Janaki Kalaganaledu 17 May Today Episode : జానకి కన్నబాబుతో గొడవ పెట్టుకున్న విషయం తెలుసుకొని జ్ఞానాంబ షాక్.. ఇంతలో జానకికి బిగ్ షాక్

Authored By Varun G | The Telugu News | Updated on : 17 May 2022, 11:30 am

Janaki Kalaganaledu 17 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 మే 2022, మంగళవారం ఎపిసోడ్ 302 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ కన్నబాబుతో జానకి గొడవ పడిందని.. వార్నింగ్ కూడా ఇచ్చిందని జ్ఞానాంబతో మల్లిక చెబుతుంది. అప్పుడే జానకి వస్తుంది. దీంతో అడగండి అత్తయ్య గారు.. అడగండి అని మల్లిక అంటుంది. జానకి మల్లిక చెప్పేది నిజమా అంటుంది జ్ఞానాంబ. దీంతో అది అత్తయ్య గారు అది అంటూ ఏం చెప్పాలో అర్థం కాదు జానకికి. అదీ ఇదీ అని నీళ్లు నములుతోందంటే ఒప్పుకున్నట్టే కదా అత్తయ్య గారు అంటుంది మల్లిక. మాట్లాడవేంటి అని అడుగుతుంది జ్ఞానాంబ. నువ్వు కన్నబాబు వాళ్లు ఇంటికి వెళ్లి వాళ్లతో గొడవ పడ్డావా అని అడుగుతుంది జానకి.

janaki kalaganaledu 17 may 2022 full episode

janaki kalaganaledu 17 may 2022 full episode

దీంతో అత్తయ్య గారు ఒకసారి నేను చెప్పేది వినండి అని అడుగుతుంది జానకి. మళ్లీ ఇప్పుడు ఇంటి పరువును రోడ్డున పడేయాలనుకున్నావా అని అడుగుతుంది. దీంతో దీని కోసం వెళ్లాను అని ఒక పార్సిల్ ఇస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో తమ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. జ్ఞానాంబకు మదర్స్ డే వేడుకలు చేస్తున్న ఫోటో అది. ఈ ఫోటోను ప్రేమ్ కట్టించి ఇవ్వమని మొన్న ఆర్డర్ ఇచ్చాను అత్తయ్య గారు. ఈరోజు ఇస్తామని చెబితే వెళ్లాను.. అంటుంది జానకి. దీంతో ఇప్పటికిప్పుడు జానకి ఏం కథ అల్లింది అని అంటుంది మల్లిక. జానకి కథల దెబ్బకు నాకు దిమ్మ తిరిగి బొమ్మ కదిలింది అని అంటుంది మల్లిక. దీంతో అమ్మ తాలింపుల మల్లిక.. ఇక చాలులే ఆపు అంటాడు గోవిందరాజు.

నన్ను క్షమించు మల్లిక అని మనసులో అనుకుంటుంది జానకి. అత్తయ్య గారు నేను చెప్పేది నిజం నన్ను నమ్ము అంటుంది. దీంతో జ్ఞానాంబ.. మల్లిక మీద సీరియస్ అయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ కన్నబాబు అసలే స్వీటు షాపునకు వచ్చి గొడవ చేశాను. అమ్మకు ఆ విషయం తెలియకూడదని నాలో నేను భయపడి చస్తున్నా. ఈ సమయంలో మీరు వెళ్లి అతడితో ఎందుకు గొడవ పడ్డారు అని జానకిని అడుగుతాడు రామా.

నేను చేతులు కట్టుకొని కూర్చోవాలా అని అంటుంది జానకి. నా భర్త బాధపడటానికి కారణం అయిన వాడి మీద నాకు కోపం ఉండదా? ఆ కోపాన్ని చూపించకుండా ఎలా ఉండగలను రామా గారు అంటుంది జానకి. ఆ కన్నబాబు మన ఇంటికి వచ్చి గొడవ చేస్తే ఎలా అంటాడు.

దీంతో అతడు రాడు అంటుంది జానకి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కోర్టుకు వెళ్తాను అని చెప్పాను అంటుంది జానకి. వారం రోజుల్లో వాడి డబ్బులు వాడికి ఇచ్చేసి ఆ కాగితాలు తీసేసుకుందాం అంటుంది జానకి. వారం రోజుల్లో అతడి డబ్బులు అతడికి తిరిగి ఇచ్చేసి మీరు సంతకం పెట్టిన కాగితాలు అతడి దగ్గరి నుంచి తీసుకురావడం గురించి ఇప్పుడు మనం ఆలోచించాలి అంటుంది జానకి.

Janaki Kalaganaledu 17 May Today Episode :  కన్నబాబు అప్పు ఎలా తీర్చాలా అనే టెన్షన్ లో రామా, జానకి

ఎవరిని అప్పు అడగాలో అర్థం కావడం లేదు.. అంటాడు రామా. మీ చదువు విషయం, స్వీటు కొట్టు తాకట్టు విషయం అన్నీ బయటపడిపోతాయి అంటాడు రామా. మరోవైపు మల్లిక టింగరితనంపై విష్ణుకు కోపం వస్తుంది. కానీ.. జానకి వచ్చి విష్ణుకు సర్దిచెబుతుంది.

మల్లిక నిన్ను ఏ విధంగా ఇబ్బంది పెడదామా అని ఆలోచిస్తూనే ఉంటుంది. కానీ.. మీరు మాత్రం తన మంచి గురించి ఆలోచిస్తున్నారు. మీరు నిజంగా గ్రేట్ వదిన అంటాడు విష్ణు. మల్లిక ఊరు వెళ్లడంతో.. మల్లిక తిరిగి రావడానికి 4 రోజులు పడుతుంది కాబట్టి.. మనం ప్రశాంతంగా ఉండొచ్చు అంటాడు రామా.

మరోవైపు కోచింగ్ కు వెళ్లి వస్తుండగా.. లూసీ చెప్పిన ఫుడ్ కాంపిటిషన్ గురించి గుర్తు తెచ్చుకుంటుంది జానకి. ఎలా అయినా రామాను కాంపిటిషన్ కు పంపించాలని అనుకుంటుంది జానకి. అదే విషయాన్ని జ్ఞానాంబకు చెబుతుంది. కానీ.. జ్ఞానాంబ మాత్రం వద్దు అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి