Janaki Kalaganaledu 16 Aug Today Episode : జానకి డిగ్రీ పట్టా తీసుకుంటుండగా చూసిన జ్ఞానాంబ.. జానకి చదువు గురించి అసలు నిజం తెలుసుకొని జ్ఞానాంబ ఏం చేస్తుంది?

Janaki Kalaganaledu 16 Aug Today Episode : జానకి కలగనలేదు సీరియల్ శనివారం, ఆదివారం ప్రసారం కాలేదు. శుక్రవారం తర్వాత డైరెక్ట్ గా సోమవారం అంటే ఈరోజు ప్రసారం కానుంది. 16 ఆగస్టు 2021, సోమవారం.. జానకి కలగనలేదు సీరియల్ 106 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. జానికిని ఒక చోటుకు తీసుకెళ్తా.. అని చెప్పి రామా తనను కాలేజీకి తీసుకెళ్తాడు. బైక్ మీద ఇద్దరూ వెళ్తారు. తనను కాలేజీకి తీసుకొచ్చే సరికి.. చూసి ఆశ్చర్యపోతుంది జానకి. తెగ సంతోష పడుతుంది. ఈరోజు నాకు గ్రాడ్యుయేషన్ డే అని అస్సలు గుర్తు లేదు నాకు. మీకెలా తెలుసండి.. అని అంటుంది జానకి.

Janaki Kalaganaledu 16 august 2021 monday episode 106 highlights

కళ్లల్లో కన్నీళ్లు రాకూడదని ఎన్నిసార్లు చెప్పాను చెప్పడి.. మీరు అస్సలు ఏడవకూడదు.. అంటూ కన్నీళ్లు తూడుస్తాడు రామా. ఇప్పుడు చెప్పనా? ఇది చాలా పెద్ద రహస్యం.. ఎవ్వరికీ చెప్పకూడదు. మనమధ్యే ఉండాలి మరి. నాకు కొన్ని అద్భుతమైన శక్తులతో పాటు దివ్యనేత్రం కూడా ఉంది. ఆ నేత్రం అలా తెరవగానే.. మీ విషయాలన్నీ నాకు తెలిసిపోతాయి అన్నమాట.. అంటూ ఏదేదో చెబుతాడు రామా.

Janaki Kalaganaledu 16 august 2021 monday episode 106 highlights

ఏంటండి మీరు.. రహస్యం అనగానే అదేంటో అనుకొని నేను టెన్షన్ గా వినడం మొదలుపెట్టాను. మీరు డిగ్రీ పట్టా పొందారు కదా.. అది అందుకోవడం ఇంపార్టెంట్.. నాకు ఎలా తెలిసింది అనేది తర్వాత చెబుతాను.. అని చెప్పి జానకిని కాలేజీ లోపలికి తీసుకెళ్తాడు. ఇంతలోనే జానకి అంటూ తన ఫ్రెండ్ శ్రావణి పిలుస్తుంది. సడెన్ సర్ ప్రైజ్ అంటుంది జానకి. నీకు సర్ ప్రైజ్ కానీ నాకు షాక్. మీ ఆయనకు నీ చదువు గురించి తెలిసిపోయిందా? అంటుంది. అవును తెలిసిపోయింది. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.. అని శ్రావణితో అంటాడు రామా. రామచంద్రగారు మీరు చాలా గ్రేట్ అండి. భార్యను కట్నం తీసుకురమ్మని.. ఆస్తులు తీసుకురమ్మని వేధించే భర్తలు చాలామంది ఉన్నారు. కానీ.. మీరు మాత్రం తన కలను నిజం చేస్తున్నారు.. గ్రేట్ అండి అంటుంది.

Janaki Kalaganaledu 16 august 2021 monday episode 106 highlights

భార్య ఇష్టాన్ని ఎవరు కాదంటారండీ.. అందులోనే సంతృప్తి ఉంటుంది.. అని చెబుతాడు రామా. గ్రేట్ అండి మీరు గ్రేట్ అంటుంది శ్రావణి. వెళ్దాం పదండి.. అని లోపలికి వెళ్తారు.

Janaki Kalaganaledu 16 august 2021 monday episode 106 highlights

కట్ చేస్తే.. అన్నవరానికి వెళ్తుంది జ్ఞానాంబ. ప్రతి సంవత్సరం తప్పకుండా మీరు అన్నవరం వచ్చి అన్నప్రసాదాలు ఇవ్వడం చాలా సంతోషం.. అంటారు దేవాలయ సిబ్బంది. స్వీట్లు వాళ్లకు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లబోతుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 16 august 2021 monday episode 106 highlights

ఇంతలోనే తన ఖార్ఖానాలో పనిచేసిన సూరిబాబు అనే వ్యక్తి కలుస్తాడు. బాగున్నారా అమ్మ.. అని పలకరిస్తాడు. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది జ్ఞానాంబ. ఇంతలోనే కాలేజీకి వెళ్తున్నారా? అమ్మా అని అడుగుతాడు సూరిబాబు. నేను కాలేజీకి ఎందుకు వెళ్తాను.. అని అనగానే.. రామచంద్రబాబు.. తమ కోడలిని తీసుకొని కాలేజీకి వెళ్లారు అని చెబుతాడు. దీంతో షాక్ అవుతుంది. మా అబ్బాయి కోడలు కాలేజీ దగ్గరికి రావడం ఏంటి? అని అడుగుతుంది. అవును అమ్మా.. కాలేజీ దగ్గర స్వీట్లు డెలివరీ చేస్తూ వస్తుండగా నేను చూశాను అంటాడు. దీంతో షాక్ కు గురయి.. వెంటనే కారులో కాలేజీకి బయలు దేరుతుంది జ్ఞానాంబ. ఖార్ఖానాలో ఉండాల్సిన జానకి.. కొట్టులో ఉండాల్సిన రామా.. ఇక్కడికి ఎందుకు వచ్చారు. వాళ్లకు కాలేజీలో ఏం పని.. అని కారులో తనలో తాను అనుకుంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 16 august 2021 monday episode 106 highlights

Janaki Kalaganaledu 16 Aug Today Episode : తన డిగ్రీ పట్టాలను రామాకు అంకితం ఇచ్చిన జానకి

కట్ చేస్తే కాలేజీ గ్రాడ్యుయేషన్ డ్రెస్ వేసుకొని కూర్చుంటుంది జానకి. జానకిని తదేకంగా చూస్తూ కూర్చుంటాడు రామా. మీరు నల్లకోటులో లాయర్ గా బాగున్నారు. ఎవ్వరైనా మీరు లాయర్ అంటే నమ్మేస్తారు.. అంటాడు. సరే.. పదండి అయితే కోర్టుకు.. అంటుంది జానకి. అలా.. ఇద్దరూ జోకులు వేసుకుంటూ తెగ నవ్వుతుంటారు.

Janaki Kalaganaledu 16 august 2021 monday episode 106 highlights

జాను.. పెళ్లి తర్వాత నీ లైఫ్ ఎలా మారుతుందోనని చాలా భయపడిపోయాను. ఇంతలా మారిపోతుందనుకోలేదు.. అని శ్రావణి అనగానే నా ఆనందానికి కారణం మా ఆయనే. చాలా మంచి భర్త.. దొరకడం నా అదృష్టం.. అంటుంది జానకి. ఇంతలోనే గ్రాడ్యుయేషన్ డే స్టార్ట్ అవుతుంది.

Janaki Kalaganaledu 16 august 2021 monday episode 106 highlights

గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా డిగ్రీ సర్టిఫికెట్ల ప్రదానోత్సవం జరుగుతుంది. ఒక్కొక్కరు వచ్చి సర్టిఫికెట్లు తీసుకుంటారు. అయితే.. రామా వాళ్ల ఊరికి చెందిన వైజయంతి కూడా తన కూతురుతో గ్రాడ్యుయేషన్ సెరమనికి వస్తుంది. గ్రాడ్యుయేషన్ సెరమనికీ తను రావడం రామా చూస్తాడు. జానకకి చెప్పడంతో.. షాక్ అవుతారు. ఈ డిగ్రీ సర్టిఫికెట్ వద్దూ.. ఏదీ వద్దూ అని చెబుతుంది జానకి. వద్దు.. నువ్వు డిగ్రీ సర్టిఫికెట్ తీసుకోవాలి అని చెబుతాడు రామా. నేను ఏదో ఒకటి చేసి మీరు డిగ్రీ పట్టా తీసుకునేలా చేస్తా అంటాడు రామా. మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి.. బయటికి వచ్చేస్తాడు రామా.

Janaki Kalaganaledu 16 august 2021 monday episode 106 highlights

బయటికి వెళ్లి సెక్యూరిటీ గార్డ్ ఫోన్ తీసుకొని.. తనకు ఫోన్ చేసి చైర్మన్ గారు రమ్మంటున్నారు అంటూ అబద్ధం చెబుతాడు రామా. దీంతో తను బయటికి వెళ్తుంది. తను చైర్మన్ రూమ్ కు వెళ్లి అక్కడ కూర్చుంటుంది. ఇంతలో రామా.. ఫాస్ట్ గా గ్రాడ్యుయేషన్ రూమ్ లోకి వెళ్తాడు. ఇంతలోనే జానకి పేరు పిలుస్తారు. కానీ.. రామా ఇంకా రాడు. రామా పరిగెత్తుకుంటూ వస్తుంటాడడు. ఇంతలోనే రామా అక్కడికి వస్తాడు. తనను చూసి పట్టా తీసుకుంటుంది జానకి. ఇంతలోనే జ్ఞానాంబ కాలేజీకి వస్తుంది. గ్రాడ్యుయేషన్ డేలో పట్టా తీసుకున్నాక.. జానకి స్టేజ్ మీద మాట్లాడుతుంది. ఒక్క విషయం మాత్రం చెప్పగలను.. నా భర్త నా బెస్ట్ ఫ్రెండ్.. నా బెస్ట్ హస్బెండ్. ఐలవ్యూ.. అని చెప్పి.. ఆ పట్టాను తన భర్తకే ఇచ్చేస్తుంది. అంతలోనే అక్కడికి జ్ఞానాంబ వస్తుంది. జ్ఞానాంబ పట్టాను రామాకు ఇవ్వడం చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం మంగళవారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Janaki Kalaganaledu 16 august 2021 monday episode 106 highlights

ఇది కూడా చ‌ద‌వండి ==> మోనిత చనిపోలేదు.. బతికే ఉంది.. చనిపోయినట్టు ఎందుకు మోనిత యాక్ట్ చేస్తోంది? ఎందుకు ఎవ్వరికీ కనిపించకుండా బతుకుతోంది?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆయన మా ఆయన.. ఏం రాస్తారో.. ఎలా రాస్తారో ఇప్పుడు రాయండి : నయనతార

ఇది కూడా చ‌ద‌వండి ==> జాతీయ జెండాను అవమానించిన రామ్ చరణ్? భగ్గుమంటున్న నెటిజన్లు?

ఇది కూడా చ‌ద‌వండి ==> బిగ్‌బాస్‌లోకి పాపులర్ డ్యాన్స్ మాస్టర్ కపుల్ ఎంట్రీ..పోల్ పెట్టిమరీ లీక్ చేశారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago