్నాను అని అంటుంది జానకి. అత్తయ్య గారు తినండి అంటుంది. నువ్వు నన్ను అమ్మలా భావిస్తున్నావా? అంత పెద్ద అబద్ధం చెప్పి నువ్వు నన్ను ఎలా అమ్మలా భావిస్తావు. నేను కనీసం నీ ముఖం కూడా చూడలేకపోతున్నాను అని అనుకుంటుంది జ్ఞానాంబ. మొత్తానికి జానకి బర్త్ డే సెలబ్రేషన్స్ అయిపోతాయి.

janaki kalaganaledu 15 october 2021 episode
తెల్లారాక కూడా జ్ఞానాంబ అలాగే కూర్చొని ఉంటుంది. మరోవైపు నా కోడలు బంగారం. ఈ ఇంటిని ఈ ఇంటి మనుషులను నా కోడలు ఎంత బాగా అర్థం చేసుకుంటుందో అని అంటాడు గోవిందరాజులు. మా అమ్మ జాగ్రత్తగా చూసుకున్నట్టు నువ్వు నన్ను చూసుకుంటున్నావు అమ్మా అని అంటాడు గోవిందరాజు.
జానకి చాయ్ చేయడానికి కిచెన్ కు వెళ్లడంతో.. జానకిని చూడటానికి రామా కిచెన్ లోకి వెళ్తాడు. అక్కడ తనతో సరసాలు ఆడేందుకు ప్రయత్నిస్తాడు కానీ.. జానకి ఒప్పుకోదు. నాకు సిగ్గేస్తుంది అని అంటుంది జానకి. తన చేయి పట్టుకుంటాడు రామా. వదలండి.. అని చెప్పి చాయ్ చేయబోతుంటే తనతో పాటు రామా కూడా చాయ్ తయారు చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.