Janaki Kalaganaledu 20 Sep Tomorrow Episode : వైజయంతి కూతురు ప్రాణాలను జానకి రక్షిస్తుందా? ఆ యువతిని ఏడిపించిన వ్యక్తి ఎవరు? జానకి చదువు విషయం తెలుసుకున్న జ్ఞానాంబ.. జానకికి ఏ శిక్ష వేస్తుంది?

janaki kalaganaledu 20 september 2021 monday latest episode 131
Janaki Kalaganaledu 20 Sep Tomorrow Episode : జానకి కలగనలేదు సీరియల్ ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారం కాదు. అంటే ఈరోజు ఆదివారం కాబట్టి.. ఈరోజు కూడా ప్రసారం కాదు. తిరిగి.. జానకి కలగనలేదు సీరియల్ 20 సెప్టెంబర్ 2021, సోమవారం రోజున ప్రసారం అవుతుంది.

janaki kalaganaledu 20 september 2021 monday latest episode 131
అయితే.. శుక్రవారం వరకు ఏం జరిగిందో మనకు తెలుసు. శుక్రవారం ఎపిసోడ్ లో వైజయంతి.. జానకిని బెదిరిస్తుంది. వినాయక చవితి రోజు కాబట్టి.. జానకి చదువు విషయం చెప్పకుండా దాచిపెట్టిన వైజయంతి.. సాయంత్రం ఇంటికిరా.. మాట్లాడుదాం… అని జానకిని పిలుస్తుంది. దీంతో జానకి వైజయంతి ఇంటికి వెళ్తుంది. వెళ్లగానే.. డిగ్రీ పట్టా తీసుకుంటున్న ఫోటోను చూపించి.. ఈ ఫోటోలో ఉన్నది నువ్వేనా అని జానకిని ప్రశ్నిస్తుంది వైజయంతి.

janaki kalaganaledu 20 september 2021 monday latest episode 131
దీంతో జానకికి ఏం చెప్పాలో అర్థం కాక కాసేపు మౌనంగా ఉంది. మరోసారి గట్టిగా వైజయంతి అడిగేసరికి.. తప్పని పరిస్థితుల్లో జానకి.. అవును.. నేను అని చెబుతుంది.
అంటే.. నువ్వు 5 వ తరగతి వరకు చదువుకోలేదన్నమాట. నువ్వు చదివింది డిగ్రీ అన్నమాట. చదువుకోలేదని అబద్ధం చెప్పి.. జ్ఞానాంబ కోడలివయ్యావా? అని ప్రశ్నిస్తుంది. ఎందుకింత మోసం చేశావు అని అడగగానే.. లేదండి..నేను కావాలని చేయలేదు. అసలు.. నాకు పెళ్లికి ముందు ఈ విషయమే తెలియదు. పెళ్లి తర్వాత తెలిసింది.. అని అంటుంది. పెళ్లి తర్వాత తెలిస్తే వెంటనే ఎందుకు మీ అత్తయ్యకు చెప్పలేదు అని ప్రశ్నిస్తుంది వైజయంతి.

janaki kalaganaledu 20 september 2021 monday latest episode 131
మా అన్నయ్య నాకు ఈ విషయం తెలియకుండా.. దాచిపెట్టి పెళ్లి చేశాడు. పెళ్లయ్యాక.. ఈ విషయం అత్తయ్య గారికి చెబుదామని చాలాసార్లు అనుకున్నా కానీ.. కుదరలేదు. చెప్పే ధైర్యం చేయలేకపోయాను. చెబితే ఎక్కడ నా కాపురం కూలిపోతుందోనని భయపడ్డాను.. అని జానకి.. వైజయంతితో చెబుతుంది.
Janaki Kalaganaledu 20 Sep Tomorrow Episode : ఎందుకు జ్ఞానాంబను మోసం చేశావంటూ జానకిని ప్రశ్నించిన వైజయంతి
అంటే.. నీ కాపురం కూలిపోకూడదని.. ఇలా అబద్ధాలు చెబుతూ బతికేస్తున్నావా? నువ్వు ఈ విషయం ఇన్ని రోజులు జ్ఞానాంబ దగ్గర దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశావు. కానీ.. నేను కూడా ఆ తప్పు చేయదల్చుకోలేదు. ఈ విషయం ఎలాగైనా జ్ఞానాంబకు చెబుతాను. నీకు తెలిశాక కూడా నువ్వెందుకు ఈ విషయం మాకు చెప్పలేదు.. అని జ్ఞానాంబ నన్ను అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి. ఇక నువ్వు వెళ్లిపో. నువ్వు వచ్చిన పని అయిపోయింది.. అని జానకిని బెదిరిస్తుంది వైజయంతి. జానకి ఎంత చెప్పినా వినదు. సీరియస్ గా ఇక్కడి నుంచి వెళ్లిపో.. అంటుంది. దీంతో జానకి.. గుక్కపెట్టి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

janaki kalaganaledu 20 september 2021 monday latest episode 131
వెంటనే జ్ఞానాంబకు ఫోన్ చేసి అర్జెంట్ గా నిన్ను కలవాలి.. ఇంటికిరా అని చెబుతుంది. దీంతో వెంటనే జ్ఞానాంబ.. వైజయంతి ఇంటికి బయలుదేరుతుంది.
ఇంతలో రామా.. జానకికి ఫోన్ చేస్తాడు. జరిగిన విషయం మొత్తం రామాకు చెబుతుంది జానకి. సరే.. ఏదైతే అది అయింది. ఏం జరిగినా దానికి మనం సిద్ధంగా ఉందాం.. అని చెప్పి.. కొట్టు దగ్గరికి రమ్మని చెబుతాడు.
ఇక.. జానకి ఏడ్చుకుంటూనే.. కొట్టు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంటుంది. ఇంతలో అక్కడ వైజయంతి కూతురు కనిపిస్తుంది. వైజయంతి కూతురును చూసి షాక్ అవుతుంది జానకి. తను రోడ్డు పక్కన ఎవరితోనే ఏడుస్తూ మాట్లాడుతుండటం చూసి షాక్ అవుతుంది. అవతల ఓ యువకుడు తనను బెదిరిస్తాడు. ఫోటోలు ఉన్నాయంటూ బెదరిస్తాడు. ఆ ఫోటోలు కావాలంటే.. కాసేపు గడపాలంటూ ఆఫర్ ఇస్తాడు. దీంతో వైజయంతి కూతురు వెక్కి వెక్కి ఏడుస్తుంది. మీరు ఇలా చేస్తే.. నాకు చావు తప్ప ఇంకో మార్గం లేదు అంటుంది. ఆ విషయం విన్న జానకి షాక్ అవుతుంది. అసలు.. తన సమస్య ఏంటో తెలుసుకోవడం కోసం తన దగ్గరికి వెళ్తుంది. అసలు.. విషయం ఏంటో కనుక్కొని తనకు సాయం చేస్తుంది. తన ప్రాణాలు కాపాడుతుంది.

janaki kalaganaledu 20 september 2021 monday latest episode 131
కట్ చేస్తే.. వైజయంతి ఇంటికి జ్ఞానాంబ వెళ్తుంది. ఏమైంది ఇంత అర్జెంట్ గా రమ్మన్నావు అని అడుగుతుంది. దీంతో వైజయంతి.. జానకి డిగ్రీ పట్టా తీసుకుంటున్న ఫోటోను వైజయంతికి చూపించబోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే.. సోమవారం ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే.