Janaki Kalaganaledu 22 Dec Today Episode : జానకి నడుము చూసి టెంప్ట్ అయిన రామా.. తట్టుకోలేక ఏం చేశాడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 22 Dec Today Episode : జానకి నడుము చూసి టెంప్ట్ అయిన రామా.. తట్టుకోలేక ఏం చేశాడో తెలుసా?

 Authored By gatla | The Telugu News | Updated on :22 December 2021,3:00 pm

Janaki Kalaganaledu 22 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 డిసెంబర్ 2021, బుధవారం 198 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కారులో జానకి రాజమండ్రి వెళ్తుంటుంది. జానకికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో రామా.. కారును ఫాలో అయి కారును ఆపి.. స్వీట్లు ఆర్డర్ ఇచ్చారని.. స్వీట్ల కొట్టు పక్కనే ఉన్న ఐఏఎస్ అకాడమీలో పరమేశ్వరరావు అనే మాస్టారు ఉంటారు. ఆయనకు ఈ స్వీట్లు ఇవ్వండి అని జానకికి స్వీట్లు ఇస్తాడు రామా. దీంతో సరేనండి అని అంటుంది జానకి. రామా గారు ప్రతి క్షణం మీరు నా గురించే ఆలోచిస్తున్నారు. నా కోసం మీరు తపన పడుతున్నారు. నాకోసం మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు. నేను మీకు రోజురోజుకూ రుణపడిపోయేలా చేస్తున్నారు రామా గారు అని మనసులో జానకి అంటుంది. కారును డైరెక్ట్ గా అకాడమీ దగ్గర ఆపుతారు.

janaki kalaganaledu 22 december 2021 full episode

janaki kalaganaledu 22 december 2021 full episode

జ్ఞానాంబ కూడా దిగుతుంది. అత్తయ్య గారు మీరు వెళ్లండి. నేను వీటిని ఇచ్చేసి బేకరీ దగ్గరికి వెళ్తాను అంటుంది. దీంతో జ్ఞానాంబ అలాగేనమ్మా అంటుంది. ఇంతలో అమ్మా జానకి అని పిలుస్తుంది జ్ఞానాంబ. ఒక్క నిమిషం అని చెప్పి పదా నేను కూడా వస్తా అంటుంది. దీంతో అత్తయ్య గారు.. అని భయపడిపోతుంది. ఒకవేళ తను లోపలికి వస్తే.. నన్ను ఎవరైనా చూసి గుర్తు పడితే ఎలా అనుకొని టెన్షన్ పడుతుంది. వద్దులేండి. మీకెందుకు శ్రమ అంటుంది జానకి. ఏం కాదులే. ఆడపిల్ల ఒక్కదాన్ని తెలియని చోటుకు పంపించడం బాగోదు. ఏం కాదు పదా అంటుంది జ్ఞానాంబ. ఇద్దరూ కలిసి నడిచి వెళ్తుంటారు. ఇంతలో జ్ఞానాంబ ఆగి.. ఈ బడి పేరు ఏమన్నాడు రామా అంటుంది జ్ఞానాంబ. ఇది ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ ఇచ్చే బడి అత్తయ్య అంటుంది. అంటే ఏం ఉద్యోగాలు వస్తాయి అని అడుగుతుంది జ్ఞానాంబ. పోలీస్, కలెక్టర్ ఉద్యోగాలు వస్తాయి అని అంటుంది.

దీంతో రామా చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటుంది. రామా చిన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నట్టు నీకు చెప్పాను కదా. వాడు బాగా చదువుకొని ఉంటే ఇప్పుడు ఇటువంటి బడిలో చదువుకొని ఉండేవాడు అని అంటుది. ఆ తర్వాత అకాడెమీ లోపలికి ఇద్దరూ వెళ్తారు.

పరమేశ్వరరావు మాస్టర్ ఎక్కడుంటారు అని ఒక స్టూడెంట్ ను అడుగుతారు. దీంతో పరమేశ్వర రావు ఎవరు లేరు ఇక్కడ అంటుంది. ఇంతలో జ్ఞానాంబకు ఫోన్ వస్తుంది. సావిత్రి అర్జెంట్ గా రా అంటూ జ్ఞానాంబకు చెబుతుంది. దీంతో నేను అర్జెంట్ గా వెళ్లాలి.. అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 22 Dec Today Episode : అకాడెమీలో జ్ఞానాంబ బారి నుంచి తప్పించుకున్న జానకి

పర్లేదు అత్తయ్య గారు మీరు వెళ్లండి. నేను ఇచ్చేసి వస్తా అంటుంది. దీంతో జ్ఞానాంబ వెనుదిరుగుతుంది. ఇంతలో తన ఫ్రెండ్ కనిపిస్తాడు. హాయ్ అంటాడు. దీంతో జానకికి మళ్లీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అభిని అత్తయ్య చూస్తే.. నేను ఇక్కడ చదువుకుంటున్న విషయం తెలిసిపోతుంది అని అనుకుంటుంది జానకి.

అయితే.. జ్ఞానాంబ.. అభిని చూడదు. జ్ఞానాంబ అటు వెళ్లి పోతుంది. నువ్వు ఒక్క సెకండ్ ముందు వచ్చి ఉంటే.. నేను అత్తయ్య ముందు దొరికిపోయేదాన్ని అని చెబుతుంది. మరోవైపు జ్ఞానాంబ కారు దగ్గరికి వెళ్లబోతుండగా.. ఓ స్టూడెంట్ తనను చూసి నమస్కారం పెడతాడు. ఎవరు బాబు నువ్వు అని అడుగుతుంది జ్ఞానాంబ.

మీరు మైరావతి అమ్మ గారి కోడలు కదా అని అంటాడు. అవును బాబు అంటుంది. నీకెలా తెలుసు అంటుంది. నాపేరు బాలరాజు అండి. అమ్మ గారే నన్ను ఇక్కడ చదివిస్తున్నారు అని చెబుతాడు. మైరావతి అమ్మగారి ఇంట్లో మీ ఫోటోను చూశాను అని చెబుతాడు. సరే బాబు బాగా చదువుకో అని చెప్పి జ్ఞానాంబ బయలుదేరుతుంది.

కట్ చేస్తే జానకి పరీక్ష రాసి ఇంటికి వస్తుంది. రాత్రి అవుతుంది. కూర్చొనే నిద్రపోతూ ఉంటుంది. జానకిని చూసి రామా.. పరీక్ష రాసి వచ్చారు కదా.. బాగా అలసిపోయినట్టున్నారు. భోజనం కూడా చేసి ఉండరు అని అనుకొని.. తనకు భోజనం ప్లేట్ లో పెట్టుకొని తీసుకెళ్తుంటే.. మల్లిక చూసి.. ఏందబ్బా ఇది అని అనుకుంటుంది మల్లిక.

ఈయన ఏంది.. నిలబడే ఒడ్డించుకుంటున్నాడు. జానకి ఎటువెళ్లింది. కొంపదీసి మొగుడు పెళ్లాల మధ్య ఏమైనా గొడవ జరిగిందా.. అని అనుకుంటుంది మల్లిక. ఏంటి బావ గారు ప్లేట్ లో భోజనం పెట్టుకుంటున్నారు ఏంటి.. అంటుంది. ప్లేట్ లోనే కదా తినేది అంటాడు రామా.

నేను అడిగేది అది కాదు.. రోజూ జానకి మీకు వడ్డించేది కదా. ఇప్పుడు ఏంటి మీరే నిలబడి వడ్డించుకుంటున్నారు అని అడుగుతుంది. అప్పుడే గోవిందరాజు అక్కడికి వస్తాడు. నాకు అర్థం అయింది. ఎందుకో నాకు తెలుసు.. అంటాడు. మామయ్య గారు మీకు ఏం అర్థం అయింది.. అని అడుగుతుంది మల్లిక. రాముడు ఎందుకు గదిలోకి భోజనం తీసుకెళ్లిందో నాకు అర్థం అయింది అని అంటాడు.

మరోవైపు జానకిని నిద్రలేపబోయిన రామా.. తన నడుమును చూస్తాడు. చూసి తట్టుకోలేడు. ఏం చేయాలో అర్థం కాదు. దీంతో తన నడుము మీద చేయి వేస్తాడు. దీంతో అతడికి కరెంట్ షాక్ కొట్టినంత పని అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది