Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ ఇల్లు అమ్మేసిందా.. అంత క‌ష్టం ఏమోచ్చింది?

Jahnvi Kapoor : జాన్వీ క‌పూర్..ఇప్పుడు ఈ పేరు తెలియ‌ని వారు లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఈ అమ్మడు సినిమాల‌తో పాటు త‌న అంద‌చందాల‌తో అల‌రిస్తుంది. ఈ అమ్మ‌డ తర‌చు వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. అయితే జాన్వీ క‌పూర్ ఇంటిని రాజ్ కుమార్ రావు కొనుగోలు చేశార‌ట‌. ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరో గా గుర్తింపు పొందాడు రాజ్ కుమార్ రావు. ఆయన రీసెంట్ గాముంబయ్ లో ఓ విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేశాడు. జాన్వీ కపూర్ అమ్మిన ఇల్లు.. రాజ్ కుమార్ కొన్న ఇల్లు ఒకటే.. జాన్వీ కపూర్ కు చెందిన ముంబైలోని విలాస‌వంత‌మైన ట్రిప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ ను ఆయన కొనుగోలు చేశార‌ట‌.

Advertisement

ఈ ఇంటిని అమ్మడం ద్వారా జాన్వీ కపూర్ కూడా బాగా లాభపడింది. 2 సంవత్సరాల క్రితం జాహ్నవి కపూర్ ఈ ఇంటిని కొనుగోలు చేసింది. జాన్వీ 2020 డిసెంబర్‌లో 39 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ అపార్ట్‌మెంట్ ముంబైలోని జుహులో ఉంది. రాజ్‌కుమార్ రావు నటి జాన్వీ కపూర్‌ నుంచి ఈ అపార్ట్‌మెంట్‌ కొనడం విశేషం. . రాజ్ కుమార్ ఈ అపార్ట్ మెంట్ న‌టి జాన్వీ క‌పూర్ నుంచి భారీ రేటుకు ఆయన కొన్నారట. ఈ అపార్ట్ మెంట్ ను జాన్వీ కపూర్ 44 కోట్లకు రాజ్ కుమార్ కు అమ్మినట్టు తెలుస్తోంది.

Advertisement

Janhvi Kapoor : భ‌లే పని చేసింది..

2020 డిసెంబర్ జాన్వీ కపూర్ ఈ ఇంటిని కొన్నారు. 2022 లో రాజ్ కుమార్ రావ్ కు అమ్మేశారు. ఈ డీల్ ద్వారా జాన్వీకి 5 కోట్ల వరకూ లాభం వచ్చింది. 3456 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ లో.. చ‌ద‌ర‌పు అడుగు ధ‌ర 1.27 లక్ష‌లు. దేశంలోనే అత్యంత ఖ‌రీదైన డీల్స్ లో ఇది ఒక‌టి. ఇక ఈ అపార్ట్‌మెంట్ భ‌వ‌నాన్ని బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత‌, బిల్డ‌ర్ ఆనంద్ పండిట్ నిర్మించారు. ఈ భ‌వనాన్ని లోట‌స్ ఆర్య అని పిలుస్తుంటారు. ఇందులో బాలీవుడ్ ప్రముఖులు చాలా మంది నివసించారు.

Advertisement