Janaki Kalaganaledu 17 June Today Episode : రామా గెలవకుండా కన్నబాబు, సునంద ఆపుతారా? ఫైనల్ రౌండ్ లో ఏం జరిగింది? రామాకు చాన్స్ ఇచ్చారా?

Authored By Varun G | The Telugu News | Updated on : 17 June 2022, 11:30 am

Janaki Kalaganaledu 17 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 జూన్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 325 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామాకు 5 నిమిషాల సమయం ఇస్తాడు చెఫ్ సంజయ్. అందరూ జ్ఞానాంబ కోసం ఎదురు చూస్తుంటారు. ఒకవేళ 5 నిమిషాల్లో రాకపోతే.. రామాను ఈ పోటీ నుంచి ఎలిమినేటర్ చేస్తామని అంటాడు సంజయ్. దీంతో వచ్చేస్తారు సార్.. 5 నిమిషాల్లో వస్తారు అంటుంది జానకి. మరోవైపు టీవీలో విష్ణు, చికిత, మల్లిక చూస్తుంటారు. జ్ఞానాంబ రూమ్ నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా.. ఇంతలో రూమ్ బాయ్ బయటి నుంచి లాక్ వేస్తాడు. డోర్ రాకపోవడంతో జ్ఞానాంబకు ఏం చేయాలో అర్థం కాదు. టైమ్ అవుతోందని ఒకసారి తను బయలుదేరిందో లేదో కనుక్కో అని గోవిందరాజు ఫోన్ ఇస్తాడు. దీంతో హోటల్ కు ఫోన్ చేస్తుంది జానకి. రూమ్ నెంబర్ 108 కు కనెక్ట్ చేయండి అని అడుగుతుంది. దీంతో ఫోన్ కనెక్ట్ అవడం లేదు అంటుంది రిసెప్షనిస్ట్. దీంతో జానకికి ఏం చేయాలో అర్థం కాదు.

janaki kalaganaledu 17 june 2022 full episode

janaki kalaganaledu 17 june 2022 full episode

కొడుకును గెలిపించుకోవడం కోసం జ్ఞానం తప్పకుండా వస్తుందని అనుకున్నా కానీ.. ఫోన్ కలవకపోవడం ఏంటి అని అంటాడు గోవిందరాజు. అత్తయ్య గారు రాకపోవడానికి కారణం ఏంటో అర్థం కావడం లేదు మామయ్య గారు అంటుంది జానకి. మరోవైపు సమయం మించిపోతూ ఉంటుంది. రామచంద్రా.. మీరు అడిగిన 5 నిమిషాల సమయం అయిపోయింది. ఇక.. మీరు మాస్టర్ చెఫ్ పోటీల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్నాం అంటాడు చెఫ్. దీంతో ఏం చేయాలో రామాకు అర్థం కాదు. మరోవైపు ఎంత డోర్ కొట్టినా బయటి నుంచి ఎవ్వరూ డోర్ తీయరు. దీంతో ఏం చేయలేకపోతుంది జ్ఞానాంబ. కానీ.. రామా మాత్రం ఎలాగైనా ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేసి 5 లక్షలు గెలవాలని అనుకుంటాడు. దాని కోసం నాకు ఎవ్వరూ సాయం చేయకున్నా పర్వాలేదు. నేను ఒక్కడినే ఈ ఫైనల్ పోటీలో పాల్గొంటా అని చెఫ్ కు రిక్వెస్ట్ పెట్టుకుంటాడు రామా. దీంతో సరే నీ ఇష్టం అంటారు జడ్జిలు. పోటీలు ప్రారంభం అవుతాయి. గోవిందరాజు, జానకి షాక్ అవుతారు. మీరు ఇలా కష్టపడుతూ ఈ పోటీల్లో పాల్గొనాల్సిన అవసరం లేదు. వెళ్లిపోదాం అంటుంది జానకి. దీంతో రామా వినడు.

చేయి కదిపితే ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పారు. మీకు ఏదైనా అయితే.. నేను తట్టుకోలేను. వెళ్లిపోదాం రామా గారు. పోటీ వద్దు.. ఏది వద్దు వెళ్లిపోదాం రండి అంటుంది జానకి. గోవిందరాజు చెప్పినా కూడా రామా వినడు. మిస్టర్ రామచంద్ర.. మీరు అలా ఇబ్బంది పడుతూ కంటిన్యూ చేయడం మంచిది కాదు అని అంటాడు చెఫ్.

అయినా కూడా రామా వినడు. మీకు దండం పెడతాను మీరు ఇక్కడి నుంచి వెళ్లండి అని జానకి, గోవిందరాజును అక్కడి నుంచి పంపించేస్తాడు రామా. ఆ తర్వాత పూతరేకులు చేయడం ప్రారంభిస్తాడు రామా. మరోవైపు రూమ్ సర్వీస్ వాళ్లు బయట క్లీన్ చేస్తుండగా.. జ్ఞానాంబ డోర్ కొడుతుంది. బయట ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. దీంతో అతడు ఎవరు డోర్ కొడుతున్నారని వెళ్లి చూస్తాడు.

మరోవైపు ఒంటి చేతితోనే రామా పూతరేకులు చేస్తుంటాడు. తన చేయి నొప్పి పుట్టినా కూడా ఏమాత్రం వెనుదిరగకుండా చేస్తుంటాడు. రూమ్ బాయ్ డోర్ తీయడంతో జ్ఞానాంబ వెంటనే పోటీల దగ్గరికి బయలుదేరుతుంది. తనకు ఒక్క చేయితో చేయడం ఇబ్బంది కావడంతో తనకు దెబ్బ తాకిన చేయి కట్టను విప్పేసి ఎంత కష్టం అయినా ఆ చేయితో చేయడం ప్రారంభిస్తాడు.

Janaki Kalaganaledu 17 June Today Episode : రామా చేసిన పూతరేకులను టేస్ట్ చేసిన జడ్జిలు

ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. మీకు ఇంకా 10 నిమిషాల సమయం మాత్రమే ఉంది అని అంటుంది యాంకర్. ఇంకా వేగంగా పూతరేకులు చేస్తుంటాడు రామా. మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంటుంది యాంకర్. తర్వాత అందరినీ ఆపేస్తుంది. ముగ్గురు చేసిన వంటకాలను టేస్ట్ చేస్తారు జడ్జిలు.

రామా చేసిన పూతరేకులను కూడా టేస్ట్ చేస్తారు ముగ్గురు జడ్జిలు. ఈ రౌండ్ లో ఎలిమినేట్ ఎవరు అయ్యారో జడ్జి సంజయ్ చెబుతాడు. ఈ రౌండ్ లో ఎలిమినేట్ అయిన వ్యక్తి మిస్టర్ విక్రమ్ అని అంటాడు చెఫ్. మిగిలిన ఇద్దరిలో ఫైనల్ విజేత ఎవరూ అంటే.. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ఇంకాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది అంటాడు.

ఆ విజేతను మన చీఫ్ గెస్ట్ ప్రభా గారు అనౌన్స్ చేస్తారు అంటాడు సంజయ్. దీంతో ప్రభ వస్తుంది. ఆ విజేత ఎవరో తెలుసుకోవాలనుకుంటే.. ప్రభ గారి మాటల్లో విందాం అని యాంకర్ చెబుతుంది. ప్రభ మాట్లాడుతుంది. చాలా ఉత్కంఠ భరితంగా సాగిన చెఫ్ కాంపిటిషన్ లో చివరగా ఇద్దరు మిగిలారు అంటుంది ప్రభ.

ఈ ఇద్దరిలో ఫైనల్ గా నిలిచి.. ఆ 5 లక్షల ప్రైజ్ తీసుకునేది ఎవరో మరికొద్ది సేపట్లో మీరు తెలుసుకోబోతున్నారు అంటుంది ప్రభ. ఫైనల్ పోటీల్లో గెలిచిన విజేత ఎవరో కాదు.. మన రామచంద్ర గారు.. ఫ్రమ్ ఆత్రేయపురం అంటుంది ప్రభ. దీంతో జానకి సంతోషిస్తుంది.

రాముడు గెలిచాడు.. అని గోవిందరాజు సంతోషిస్తాడు. జ్ఞానాంబ కూడా సంతోషిస్తుంది. కన్నబాబు, సునందకు మాత్రం చాలా కోపం వస్తుంది. ఎంతో దూరం నుంచి.. ఎన్నో అవమానాలను భరించి.. తన చేయి బాగోలేకపోయినా గెలవాలనే పట్టుదలతో ఈరోజు విజేతగా నిలిచారు మిస్టర్ రామచంద్ర అంటుంది ప్రభ.

ఇంతలో రామాచంద్రాను స్టేజ్ మీదికి పిలుస్తారు. నేను గెలుచుకున్న ఈ బహుమతిని మా అమ్మ చేతుల మీదుగా తీసుకోవాలని ఆశ పడుతున్నాను అంటాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి