Janaki Kalaganaledu : అఖిల్ సూసైడ్ చేసుకుంటాడా? ఈ విషయం తెలిసి జెస్సీ ఏం చేస్తుంది? జ్ఞానాంబ ఫ్యామిలీలో కొత్త టెన్షన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu : అఖిల్ సూసైడ్ చేసుకుంటాడా? ఈ విషయం తెలిసి జెస్సీ ఏం చేస్తుంది? జ్ఞానాంబ ఫ్యామిలీలో కొత్త టెన్షన్

 Authored By gatla | The Telugu News | Updated on :17 September 2022,10:00 am

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 18 సెప్టెంబర్ 2022, ఎపిసోడ్ 391 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పరీక్ష రాయడానికి వెళ్తుండగా జానకికి కాల్ వస్తుంది. జెస్సీ అమ్మానాన్న ఫోన్ చేసి జెస్సీ సూసైడ్ చేసుకోబోయిందని చెబుతారు. దీంతో పరీక్ష రాయకుండానే జానకి జెస్సీ ఇంటికి వెళ్తుంది. మేరీ రావడం కాస్త లేట్ అయితే జెస్సీ ప్రాణాలతో దక్కేది కాదు అని జెస్సీ తండ్రి చెబుతాడు. దీంతో లోపలికి వెళ్లి జెస్సీని ఓదార్చుతుంది జానకి. ఎలాగైనా అఖిల్ ను నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అని జానకి.. జెస్సీకి మాట ఇస్తుంది. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు అని జానకి.. జెస్సీ నుంచి మాట తీసుకుంటుంది.

janaki reveals the truth about jessie to jnanamba

janaki reveals the truth about jessie to jnanamba

కట్ చేస్తే జ్ఞానాంబకు జానకి కాలేజీ నుంచి ఫోన్ వస్తుంది. మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉందా జ్ఞానాంబ గారు. జానకి పరీక్ష రాయకుండా వెళ్లిపోయింది. అందుకే కాల్ చేశాను అంటుంది ప్రిన్సిపల్. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. దీంతో నేను ఒకసారి కనుక్కొని చెబుతాను అంటుంది జ్ఞానాంబ. జానకి ఎందుకు ఇలా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తోంది అని రామాను పిలుస్తుంది జ్ఞానాంబ. జానకి పరీక్ష రాయలేదట. ఎటో వెళ్లిపోయిందట అని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో రామా షాక్ అవుతాడు. ఎక్కడికి వెళ్లిందో నీకు ఏమైనా తెలుసా అని అడుగుతుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu : జానకి జెస్సీ దగ్గరికే వెళ్లి ఉంటుంది అని చెప్పిన మల్లిక

కుర్రాళ్లలో కాలేజీ ఎగ్గొట్టి జానకి ఇంకెక్కడికి వెళ్తుంది. తను జెస్సీ దగ్గరికే వెళ్లి ఉంటుంది అత్తయ్య గారు అంటుంది మల్లిక. మీరు ఏం చెప్పినా తల ఊపుతుంది కానీ.. బయటికి వెళ్లి తనకు నచ్చిందే చేస్తుంది అని జానకి మీద నిందలు వేస్తుంది మల్లిక. దీంతో జానకి గారు అలాంటి వారు కాదు అంటాడు రామా.

మల్లిక అన్నదాంట్లో తప్పేముంది అంటుంది జ్ఞానాంబ. ఇంతలో జానకి వస్తుంది. పరీక్ష రాశావా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో రాయలేదు అంటుంది. ఎందుకని అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో జెస్సీ గురించి చెబుతుంది జానకి. జెస్సీ ఆత్మహత్య చేసుకోబోయింది అని చెబుతుంది.

జెస్సీ ఆత్మహత్య చేసుకోబోయిందని తెలుసుకొని అఖిల్ షాక్ అవుతాడు. జెస్సీ గురించి నిజం నిరూపించడానికి నువ్వు ఆధారాలు తీసుకురా అని చెప్పా కానీ.. ఇలా పరీక్షలు ఎగ్గొట్టి కాదు అని చెప్పి.. లాస్ట్ వార్నింగ్ ఇచ్చి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

తర్వాత అఖిల్ తో రామా మాట్లాడుతాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడైనా చెప్పు అని అడుగుతాడు రామా. దీంతో నాకు ఏం తెలియదు అని అదే విషయం చెబుతాడు అఖిల్. నువ్వు ఎంత అడిగినా నేను చెప్పేది ఇదే మాట అని చెప్పి అఖిల్ లోపలికి వెళ్లి కోపంతో విషం తాగబోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది