Janaki Kalaganaledu 16 Aug Monday Episode Highlights : జానకి పెద్ద చదువులు చదివిన విషయం జ్ఞానాంబకు తెలిసిపోయిందా? అందుకే.. జానకిని వెతుక్కుంటూ కాలేజీకి వచ్చిందా?
Janaki Kalaganaledu 16 Aug Monday Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు అంటే శనివారం ప్రసారం కాదు. శని, ఆది వారాల్లో ఈ సీరియల్ ప్రసారం కాదు. మళ్లీ 16 ఆగస్టు, సోమవారం రోజున ప్రసారం కానుంది. అయితే.. సోమవారం ఎపిసోడ్ 106లో జరిగే విషయాలు ఏంటో.. ఆ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

janaki kalaganaledu 16 august 2021 monday episode 106 highlights
జ్ఞానాంబకు తెలియకుండా.. జానకిని తన కాలేజీకి తీసుకెళ్తాడు రామా. తన డిగ్రీ పట్టా కాన్వకేషన్ సందర్భంగా అక్కడ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ ఉండటంతో.. రామా.. తన భార్య జానకిని.. తన తల్లి చీర కట్టుకోమని చెప్పి తీసుకెళ్తాడు. రామా చెప్పినట్టే జానకి తన అత్తయ్య చీర కట్టుకొని నగలు వేసుకొని ఖార్ఖానా నుంచి రామాతో బయటికి వెళ్తుంది. అయితే.. తనను ఎక్కడికి తీసుకెళ్లేది రామా వెంటనే చెప్పడు.

janaki kalaganaledu 16 august 2021 monday episode 106 highlights
డైరెక్ట్ గా కాలేజీకి తీసుకెళ్లే సరికి.. జానకి ఆశ్చర్యపోతుంది. చాలా సంతోషపడుతుంది. గ్రాడ్యుయేషన్ వేడుకల్లో సంతోషంగా పాల్గొంటుంది. అయితే.. అదే సమయానికి.. కాలేజీకి జ్ఞానాంబ కూడా వస్తుంది. జ్ఞానాంబ వచ్చిన విషయాన్ని జానకి తెలుసుకోదు. రామా కూడా సెలబ్రేషన్స్ టైమ్ లో జానకినే చూస్తూ కూర్చుంటాడు. కానీ.. చుట్టు పక్కన చూడడు. జానకి కూడా సంతోషంతో తన అత్తయ్య కాలేజీకి వచ్చిన విషయాన్ని గమనించదు.

janaki kalaganaledu 16 august 2021 monday episode 106 highlights
అప్పుడే కారు దిగి జ్ఞానాంబ కాలేజీలోకి అడుగుపెడుతుంది. మెల్లగా గ్రాడ్యుయేషన్ సెరమనీ జరిగే హాల్ వైపు అడుగులు వేస్తుంటుంది. రామా మాత్రం కన్నార్పకుండా జానకి వైపే చూస్తుంటాడు.

janaki kalaganaledu 16 august 2021 monday episode 106 highlights
Janaki Kalaganaledu 16 Aug Monday Episode Highlights : జ్ఞానాంబ జానకిని చూస్తుందా?
అయితే.. జ్ఞానాంబ కాలేజీకి ఎందుకు వచ్చింది అనేదే పెద్ద సస్పెన్స్. ఒకవేళ.. రామా.. జానకిని కాలేజీకి తీసుకెళ్లాడనే విషయం తనకు తెలిసిందా? అందుకే.. వాళ్లను వెతుక్కుంటూ కాలేజీకి వచ్చిందా? అనే విషయం తెలియదు. ఒకవేళ తనను గ్రాడ్యుయేషన్ సెరమనీకి గెస్ట్ గా కాలేజీ నిర్వాహకులు పిలిచి ఉంటారు.. అని కూడా అనుకోవచ్చు. లేదంటే.. జానకి గురించి అసలు విసయం తెలుసుకొని అక్కడికి వచ్చి ఉండొచ్చు. ఏది ఏమైనా.. సోమవారం ఎపిసోడ్ లో జానకి చదువు గురించి.. జ్ఞానాంబకు తెలుస్తుందా? లేదా? అనే విషయంపై క్లారిటీ వస్తుంది. జానకి.. 5వ తరగతి వరకు మాత్రమే చదువుకోలేదు. తను డిగ్రీ చేసింది.. ప్రస్తుతం ఐపీఎస్ కు ప్రిపేర్ అవుతోందని జ్ఞానాంబకు తెలిస్తే మాత్రం కొంప కొల్లేరు అవ్వడం ఖాయం. జ్ఞానాంబ ఇంట్లో గొడవలు జరగడంతో పాటు.. జానకి, రామాను ఇద్దరినీ జ్ఞానాంబ ఇంట్లో నుంచి బయటికి పంపించే అవకాశం కూడా ఉంది.

janaki kalaganaledu 16 august 2021 monday episode 106 highlights
ఒకవేళ.. జానకిని కాలేజీకి తీసుకెళ్తుంటే మల్లిక చూసి.. జ్ఞానాంబ అన్నవరం నుంచి తిరిగి రాగానే అసలు విషయం చెప్పి ఉండొచ్చు. జానకిని.. ఖార్ఖానా నుంచి రామా తీసుకెళ్లాడని అసలు విసయం జ్ఞానాంబకు మల్లిక చెప్పి ఉండొచ్చు. అందుకే.. ఆవేశంగా.. జ్ఞానాంబ కాలేజీకి వచ్చింది. తన మాట కాదని.. రామా.. జానకిని బయటికి ఎందుకు తీసుకొచ్చాడన్న కోపంతో జ్ఞానాంబ కాలేజీకి హడావుడిగా వచ్చింది.

janaki kalaganaledu 16 august 2021 monday episode 106 highlights
లేదంటే జానకికి బట్టలు తెచ్చి ఇచ్చిన రజినీ ఈ విషయాన్ని జ్ఞానాంబకు చెప్పి ఉంటాడా? లేక.. రజినీ.. మల్లికకు ఈ విషయం చెప్పి ఉంటాడో తెలియదు. ఒకవేళ రజినీ ద్వారా మల్లిక ఈ విషయం తెలుసుకొని ఈ విషయాన్ని జ్ఞానాంబకు చెప్పి.. అప్పుడు జ్ఞానాంబ కాలేజీకి వెళ్లి ఉండొచ్చు. ఏది ఏమైనా.. ఈ సందేహాలకు సమాధానం దొరకాలంటే మాత్రం సోమవారం ఎపిసోడ్ ప్రసారం అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

janaki kalaganaledu 16 august 2021 monday episode 106 highlights