Janaki Kalaganaledu 30 June Today Episode : జ్ఞానాంబకు వారసుడిని కనిచ్చే పనిలో రామా, జానకి.. మధ్యలో అడ్డంకి.. ఇంతకీ ఫస్ట్ నైట్ జరుగుతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 30 June Today Episode : జ్ఞానాంబకు వారసుడిని కనిచ్చే పనిలో రామా, జానకి.. మధ్యలో అడ్డంకి.. ఇంతకీ ఫస్ట్ నైట్ జరుగుతుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :30 June 2022,11:30 am

Janaki Kalaganaledu 30 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 జూన్ 2022, గురువారం ఎపిసోడ్ 334 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను అత్తయ్య గారికి మాటిచ్చాను కదా.. ముందు ఆ విషయం మొదలు పెడదామా అని రామాను అడుగుతుంది జానకి. దీంతో ఏ విషయం అండి అని అడుగుతాడు రామా. దీంతో అదే.. పిల్లలను కనే విషయం అంటుంది జానకి. దీంతో జానకి గారు అంటూ కంగారు పడతాడు రామా. దీంతో తన దగ్గరికి రాబోతుంది జానకి. తనకు టెన్షన్ ఎక్కువవుతుంది. ఇద్దరూ ఒకరిని మరొకరు కాసేపు చూసుకుంటారు. దీంతో మీరు అదేదో రాయాలన్నారు కదా. ముందు అది పూర్తి చేయండి. లేదండి.. అస్సలు బాగోదండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రామా. మరోవైపు స్వీట్లు తయారీ కోసం అన్నీ సిద్ధం చేస్తాడు రామా. అందరూ తలో చేయి వేస్తారు. జానకి కష్టపడి పని చేస్తుంటే.. మల్లిక మాత్రం అటూ ఇటూ తిరుగుతూ టైమ్ పాస్ చేస్తుంటుంది. దీంతో తనను చూసిన గోవిందరాజు.. ఏమ్మా మల్లిక మంట పెట్టడంలో ఆరితేరిపోయావు కదా. ఎవరైనా నీ తర్వాతే కాబట్టి మంట పెట్టు అని మల్లికకు చెబుతాడు.

janaki kalaganaledu 30 june 2022 full episode

janaki kalaganaledu 30 june 2022 full episode

ఆ పొయ్యి వెలిగించమని చెబుతున్నాను అంటాడు గోవిందరాజు. దీంతో మీ మాటల్లోకి వెటకారం అర్థం అయింది అంటుంది మల్లిక. ఇంకా ఏదో అనబోతే.. మాటలు ఆపి ముందు పని చేయి అంటుంది జ్ఞానాంబ. కూర్చొని పని చేయి అంటుంది. దీంతో సరే అని చెప్పి కూర్చొంటుంది మల్లిక. ఇంతలో అక్కడికి వచ్చిన విష్ణు.. మల్లిక ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. కనిపించడం లేదా.. పిండి కలుపుతున్నాను అంటుంది. దీంతో నువ్వు పని చేస్తున్నట్టు నటిస్తున్నావని మా అమ్మకు తెలిసిందనుకో నీకు ఉంటుంది అంటాడు విష్ణు. ఇంతలో అత్తయ్య గారు మల్లిక లడ్డులు చాలా బాగా చేస్తుంది కదా అంటుంది జానకి. మనల్ని దాటేసి తనే ఇప్పుడు పని చేస్తుందేమో అంటుంది జానకి. మల్లిక పని చేయడం చూసి మనమందరం ఆశ్చర్యపోతాం కదా అంటుంది జానకి. దీంతో మామూలుగా కాదు.. మల్లిక పని చూసి మనందరికీ మతి పోతుంది అంతే అంటాడు గోవిందరాజు.

మరోవైపు మల్లికతోనే పని అంతా చేయిస్తారు. తర్వాత వీటిని గదిలోకి తీసుకెళ్లి చుడుతాం అని జ్ఞానాంబకు చెబుతాడు రామా. దీంతో సరే అంటుంది జ్ఞానాంబ. అత్తయ్య గారు మేము కూడా లడ్డులను గదిలో చుడుతాం అంటుంది మల్లిక. దీంతో నో నో నో.. ఇక్కడే చుడదాం అంటాడు విష్ణు.

Janaki Kalaganaledu 30 June Today Episode : లడ్డులను తయారు చేసిన రామా, జానకి

దీంతో మల్లిక, విష్ణు ఇద్దరూ కలిసి అక్కడే లడ్డులను చుడుతారు. మరోవైపు మీరు అవేవో కాగితాలు రాసివ్వాలన్నారు కదా అవి త్వరగా రాసి పూర్తి చేసేయండి. ఈలోగా నేను ఇవి చుట్టేస్తాను అంటాడు రామా. దీంతో అలా కాదు రామా గారు.. ఇవి చుట్టడానికి లేట్ అవుతుంది.

ఇద్దరం కలిసి మనం ఈ పని చేశాక.. అది చూసుకోవచ్చు అంటుంది జానకి. వద్దు అన్నా కూడా వినదు జానకి. మీ మనసులో నుంచి వాటికి సంబంధించిన కంగారు తీసేసి.. ప్రశాంతంగా మీరు చదువు మీద దృష్టి పెట్టండి అంటాడు రామా. దీంతో ఏం పర్వాలేదు రామా గారు అంటుంది జానకి.

దీంతో ఇద్దరూ కలిసి లడ్డులను చుడుతుంటారు. ఇంతలో తన వెంట్రుకలు.. తన ముఖం మీద పడుతుండటంతో తన నోటి గాలితో ఊదుతాడు రామా. దీంతో అవి వెనక్కి వెళ్తాయి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చకచకా లడ్డులను చుట్టేస్తారు. అందరూ కలిస్తేనే వీటిని తయారు చేయగలిగాం. మల్లిక కూడా చాలా కష్టపడింది అని అంటుంది జానకి.

దీంతో చూశావుగా.. నీ కష్టాన్ని జానకి ఎలా పొడుగుతుందో. తనను చూసి నేర్చుకో అంటుంది జ్ఞానాంబ. దీంతో సరే అత్తయ్య గారు అంటుంది కానీ.. మనసులో మాత్రం ఎలాగైనా జానకిని తిట్టించాలి అని అనుకుంటుంది మల్లిక. తగ్గేదేలే అని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది