Janaki Kalaganaledu 5 May Today Episode : జానకి ఫీజు కోసం నానా తంటాలు పడ్డ రామా.. ఈ విషయం జ్ఞానాంబకు తెలిసి షాకింగ్ నిర్ణయం
Janaki Kalaganaledu 5 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 మే 2022, గురువారం ఎపిసోడ్ 294 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి బట్టలు ఉతికేందుకు వెళ్తుండగా మల్లిక పిలిచి జానకి నువ్వెందుకు ఈ పనులు చేస్తున్నావు. బట్టలు ఎందుకు ఉతుకుతున్నావు. అత్తయ్య గారి చీరను ఎందుకు తీసుకెళ్తున్నావు అని జ్ఞానాంబ ముందే అంటుంది మల్లిక. నిన్ను అత్తయ్య గారు పనులు చేయొద్దన్నారు కదా అంటుంది మల్లిక. నువ్వు చేసేవన్నీ అంతే. అత్తయ్య గారు రాను అన్నా కూడా బారసాలకు తీసుకెళ్లి అక్కడ బావ గారిని అనరాని మాటలు అన్నారు అంటుంది. ఇంతలో జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా అత్తయ్య గారు అని పిలుస్తుంది జానకి. నన్ను మీరు దయచేసి ఏ పని చేయనీయకుండా ఉంచకండి అంటుంది జానకి. మీరు నా మీద ఎంత కోపం చూపించినా ఓకే కానీ.. కోడలుగా నా బాధ్యతలు నాకు ఇవ్వండి అంటుంది జానకి.

janaki kalaganaledu 5 may 2022 full episode
ఇన్నిరోజులు నీ మీద నాకు కోపం మాత్రమే ఉండేది. కానీ.. నిన్న ఫంక్షన్ లో నా కొడుకుకు జరిగిన అవమానం తర్వాత ఆ కోపం కాస్త ద్వేషంగా మారింది అంటుంది. ఇంతలో రామా వస్తాడు. ఏమైంది అమ్మ అంటాడు. ఏం లేదురా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. జానకిని అడుగుతాడు. దీంతో ఏం లేదండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జానకి. తన రూమ్ లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది జానకి. ఇంతలో రామా వస్తాడు. మళ్లీ ఏమైంది అడుగుతాడు. ఎందుకు అలా ఉన్నారు అంటాడు. ఏం లేదు.. నేను బాగానే ఉన్నాను అంటుంది. మధ్యాహ్నం వంట ఏం చేయమంటారు అని అత్తయ్య గారిని అడిగాను. చెబుతుంటే వింటూ ఉన్నాను అంతే అంటుంది జానకి.
అమ్మ నిజంగా దేవత అండి. నన్ను ఎవరు ఏదైనా అంటే మా అమ్మ అస్సలు ఊరుకునేవారు కదా. నిన్న మీ అన్నయ్య నన్ను అన్న మాటలతో మా అమ్మ మీమీద కోపం చూపిస్తుందేమో అని అంటాడు. కానీ.. మా అమ్మ చూశారా.. మీ మీద ఎలాంటి కోపం చూపించలేదు అంటాడు.
దీంతో అవును రామా గారు.. మీరు చెప్పిన మాట వాస్తవం. అత్తయ్య గారు ఇంతకుముందు నా మీద ఎంత ప్రేమ చూపించేవారో ఇప్పుడు కూడా అంతే చూపిస్తున్నారు అంటుంది జానకి. ఆ తర్వాత నేను కొట్టుకు వెళ్లి వస్తాను అని చెప్పి రామా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
అత్తయ్య గారు నన్ను క్షమించరు అన్న బాధ ఒకవైపు.. ఈ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరు అన్న బాధ మరోవైపు.. అని అనుకొని బాధపడుతుంది జానకి. మరోవైపు జానకి ఫీజు కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు రామా. అమ్మకు తెలియకుండా ఎవరిని అడిగితే డబ్బులు వస్తాయి అని అనుకుంటాడు రామా.
Janaki Kalaganaledu 5 May Today Episode : బాబాయికి ఫోన్ చేసి లక్ష రూపాయలు అడిగిన రామా
ఇంతలో తనకు ఎవరో గుర్తొస్తారు. వెంటనే ఫోన్ చేస్తాడు. బాబాయికి ఫోన్ చేస్తాడు. నీతో కాస్త ముఖ్యమైన పని ఉండి ఫోన్ చేశాను అంటాడు. ఏంటి అంటాడు. నువ్వు వడ్డీకి డబ్బులు ఇస్తుంటావు కదా. నాకు కూడా రెండు రోజుల్లో ఒక లక్ష రూపాయలు అప్పు కావాలి అంటాడు.
దీంతో ఉదయమే మూర్తి గారి అమ్మాయి పెళ్లి అంటే లక్ష రూపాయలు ఇచ్చేశాను అంటాడు. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. మీ స్వీటు కొట్టు బాగానే నడుస్తోంది కదా. నీకు అంత అర్జెంట్ గా డబ్బు అవసరం ఏమొచ్చింది అని అంటాడు. నాకే అవసరం వచ్చింది అంటాడు.
మరోవైపు మల్లిక ఇంకా ఏదో ప్లాన్ చేస్తుంటుంది. జానకి మీద జ్ఞానాంబకు ఇంకాస్త కోపం వచ్చేలా చేయాలి అని అనుకుంటుంది. ఇంతలో విష్ణు వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. ఆ స్వీటు షాపు మనది అవ్వాలి అంటుంది మల్లిక. ఆ జానకి ఇంట్లో ఉండకూడదు అని అంటుంది.
దీంతో జానకి వదిన సాక్షాత్తూ దేవత. నిన్ను సొంత చెల్లెలులా చూసుకుంటుంటే.. తన మీద కుట్రలు చేయడానికి నీకు మనసెలా వస్తోంది అంటాడు విష్ణు. మరోవైపు రామా అన్నం పెట్టినా కూడా తినకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. నేను భోజనం వడ్డించి చాలా సేపు అయింద. తినకుండా ఏం ఆలోచిస్తున్నారు అంటుంది జానకి.
ఫీజు గురించి మీరేం టెన్షన్ పడకండి. మళ్లీ తర్వాత అయినా కోచింగ్ లో చేరుతాను అంటుంది జానకి. దీంతో వద్దండి. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఫీజు బాధ్యత నాది అంటాడు రామా. ఇప్పటికే డబ్బు సర్దుబాటు అయింది… అంటాడు రామా.
మరోవైపు ఏమైందిరా.. అలా ఉన్నావు అని రామాను అడుగుతుంది. దీంతో ఏంలేదు అంటాడు రామా. మన కొట్లో ఎవరూ లేరు.. త్వరగా వెళ్లాలి అని అంటాడు. దీంతో అలా అబద్ధం చెప్పకు. నీ మనసులో ఏదో తెలియని బాధ ఉంది. నువ్వు చెప్పకపోయినా ఈ అమ్మకు అర్థం అవుతుంది అంటుంద జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.