Janaki Kalaganaledu 28 Oct Today Episode : మల్లికపై జానకి సీరియస్.. బుద్ధి లేదా అంటూ జానకి తిడుతుంటే చూసిన జ్ఞానాంబ.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?
Janaki Kalaganaledu 28 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 అక్టోబర్ 2021, గురువారం ఎపిసోడ్ 159 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ స్వీట్స్ షాపు త్వరలో మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది.. అని మల్లిక.. జ్ఞానాంబతో అంటుంది. బావగారు గది దాటి బయటికి రావడం లేదు.. జానకి చెబితే ఆగిపోయారో ఏమో కానీ.. బావ గారు స్వీట్ షాపుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ఈ సమయంలో షాపు కట్టేసుకొని కూర్చుంటే కస్టమర్లు వేరే షాపునకు వెళ్తారు. ఆ తర్వాత మన షాపునకు రాకుండా పోతారు. అప్పుడు జ్ఞానాంబ స్వీట్ షాపు శాశ్వతంగా మూత పడిపోయినట్టే కదా అత్తయ్య గారు. అందుకని స్వీట్ షాపు బాధ్యతను మీ అబ్బాయి గారికి ఇచ్చారనుకోండి. మీ అబ్బాయి గారు స్వీట్ షాపును చూసుకుంటారు. దాన్ని నిలబెడతారు. నేను బట్టల షాపును చూసుకుంటాను. రేయిపగలు కష్టపడి ఈ ఇంటి పేరును నిలబెడతాం అత్తయ్య గారు అంటుంది మల్లిక.
కట్ చేస్తే.. రామా షాపునకు వెళ్లడానికి బయలుదేరుతాడు. వెళ్లొస్తాను అని జానకికి చెబుతాడు. మరోవైపు అఖిల్ బ్యాగ్ వేసుకొని అటూ ఇటూ చూస్తుంటాడు. ఇంతలో రామా వచ్చి అఖిల్ ఏమైంది చెప్పు అంటాడు. కాలేజీ ఫీజు కట్టాలా అంటాడు. ఎంత అంటే 2 వేలు అంటాడు. మన ఇంట్లో పరిస్థితులు బాగా లేవని ఫీజులు, కాలేజీ పరీక్షలు ఆగవు కదా. ఇంట్లో గొడవను చూసి నువ్వు నీ చదువును పాడు చేసుకోకు.. అని రెండు వేలు ఇస్తాడు.
ఇంతలో జ్ఞానాంబ వచ్చి ఒరేయ్ అఖిల్.. అని పిలుస్తుంది. ఆ డబ్బులు వాళ్లకు ఇచ్చేయ్ అంటుంది జ్ఞానాంబ. అక్కర్లేదు.. నా కొడుకు చదువుకు ఎవ్వరూ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. నా పిల్లలను నేను చదివించుకుంటాను. ఎవరి సహాయాలు, త్యాగాలు అవసరం లేదు. అక్కర్లేదు.. అని జ్ఞానాంబ అంటుంది. దీంతో ఎందుకమ్మా నన్ను అలా వేరు చేసి మాట్లాడుతున్నావు అంటాడు రామా. నా పిల్లలు అంటున్నావు.. నేను నీ కొడుకును కాదా అమ్మా అంటాడు రామా. నన్ను ఇలా దూరం చేసి ఎలా మాట్లాడగలుగుతున్నావు అమ్మా అంటాడు రామా.
Janaki Kalaganaledu 28 Oct Today Episode : అఖిల్ కాలేజీ ఫీజు విషయంలో మళ్లీ గొడవ
కొన్ని బంధాలు ఎప్పుడో తెగిపోయాయి. ఇప్పటి వరకు వేరు.. ఇక నుంచి వేరు. నా పిల్లలను నేను చదివించుకుంటాను. ఎవరి జీవితాలను వాళ్లనే చూసుకోమని చెప్పండి.. అని తన భర్తతో అంటుంది జ్ఞానాంబ. సొంతంగా నిర్ణయం తీసుకునే స్థాయికి ఎదిగిన వాళ్లకు ఇవేమీ చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది జ్ఞానాంబ. దీంతో ఆ రెండు వేలు తిరిగి రామాకు ఇచ్చేస్తాడు అఖిల్. అత్తయ్య గారు అని జానకి మాట్లాడేలోపు.. ఏమండి.. కొందరిని నా ముందుకు రావద్దని.. నాతో మాట్లాడొద్దని చెప్పండి అంటుంది జ్ఞానాంబ.
ఇంతలో నీలావతి వస్తుంది. జ్ఞానాంబ అంటూ కేకలు వేస్తుంది. నాకు టైమ్ లేదు వెంటనే వెళ్లిపోవాలి.. నీతో ఒక విషయం మాట్లాడాలి అంటుంది. నీకు జున్ను పాలు అంటే చాలా ఇష్టం కదా.. అందుకే తీసుకొచ్చాను జ్ఞానాంబ అంటుంది. అసలే నువ్వు చాలా బాధలో ఉన్నావు కదా అంటుంది. ఇంతలో మల్లిక.. అగ్నికి ఆజ్యం పోస్తుంది. మీ ఇంట్లో జరిగిన గొడవ ఊరంతా తెలిసింది. జ్ఞానాంబ పెద్ద కోడలు చదివింది ఐదో తరగతి కాదంటగా.. డిగ్రీ అంట. అని ఊరంతా కోడై కూస్తుంది జ్ఞానాంబ.. అని చెబుతుంది నీలావతి.
ఎంతైనా కన్నకొడుకు భవిష్యత్తు కదా.. కన్నతల్లిగా నువ్వు చేసిన దాంట్లో న్యాయం ఉంది. అందుకే కదా.. నీ కొడుకు ఎన్నెన్నో సంబంధాలు చూశావు. ఆఖరికి మా కుటుంబం నీకు ఎన్నో సంవత్సరాలుగా తెలిసినా సరే.. నా కూతురు 10 వ తరగతి చదివిందని.. నీ కొడుకుకు చేసుకోనని తెగేసి చెప్పావు. అంత జాగ్రత్త పడ్డావు. చివరికి గుడ్డిగా మోసపోయావు అంటుంది నీలావతి.
మల్లిక జానకిని ఏదో అనబోతే.. నోర్మూయ్.. పిచ్చి గానీ నీకు పట్టిందా? ఎందుకు ఊరికే ఇలా మాట్లాడుతున్నావు. పదే పదే ఇలా మాట్లాడకూడదనే బుద్ధి నీకు లేదా? అని మల్లికపై సీరియస్ అవుతుంది జానకి. ఈ విషయాన్ని జ్ఞానాంబ గమనిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.