jeevitha Rajasekhar Daughters want offers as heroine roles
Rajasekhar Daughters : టాలీవుడ్ లో ఒకానొక సమయంలో స్టార్ హీరోగా హీరోయిన్వెలుగు వెలిగిన యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ ప్రస్తుతం ఏడాదికి రెండేళ్లకు ఒకటి అన్నట్లుగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన నట వారసులుగా ఆయన ఇద్దరు కుమార్తెలు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తల్లి తండ్రి ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే అవ్వడంతో శివాని మరియు శివాత్మికలకు ఇండస్ట్రీ పై మొదటి నుండి ఇష్టం ఉంది. ఇద్దరు కూడా హీరోయిన్ లుగా తెరంగేట్రం చేశారు. కమర్షియల్ హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా ఇద్దరు అందాల ఆరబోతకు సిద్ధం అన్నట్లుగా స్కిన్ షో కి రెడీగా ఉంటారు. అలాంటి ఇద్దరు కి ఇప్పుడు ఆఫర్లు రావడం లేదు. రాజశేఖర్ కూతుర్లు అయినా శివాని మరియు శివాత్మిక హీరోయిన్స్ గా నటించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు. వారిద్దరికీ నటనపై చాలా మక్కువ కానీ వారు హీరో రాజశేఖర్ కుమార్తెలు అవ్వడమే చేసిన తప్పు అన్నట్లుగా వారికి చాలా మంది సినిమాల్లో ఆఫర్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఇదే బాలీవుడ్ లో అయితే కచ్చితంగా ఈ పాటికి వారిద్దరూ స్టార్ హీరోయిన్స్ గా మారి పోయేవారు. ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే హీరోయిన్స్ గా వెంటనే అక్కడ అవకాశాలు వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే హీరోయిన్స్ కి అవకాశాలు తగ్గుతాయి. రాజశేఖర్ కూతుర్ల విషయంలో అదే జరుగుతుంది. స్టార్ హీరో కూతుర్లు కదా వాళ్లతో రొమాంటిక్ సన్నివేశాలు ఏం చేపిస్తాం.. వాళ్లతో ఎక్స్పోజింగ్ సన్నివేశాలు ఏం చేపిస్తాం అన్నట్లుగా కొందరు ఫిల్మ్ మేకర్స్ వెనకంజ వేస్తున్నారు. కాస్త పద్ధతి అయిన పాత్రలకు వారిని తీసుకుంటూ అప్పుడప్పుడు వారితో సినిమాలు చేస్తున్నవారు ఉన్నారు.
jeevitha Rajasekhar Daughters want offers as heroine roles
కానీ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్ మాదిరిగా వారు కూడా నటించడం రొమాంటిక్ సన్నివేశాల్లో జీవించడం చేస్తారు, కానీ అలాంటి సినిమాల్లో మాత్రం వీళ్లకు ఛాన్స్ రావడం లేదు ఇది నిజంగా దారుణం అంటూ అభిమానులు మరియు కొందరు సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరు కూడా హీరోయిన్స్ గా మంచి ప్రతిభ కనబరిచిన వారే.. అయినా అవకాశాలు రావడం లేదు. తెలుగులో ఎలాగో అవకాశాలు రావని ముందే కొందరు భావించారు. ఇప్పుడు కనీసం తమిళ్ లో వారు ప్రయత్నిస్తే ఏమైనా ఫలితం ఉంటుందో చూడాలి. చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని సినిమాలో నటించి మెప్పించింది. ఆమెకి కచ్చితంగా కమర్షియల్ హీరోయిన్ గా టాప్ హీరోయిన్స్ స్థాయికి వెళ్లే అర్హతలు అన్నీ ఉన్నాయి. కానీ ఆమెకు అవకాశాలు మాత్రం రావడం లేదు అంటూ ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.