Janaki Kalaganaledu 23 Oct Today Episode : జానకి.. రామాకు విడాకులు ఇస్తోందని తెలుసుకున్న జ్ఞానాంబ ఏం చేస్తుంది?

Authored By Varun G | The Telugu News | Published on: October 23, 2021, 12:10 pm

Janaki Kalaganaledu 23 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ శని, ఆదివారాల్లో ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూశాం కదా. జానకి చెప్పిన అబద్ధానికి, దాన్ని కప్పిపుచ్చిన రామాను చూసి జ్ఞానాంబ తనతో మాట్లాడొద్దని చెబుతుంది. తనను తల్లి అని కూడా పిలవకూడదని రామాతో అంటుంది. దీంతో రామా చాలా బాధపడిపోతాడు. నేను తప్పు చేస్తే రామాకు ఎందుకు శిక్ష వేస్తున్నారంటూ జానకి జ్ఞానాంబను అడుగుతుంది. నాకే శిక్ష వేయండి.. రామాకు వద్దు అంటుంది. అయినా కూడా జ్ఞానాంబ వినదు. ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్లండి అంటుంది. దీంతో జానకికి ఏం చేయాలో తెలియదు.

janaki kalaganaledu 23 october 2021 episode

janaki kalaganaledu 23 october 2021 episode

ఉదయం లేవగానే.. రామా కొట్టు తీసి జానకి గురించే ఆలోచిస్తాడు. జానకి పరిస్థితి ఏంటి? జ్ఞానాంబ తనతో ఎప్పుడు మాట్లాడుతుందని అనుకుంటాడు రామా. మరోవైపు జానకి ఉదయమే లేవగానే నడుచుకుంటూ ఎక్కడికో వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికీ చెప్పదు. ఇంతలో రామాకు.. యోగి ఫోన్ చేస్తాడు. జానకి ఎక్కడుంది అని అడుగుతాడు. దీంతో రామా షాక్ అవుతాడు.

Janaki Kalaganaledu 23 Oct Today Episode : జానకి ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్లిపోయిందని అందరూ షాక్

జానకి ఇంట్లో లేదు అని చెబుతాడు. దీంతో యోగి భయపడతాడు. జానకి ఎక్కడికి వెళ్లిందో చెప్పండి అని అడుగుతాడు యోగి. దీంతో రామాకు ఏం చెప్పాలో అర్థం కాదు. జానకి గారు ఉదయమే ఇంట్లో నుంచి బయటికి వెళ్లారట కానీ.. ఎక్కడికి వెళ్లారో తెలియదు అని చెబుతాడు రామా. ఒకవేళ మా చెల్లెలు ఏదైనా నిర్ణయం తీసుకుందా? అని షాక్ అవుతాడు యోగి.

janaki kalaganaledu 23 october 2021 episode

janaki kalaganaledu 23 october 2021 episode

జానకి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఎలా? అని రామా కూడా టెన్షన్ పడతాడు. ఇంతలో జానకి అడ్వకేట్ దగ్గరికి వెళ్తుంది. నా భర్త నుంచి నేను విడాకులను మనసా వాచా కర్మనా అడుగుతున్నట్టు నోటీసులు ఇవ్వండి లాయర్ గారు.. అని జానకి లాయర్ ను అడుగుతుంది. దీంతో లాయర్ నోటీసులు ఇస్తాడు. ఆ నోటీసుల మీద జానకి సంతకం పెడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp