Jayavani : ఆ సీన్స్‌లో యాక్ట్ చేయాలన్న డైరెక్టర్స్.. జయవాణి ఏం చెప్పిందంటే?
Jayavani : తెర మీద వెలిగిపోవాలని చాలా మంది ఆశ పడుతుంటారు. కానీ వారిలో కొందరికి మాత్రమే తెర మీద కనిపించే అవకాశం వస్తుంది. ఇక మిగతా వారు అనేక కష్టాలు పడతారు. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరూ కంఫర్ట్ గానే వచ్చినట్లు కొందరు భావిస్తారు. కానీ అది నిజం కాదు. ఇండస్ట్రీలో నేడు రాణిస్తున్న అనేక మంది నటీనటులు అనేక కష్టనష్టాలను ఓర్చుకున్నారు. ఇక అటువంటి వారిలో తెలుగు నటి జయవాణి ఒకరు. ఆమె తెర మీద రాణించడం కోసం ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో ఒక సారి చూద్దాం.
జయవాణికి పదో తరగతిలోనే పెళ్లి చేశారట. తనకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే పిచ్చి అని అందుకోసమే తనకు పదో తరగతిలోనే తన సొంత మామ గుమ్మడి చంద్రశేఖర్ రావుకు ఇచ్చి పెళ్లి చేశారని జయవాణి చెప్పింది. కానీ తాను ఇప్పుడు తన భర్త ప్రోత్సాహంతో బీఏ వరకూ చదివానని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం అనేక కష్టాలు పడ్డాడనని ఆమె చెప్పింది. కొంత మంది దర్శకులు తనను బోల్డ్ సీన్స్ లో యాక్ట్ చేయాలని కూడా అడిగారని తెలిపింది. కానీ ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించానని ఆమె పేర్కొంది.

jayavani comments on those tollywood directors
Jayavani : అందుకనే 10వ తరగతిలోనే పెళ్లి చేశారు..
ఇండస్ట్రీలోకి తాను వచ్చిన మొదట్లో కొంత నలుపు రంగులో ఉండేదానినని అందుకోసం అనేక ఆఫర్లు రాకుండా పోయాయని ఆమె బాధపడింది. ఇండస్ట్రీలో రాణించేందుకు తన తండ్రి తనకు అనేక రకాలుగా హెల్ప్ చేశాడని ఆమె చెప్పింది. తన తండ్రి వలనే ఈ రోజు తాను ఈ పొజీషన్ లో ఉన్నానని స్పష్టం చేసింది. జయవాణి అనేక తెలుగు సినిమాల్లో హీరోకు తల్లిగానో, లేదా హీరోయిన్ కు తల్లిగానో లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో, లేదా కమెడియన్ గానో మెరుస్తూ అలరిస్తుంది. తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే విపరీతమైన పిచ్చి అని చెప్పింది.