Janhvi kapoor : జాన్వీ క‌పూర్ తండ్రినే బురిడి కొట్టించారుగా.. కార్డ్ నుండి రూ.4 ల‌క్ష‌లు మాయం

Authored By Sam C | The Telugu News | Published on: May 29, 2022, 6:30 pm

Janhvi kapoor: జాన్వీ క‌పూర్ తండ్రి బోనీ క‌పూర్ ప్ర‌స్తుతం వైవిధ్య‌మైన సినిమాలు నిర్మిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. బోని సినిమాలు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లోను రూపొందుతున్నాయి. అయితే ఆయ‌న రీసెంట్‌గా వార్త‌ల‌లోకి ఎక్క‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజాగా సైబర్‌ నేరగాళ్ల బారిన ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ప‌డ‌డం అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.బాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్న బోనీ కపూర్‌.. అతిలోక సుందరి శ్రీదేవి భర్త అనే విషయం తెలిసిందే. ఆయన్నుంచి తాజాగా సైబర్‌ కేటుగాళ్లు 3.82 లక్షలు స్వాహా చేశారు. దీనిని గుర్తించిన బోనీ కపూర్.. తన సహాయకుడి ద్వారా అంబోలీ పీఎస్ లో ఫిర్యాదు చేయించాడు.

Janhvi kapoor : బోని అలా ఎలా మోస‌పోయాడు..

IPC, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. 2022, ఫిబ్రవరి 09వ తేదీన ఆన్ లైన్ ద్వారా ఐదు లావాదేవీలను క్రెడిట్ ద్వారా ఉపయోగించడాని పోలీసులు గుర్తించారు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు కోసం మార్చి 30వ తేదీన ఫోన్ చేయడంతో మోసాన్ని బోనీ కపూర్ గుర్తించినట్లు ఫిర్యాదుదారుడు పోలీసులకు తెలిపాడు. డబ్బు విత్ డ్రా అయ్యిందని తెలుసుకున్న అనంతరం సంబంధిత బ్యాంకులో ఆరా తీయడం జరిగిందన్నాడు.క్రెడిట్ కార్డు వివరాలను ఎవరూ అడగలేదని, దీనికి సంబంధించి ఎలాంటి ఫోన్ రాలేదని అతను చెప్పాడు.

 janhvi kapoor

janhvi kapoor

ఐదు ట్రాన్సాక్షన్స్‌లతో మొత్తం రూ. 3.82 లక్షలను నిందితులు దోచుకున్నారు. అయితే ఈ లావాదేవీలు జరిపినప్పుడు బోనీ కపూర్‌కు తెలియదని.. తర్వాత అకౌంట్స్‌ చెక్‌ చేసినప్పుడు తాను డబ్బు పోగోట్టుకున్నట్లు గ్రహించారని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చోరీకి గురైన డబ్బు గురుగ్రామ్‌లోని ఓ కంపెనీ అకౌంట్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు అంబోలీ పోలీస్‌ స్టేషన్‌లోని ఒక అధికారి పేర్కొన్నారు. బోనీ కపూర్ కు ఖుషీ కపూర్, జాన్వీ కపూర్‌, అర్జున్ కపూర్, అన్షులా కపూర్‌ పిల్లలున్నారు.

Sam C

No bio available for this author.

  1. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  2. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  3. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  4. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  5. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

  6. "Old 5 Rupee Note : పాత రూ.5 నోటుకు రూ.17 లక్షలు.. మూడు రోజుల్లో రైతుకు ఏం జ‌రిగిందంటే..?"

  7. "Rahul Gandhi : ఏపీలో ‘ఓటు చోరీ’ కలకలం.. రాహుల్ గాంధీ కామెంట్స్‌తో వైసీపీ-కాంగ్రెస్ మధ్య మంటలు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp