Janaki Kalaganaledu : మల్లిక గర్భవతి కాదని తెలిసి జ్ఞానాంబ ఏం చేస్తుంది? జానకిని గర్భవతి కావాలని కోరుతుందా? తన ఐపీఎస్ కల ఏమౌతుంది?

Authored By Varun G | The Telugu News | Published on: October 29, 2022, 9:00 am

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 31 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 421 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మల్లిక, జెస్సీ కోసం జ్ఞానాంబ సున్నుండలు చేస్తుంటుంది. మల్లిక మిమ్మల్ని ఎన్ని బాధలు పెట్టినా అవన్నీ మరిచిపోయి మీరు ఆమె కోసం ఇవన్నీ చేస్తున్నారు అంటుంది చికిత. దీంతో బంధం అనేది ఎప్పుడూ అలాగే ఉంటుంది.. అని చికితకు సర్దిచెబుతుంది జ్ఞానాంబ. వెంటనే జానకిని పిలిచి ఈ సున్నుండలు మల్లిక, జెస్సీకి ఇవ్వాలని చెబుతుంది. దీంతో సరే అని మల్లిక దగ్గరికి వెళ్తుంది జానకి. మల్లిక గర్భం గురించి డౌట్ ఉన్న జానకి.. తనను పరీక్షించాలని అనుకుంటుంది. మల్లికకు కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చి ఇవి వేసుకున్న తర్వాత సున్నుండలు తిను అంటుంది. దీంతో నేను తర్వాత మందులు వేసుకుంటా కానీ.. నువ్వు వెళ్లు జానకి అంటుంది. దీంతో బయటికి వెళ్లినట్టే వెళ్లి చాటుగా చూస్తుంది జానకి. దీంతో మందులను బయట విసిరేసి సున్నుండలు మాత్రమే తింటుంది.

janaki knows the truth about mallika fake pregrency

janaki knows the truth about mallika fake pregrency

దీంతో జానకి అనుమానం కాస్త బలపడుతుంది. జెస్సీకి ఇచ్చిన సున్నుండలు జెస్సీ తింటుంది. అంతే కాదు.. తనను అత్తయ్య గారు ఇంతలా అర్థం చేసుకొని నాకోసం సున్నుండలు ఇవ్వడం నాకు చాలా బాగుంది అంటుంది. అత్తయ్య గారికి కోడలు కావడం నా అదృష్టం అంటుంది. మరోవైపు జానకి చదువుకుంటూ మల్లిక ప్రెగ్నెన్సీ గురించే ఆలోచిస్తూ ఉండగా.. ఇంతలో రామా వచ్చి తనకు ఒక ఐడియా ఇస్తాడు. ఆ ఐడియాతో అసలు మల్లికకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది.. ఈ విషయం ఎవరి ద్వారా తెలిసింది అని ఆరా తీస్తుంది. ఆ విషయం ముందు లీలావతి చెప్పడంతో ఉదయం లేవగానే లీలావతికి ఫోన్ చేస్తుంది జానకి. వెంటనే ఇంటికి రండి. మీతో మాట్లాడాలి అంటుంది.

దీంతో వెంటనే పరుగుపరుగున ఇంటికి వస్తుంది. కొంపదీసి మల్లిక అబద్ధపు గర్భం గురించి తెలిసిందేమో అనుకొని జ్ఞానాంబ ఇంటికి వచ్చి జానకి అంటూ పిలుస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన మల్లిక.. ఏంటి పెద్దమ్మా.. ఇంత ఉదయమే వచ్చి జానకి అని పిలుస్తున్నావు అని అంటుంది.

Janaki Kalaganaledu : లీలావతి, మల్లిక మాటలు విన్న జానకి

నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు ఏంటి.. ఆ జానకి ఫోన్ చేసి పిలిచింది. తనకు నీ గర్భం గురించి తెలిసిపోయిందేమో అంటుంది లీలావతి. అలా ఎలా తెలుస్తుంది. తెలిసే చాన్స్ లేదు అంటుంది మల్లిక. ఇవన్నీ జానకి చాటుగా వింటూ ఉంటుంది. అసలు తెలిసే చాన్సే లేదు.

ఎందుకంటే నా గర్భం గురించి ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియలేదు. నువ్వేం టెన్షన్ పడకు అంటుంది. కానీ.. ఒకవేళ ఈ విషయం తెలిస్తే జానకి నన్ను పోలీసులకు పట్టిస్తుంది అంటుంది. ఏం కాదు అంటుంది. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి రావడం చూసి ఆగిపోతుంది జానకి.

జ్ఞానాంబ రాగానే టాపిక్ మారుస్తుంది మల్లిక. జ్ఞానాంబ వెళ్లిపోగానే ఇద్దరి సంగతి చెప్పాలని అనుకుంటుంది జానకి. ఆ తర్వాత మల్లిక తన రూమ్ లో ఉండగా తన రూమ్ కు వెళ్తుంది జానకి. అక్కడ రూమ్ లో పాటలకు డ్యాన్స్ వేయడం చూస్తుంది.

ఏంటి జానకి ఇలా వచ్చావు అని అడుగుతుంది మల్లిక. దీంతో నిన్న లీలావతి పిన్నితో ఏం మాట్లాడావో తెలుసుకుందాం అని వచ్చాను అంటుంది జానకి. పోలేరమ్మ వీక్ నెస్ ను అడ్డం పెట్టుకొని మమ్మల్ని వేరు పడకుండా ఆపి ఇటు నీ పబ్బం గడుపుకుంటున్నావు. ఈ కుటుంబానికి, నీకు నా ఊసురు, నా బిడ్డ ఊసురు తగలకుండా పోదు అని అంటుంది మల్లిక.

దీంతో మల్లిక చెంప చెళ్లుమనిపిస్తుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp