Janaki Kalaganaledu 27 June Today Episode : బారసాల ఫంక్షన్ లో జానకికి అవమానం.. జ్ఞానాంబ ఏం చేస్తుంది? ఇంతలో మరో ట్విస్ట్

Authored By Varun G | The Telugu News | Updated on : 27 June 2022, 11:31 am

Janaki Kalaganaledu 27 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 331 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మరోవైపు ఫిల్టర్ కాఫీ చేయడం కోసం వంట గదిలోకి వెళ్తుంది జానకి. కాఫీ పౌడర్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రామా వస్తాడు. ఏమైంది జానకి గారు అని అడుగుతాడు. ఫిల్టర్ కాఫీ చేస్తున్నాను.. అత్తయ్య గారి కోసం అంటుంది. దీంతో ఫిల్టర్ కాఫీ ఎలా చేయాలో నేను చెబుతాను. నేను చెప్పినట్టు మీరు చేశారనుకోండి.. అమ్మ ఆ కాఫీ తాగి ఫిదా అయిపోతుంది అంటాడు రామా. దీంతో రామా చెప్పినట్టుగా ఫిల్టర్ కాఫీ చేస్తుంది జానకి. ఇంతలో కాసేపు ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు. ఇద్దరూ ఒకరిని మరొకరు చూసుకొని నవ్వుతుంటారు.

janaki kalaganaledu 27 june 2022 full episode

janaki kalaganaledu 27 june 2022 full episode

మరోవైపు నాకు మంచి ఫిల్టర్ కాఫీ కావాలి అని జ్ఞానాంబతో అంటాడు గోవిందరాజు. దీంతో నీకు మంచి ఫిల్టర్ కాఫీ కావాలి అంతే కదా.. నేను తీసుకొస్తాను ఆగండి అంటుంది. ఇంతలో జానకి ఫిల్టర్ కాఫీ తీసుకొస్తుంది. అన్ని పనులు నువ్వే చేసి అత్తయ్య గారిని బద్దకస్తురాలును చేస్తున్నావేమో అనిపిస్తోంది అంటాడు గోవిందరాజు. దీంతో ఇంట్లో ఇద్దరు కోడళ్లం ఉన్నాం.. ఇంకా అత్తయ్య గారు పని చేయడం ఎందుకు అంటుంది. దీంతో జానకిని తెగ మెచ్చుకుంటాడు గోవిందరాజు. మల్లికను ఇన్ డైరెక్ట్ గా తిడుతాడు. నేను కూడా కాఫీని బాగానే పెట్టగలను అంటుంది మల్లిక.

నా గురించి మీకు తెలియదనుకుంటాను అంటుంది మల్లిక. దీంతో నీ గురించి మాకెందుకు తెలియదు అమ్మా. నువ్వు మామూలుగా పెడతావా పుల్లలు అంటాడు గోవిందరాజు. దీంతో అనండి మామయ్య గారు అనండి. మీకు పెద్ద కోడలు అంటేనే విలువ ఎక్కువ అంటుంది మల్లిక.

Janaki Kalaganaledu 27 June Today Episode : జానకికి చీర కట్టిన రామా

దీంతో మీరిద్దరూ మాకు కూతుళ్ల లాంటి వారు. ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ కాదు. ఇవన్నీ ఊహించుకోవడం మానేసి.. జానకిని సొంత అక్కలా చూడటం నేర్చుకో అని సలహా ఇస్తుంది జ్ఞానాంబ. మరోవైపు గోవిందరాజు.. రామాను పిలిచి.. అమ్మాయికి ఫిల్టర్ కాఫీ నువ్వే కదా నేర్పించావు అంటాడు గోవిందరాజు.

దీంతో అదేం లేదు నాన్న అంటాడు రామా. దీంతో కబుర్లు చెప్పకు అంటాడు గోవిందరాజు. మరోవైపు జానకి గారు మీరు బారసాల ఫంక్షన్ కు వెళ్లండి అని జానకికి చెబుతాడు రామా. సరే అంటుంది జానకి. కాకపోతే తనకు ఏ చీర కట్టుకోవాలో అర్థం కాదు.

దీంతో సర్లేండి.. మీరు ఇటు రండి. నేను ఏ చీర కట్టుకోవాలో చెబుతా అంటాడు రామా. చీరలు సెలెక్ట్ చేస్తుంటాడు. ఈ చీరలో మీరు కుందనపు బొమ్మలా ఉంటారు. ఫంక్షన్ లో మీరు కొట్టొచ్చినట్టు కనిపిస్తారు అంటాడు రామా. దీంతో మా ఆయన సెలెక్షన్ ఎప్పుడూ సూపర్ అంటుంది జానకి.

మరోవైపు మల్లిక సూపర్బ్ గా రెడీ అవుతుంది. తనను చూసి విష్ణు షాక్ అవుతాడు. మరోవైపు జానకి రామా ముందే చీర కట్టుకుంటుంది. తనను చూసి షాక్ అవుతాడు. తనకు చీర కట్టడంలో సాయం చేస్తాడు. మల్లిక రెడీ అవడం చూసి షాక్ అందరూ షాక్ అవుతారు.

ఏంది ఈ అవతారం.. వెళ్లి మార్చుకొని రా అని మల్లికపై జ్ఞానాంబ సీరియస్ అవుతుంది. దీంతో వెంటనే మామూలు చీర కట్టుకొని వస్తుంది. తర్వాత బారసాల ఫంక్షన్ కు జానకి వెళ్తుంది. అక్కడ అందరూ ఇంకెప్పుడు పిల్లాడిని కంటావు అని అందరూ అడుగుతారు. దీంతో ఏం చెప్పాలో జానకికి అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి