Cool Drinks : కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా..ఒకసారి ఈ వీడియో చూస్తే జీవితంలో వాటిని తాగరు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cool Drinks : కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా..ఒకసారి ఈ వీడియో చూస్తే జీవితంలో వాటిని తాగరు…!

 Authored By tech | The Telugu News | Updated on :15 March 2024,4:15 pm

ప్రధానాంశాలు:

  •  Cool Drinks : కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా..ఒకసారి ఈ వీడియో చూస్తే జీవితంలో వాటిని తాగరు...!

Cool Drinks : ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫన్నీ క్రియేటివ్ కంటెంట్ తో పాటు అనేక రకాల ఉపయోగకరమైన వీడియోలు కూడా దర్శనమిస్తున్నాయి. ఇక ఈ ఇంటర్నెట్ ద్వారా ఇలాంటి వీడియోలు అనేకమందికి అనేక కొత్త విషయాలను తెలియజేస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తాయి అని చెప్పాలి. ఇక అలాంటిదే తాజాగా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చాలామందిని ఆకర్షించింది. ఇక ఈ వీడియో చూసిన తర్వాత కూల్ డ్రింక్స్ ను బాగా ఇష్టపడేవారు తరచుగా డ్రింక్స్ తాగేవారు మళ్లీ వారి జీవితంలో వాటిని తాగేందుకు ఇష్టపడరు అని చెప్పాలి. అంతలా ఆ వీడియోలో ఏముంది అంటే.సాధారణంగా కూల్ డ్రింక్స్ అనేవి కృత్రిమ చక్కెరలు మరియు ఇతర సమ్మేళనాలతో తయారు చేస్తూ ఉంటారు. ఇక వీటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అదేవిధంగా ఈ సాఫ్ట్ డ్రింక్స్ స్టోర్ చేసే టిన్స్ కూడా ప్రమాదకరమని తాజాగా ఓ వీడియో తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ కాన్ లోపల సీక్రెట్ ప్లాస్టిక్ లైనింగ్ అనేది ఉంటుంది. అయితే ఇది కేవలం డ్రింక్స్ ఇండస్ట్రీలో పని చేసే వారికి మరియు పరిశోధకులకు మాత్రమే తెలిసిన విషయం. కాబట్టి సామాన్య ప్రజలకు ఇది ఆశ్చర్యపరిచే విషయం అని చెప్పాలి.

అయితే ఈ సాఫ్ట్ డ్రింక్ కాన్స్ అల్యూమినియంతో తయారు చేయబడతాయి. ఇక ఈ అల్యూమినియం లోహం సాఫ్ట్ డ్రింక్ లోని ఎసిడిక్ కంటెంట్స్ తో రియాక్ట్ కాగలవు. దీని కారణంగా డ్రింకుకి లోహపు రుచి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అల్యూమినియం రేణువులు డ్రింక్ లో కలిసే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే అలా జరగకుండా ఉండేందుకే వీటిని తయారు చేసే కంపెనీలు డబ్బా లోపల సన్నని ప్లాస్టిక్ లైనింగ్స్ ను ఉపయోగిస్తారు. ఇక ఇది డ్రింక్ కు మరియు మెటల్ కు మధ్య ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. అదేవిధంగా డబ్బాకు కూడా తుప్పు పట్టకుండా చేస్తుంది.

అయితే తాజాగా ఆదిత్య నటరాజ్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ కూల్డ్రింక్ టిన్ పై చేసిన పరిశోధన వీడియోను సోషల్ మీడియాలో షేర్ . ఆదిత్య ఓ ప్రయోగంలో భాగంగా డ్రింక్ టీన్ తీసుకుని దాని లోపల దాగి ఉన్న హిడెన్ ప్లాస్టిక్ లేయర్ ను కళ్లకు కనిపించేలా చూపించాడు. అయితే చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్ లో డ్రింక్స్ ఎక్కువగా తాగకూడదనే ఉద్దేశంతో అల్యూమినియం కాన్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అల్యూమినియం కాన్ లో డ్రింక్ తాగిన సరే దాని లోపల ప్లాస్టిక్ ఉంటుంది. ఇక ఆ విషయాన్ని వీడియో ద్వారా ఆదిత్య మైక్రో ప్లాస్టిక్స్ మన శరీరంలోకి ఎలా వెళ్తున్నాయని విషయాలను తెలియజేశారు. ఇలాంటి హానికరమైన పదార్థాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలని , వాటిని తీసుకోకుండా దూరంగా ఉంచాలి అంటూ తన ఫాలోవర్స్ కు ఆదిత్య హెచ్చరించాడు. దీంతో ప్రస్తుతం ఆదిత్య షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది