Janaki Kalaganaledu : జ్ఞానాంబపై యోగి పెట్టిన కేసును సమర్థించిన జానకి.. దీంతో రామా షాక్.. రామాకు విడాకులు ఇచ్చి అమెరికా చెక్కేయబోతున్న జానకి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu : జ్ఞానాంబపై యోగి పెట్టిన కేసును సమర్థించిన జానకి.. దీంతో రామా షాక్.. రామాకు విడాకులు ఇచ్చి అమెరికా చెక్కేయబోతున్న జానకి

 Authored By gatla | The Telugu News | Updated on :10 April 2022,11:30 am

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదల కాదు. జానకి కలగనలేదు సీరియల్ తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం ఎపిసోడ్ 276, 11 ఏప్రిల్ 2022 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కంప్లయింట్ నేను అస్సలు వెనక్కి తీసుకోను. నువ్వు కూడా నాతో రా.. స్టేట్ మెంట్ ఇవ్వాలి అని జానకిని తీసుకోపోబోతాడు యోగి. దీంతో రామా అతడిని అడ్డుకుంటాడు. మా అమ్మను నువ్వు జైలులో పెడతావా అని యోగిని చితక్కొడతాడు. అయినా కూడా కంప్లయింట్ వెనక్కి తీసుకోను అంటాడు యోగి.

janaki supports yogi to file complaint on jnanamba in janaki kalaganaledu

janaki supports yogi to file complaint on jnanamba in janaki kalaganaledu

దీంతో మీరేం చేస్తారో నాకు తెలియదు. మా అమ్మ గంటలో ఈ ఇంట్లో ఉండాలి. లేకపోతే మీ అన్నయ్య పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. టైమ్ గుర్తు పెట్టుకో యోగి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రామా. దీంతో జానకికి ఏం చేయాలో అర్థం కాదు. నువ్వు వెంటనే వెళ్లి కంప్లయింట్ వెనక్కి తీసుకో అంటుంది జానకి. దీంతో అది జరగని పని అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు యోగి. తను ఎంత చెప్పినా వినడు. దీంతో జానకికి ఏం చేయాలో అర్థం కాదు.

రామా దగ్గరికి వెళ్లి నేను మా అన్నయ్యతో మాట్లాడి ఎలాగైనా కంప్లయింట్ వెనక్కి తీసుకునేలా చేస్తా అంటుంది జానకి. దీంతో ఈ విషయం నీకు ముందే తెలుసు కదా అంటాడు రామా. దీంతో జానకికి ఏం చేయాలో అర్థం కాదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటుంది జానకి.

అయినా కూడా రామా వినడు. దీంతో నేను వెళ్లి అత్తయ్య గారిని విడిపించుకు తీసుకొస్తా. ఒకవేళ అలా చేయకపోతే నేను ఇక ఎప్పటికీ ఈ ఇంటికి తిరిగి రాను అని అంటుంది జానకి. అయినా కూడా రామా ఏం మాట్లాడడు. వెంటనే యోగి ఇంటికి వెళ్తుంది.

నీకేం తెలుసు మా అత్తయ్య గారి గురించి అంటుంది జానకి. మా అత్తయ్య గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మాట్లాడటానికి నువ్వు సరిపోవు కూడా. అర్థం అవుతోందా అని అంటుంది జానకి. ఆరోజు అబద్ధం చెప్పి నా పెళ్లి చేశావు. ఈరోజు ఎవరో చెప్పిన అబద్ధాన్ని నమ్మి అరెస్ట్ చేయించావు అంటుంది జానకి.

Janaki Kalaganaledu : యోగిని ఎంత కన్విన్స్ చేసినా కేసు వావసు తీసుకోను అని జానకితో చెప్పిన యోగి

అబద్ధాలను నమ్మి ఇలా చేసే నువ్వా మా అత్తయ్య గారి గురించి ఇలా మాట్లాడేది అంటుంది. మా అత్తయ్య గారి గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు అంటూ యోగిని నిలదీస్తుంది జానకి. ఆవిడ నిజంగా నన్ను సాధించేదే అయితే నేను ఏనాడో ఆ ఇంట్లో నుంచి వచ్చేసేదాన్ని అంటుంది జానకి.

జానకి ఎంత చెప్పినా యోగి మాత్రం అస్సలు కంప్లయింట్ వెనక్కి తీసుకోను అంటాడు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా అంటాడు. రామాతో నీకు విడాకులు ఇప్పించి.. నిన్ను మాతో పాటు అమెరికా తీసుకెళ్తాం అంటాడు యోగి. దీంతో జానకి షాక్ అవుతుంది.

ఆ తర్వాత జానకిని తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు యోగి. మీ అత్తయ్య నిన్ను ఎలాంటి ఇబ్బందులు పెట్టిందో అన్నింటిని ఈ ఎస్ఐ గారికి చెప్పు అంటాడు యోగి. దీంతో మా అత్తయ్య గారు నన్ను చాలా బాధపెట్టారు అంటుంద జానకి.

దీంతో రామా షాక్ అవుతాడు. చాలా కష్టపెట్టారు అంటుంది జానకి. ఇది నిజం. అవును ఎస్ఐ గారు. నేను ఇప్పుడు చెప్పిన ప్రతిమాట నిజం అంటుంద జానకి. దీంతో ఎస్ఐ జ్ఞానాంబ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది