Janhvi Kapoor : విజయ్ దేవరకొండతో సినిమా.. అసలు విషయం చెప్పిన జాన్వీ కపూర్
Janhvi Kapoor: విభిన్న కథా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు విజయ్ దేవరకొండ. లైగర్ సినిమాని పూర్తి చేసి జూలైలో సినిమాని రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా శివ నిర్వాణ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిన్నుకోరి’ ‘మజిలీ’ వంటి ప్రేమకథల్ని తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాకు కూడా హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో ఓ లవ్‌స్టోరీని సిద్ధం చేశారు. కశ్మీర్ నేపథ్యంలో కథ నడుస్తుంది. రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే కశ్మీర్‌లో మొదలవుతుంది. అక్కడి షెడ్యూల్ పూర్తయిన తర్వాత హైదరాబాద్, విశాఖపట్నం, అలెప్పిలో మిగతా షూటింగ్ జరుపుతాం’ అని చిత్రబృందం పేర్కొంది.
జాన్వీ క్లారిటీ ఇచ్చిందిగా..!శివ నిర్వాణ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన అనే సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్పందించింది. ఊహాగానాలు నమ్మవద్దు. నేను ఇంకా ఏ తెలుగు లేదా తమిళ చిత్రానికి సైన్ చేయలేదు. ఒకవేళ సినిమా చేస్తే అఫీషియల్‌గా ప్రకటిస్తాను, అప్పటి వరకు పుకార్లు నమ్మోద్దని కోరింది. జాన్వీ వెండితెరపై అడుగుపెట్టినప్పటినుంచి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడిస్తుంది.. ఎవరితో ఇస్తుంది? అన్న ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం మాత్రం దొరకలేదు.జాన్వీకపూర్ .

janhvi kapoor gives the clarity Vijay Devarakonda Movie
వెండితెరపై కాస్త పొదుపుగానే అందాలు ఆరబోస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తనకు ఎలాంటి రూల్స్ లేవు. ఎలాంటి కండీషన్స్ లేవు. దీంతో రెచ్చిపోతుంది. తనకు నచ్చిన విధంగా సెక్సీ పోజులిస్తూ నెటిజన్లకి ఫుల్ మీల్స్ ని పెడుతుంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో అత్యంత క్రేజీ హీరోయిన్. బాలీవుడ్ జనాలకు మంచి కిక్క్ ని ఇచ్చే కథానాయికల్లో జాన్వీ ఒకరు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జస్ట్ ఈ అందాల భామ ఒక్క హాట్ ఫోటో షేర్ చేసిందంటే చాలు మిలియన్స్ లో వ్యూస్ వచ్చిపడుతుంటాయి.