Jani Master : పిచ్చి వార్తలు రాసేవారికి స్వీట్ వార్నింగ్.. కంటతడి పెట్టేసిన జానీ మాస్టర్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 19 September 2022, 10:30 am

Jani Master : జానీ మాస్టర్ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు ఎదిగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఢీ షోలో కంటెస్టెంట్‌గా వచ్చి.. ఢీ షో విన్నర్‌గా నిలిచాడు. చివరకు ఢీ షోకు జడ్జ్‌గా ఎదిగాడు. ఢీ షో అంటే కొందరికీ ఎంతో మమకారం ఉంటుంది. ఇలాంటి ఆ స్టేజ్ మీద నుంచి ఎదిగిన వారు ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగారు. టాప్ కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు. అందులో శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, జానీ మాస్టర్ వంటివారున్నారు. తాజాగా జానీ మాస్టర్, గణేష్ మాస్టర్లు కలిసి ఢీ షోను ముందుకు నడిపిస్తున్నారు. ఇద్దరు జడ్జ్‌లు ఢీ షోలో దుమ్ములేపుతున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో జానీ మాస్టర్ జీవితాన్ని చూపించారు. తన పర్సనల్ జీవితంలో జరిగిన విషాద ఘటనల మీద పర్ఫామెన్స్ చేశారు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగాడో చూపించారు. ఇక మొదటిసారిగా జానీ మాస్టర్ ఇలా ఓ షోలో కంటతడి పెట్టేసుకున్నాడు. దీంతో అందరూ జానీ మాస్టర్‌ను ఓదార్చేస్తున్నారు. జానీ మాస్టర్ ఇంత ఎమోషనల్ అవుతుంటే.. మాకు ఎంతో బాధగా ఉందంటూ యూట్యూబ్ కింద కామెంట్లు కనిపిస్తున్నాయి.

Jani Master Gets Emotional in Dhee Latest Promo

Jani Master Gets Emotional in Dhee Latest Promo

అయితే తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోలో జానీ మాస్టర్ అన్న మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. పిచ్చి వార్తలు రాసే వారికి చెబుతున్నా.. ఈ స్టేజ్ గురించి, ఈ షో గురించి తక్కువ చేసిన మాట్లాడొద్దు.. అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ కలిసి వేసిన స్టెప్పులు, ఇద్దరూ కలిసి చేసిన అల్లరి ఈ ప్రోమోలో వైరల్ అవుతోంది. ఇలా ఇద్దరూ కలిసి సందడి చేస్తుంటే.. వారివురి అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ ఎపిసోడ్‌ను కచ్చితంగా చూడాల్సిందే అని అంటున్నారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి