Janaki Kalaganaledu : జానకి ఫీజు కోసం మరోసారి కష్టాల్లో రామా.. జ్ఞానాంబ, రామాకు భారీ షాకిచ్చిన కన్నబాబు.. ఇంతలో ట్విస్ట్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu : జానకి ఫీజు కోసం మరోసారి కష్టాల్లో రామా.. జ్ఞానాంబ, రామాకు భారీ షాకిచ్చిన కన్నబాబు.. ఇంతలో ట్విస్ట్?

 Authored By gatla | The Telugu News | Updated on :7 May 2022,11:30 am

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 9 మే 2022, సోమవారం ఎపిసోడ్ 296 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామా ఫైనాన్స్ షాపునకు వెళ్లడం.. అక్కడే ఉన్న మల్లిక, విష్ణు చూస్తారు. అసలు బావ గారు ఫైనాన్స్ షాప్ నకు ఎందుకు వెళ్లారు అని అనుకుంటుంది. ఎలాగైనా ఈ విషయం పోలేరమ్మకు చెప్పాలని అనుకొని వెంటనే ఇంటికి రాగానే బావ గారు ఫైనాన్స్ షాపునకు వెళ్లారు అని జ్ఞానాంబకు చెబుతుంది మల్లిక.

jnanamba confronts rama in janaki kalaganaledu

jnanamba confronts rama in janaki kalaganaledu

దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. నా కొడుకు ఫైనాన్స్ షాపునకు వెళ్లడం ఏంటి.. నువ్వు సరిగ్గా చూశావా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో కావాలంటే మీ కొడుకును అడగండి. ఆయన కూడా చూశారు అంటుంది. దీంతో విష్ణు కూడా అవును అమ్మ.. అన్నయ్య ఫైనాన్స్ షాప్ నకు వెళ్లడం చూశా అంటాడు. దీంతో జ్ఞానాంబకు ఏం చేయాలో అర్థం కాదు. అసలు.. రామా ఎందుకు ఫైనాన్స్ షాపునకు వెళ్లాడు అనుకుంటుంది.

ఇంతలో రామా వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. దీంతో రామాను నిలదీస్తుంది జ్ఞానాంబ. నువ్వు ఫైనాన్స్ షాపునకు ఎందుకు వెళ్లావు అని అడుగుతుంది. తను నిలదీసేసరికి ఏం చేయాలో రామాకు అర్థం కాదు. ఏం చెప్పాలో అర్థం కాదు.

Janaki Kalaganaledu : ఇంటి లాకర్ తాళాలు రామా చేతుల్లో పెట్టిన జ్ఞానాంబ

నా కొడుకు డబ్బుల కోసం ఇలా ఫైనాన్స్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడని అనుకున్న జ్ఞానాంబ.. వెంటనే తన ఇంటి లాకర్ తాళాలను రామా చేతుల్లో పెడుతుంది. దీంతో వద్దు అమ్మ. మా ఫ్రెండ్ కోసం నేను ఫైనాన్స్ షాపునకు వెళ్లాను. అయినా.. నాకు డబ్బులు కావాలంటే నేను నిన్నే అడుగుతా కదా అంటాడు.

మరోవైపు జానకి ఫీజు కోసం డబ్బుల గురించి అక్కడా ఇక్కడా రామా తిరగడం చూసి జానకికి బాధేస్తుంది. నాకు ఐపీఎస్ వద్దు.. గైపీఎస్ వద్దు. మీరు డబ్బుల కోసం వాళ్లను వీళ్లను చేయి చాపకండి అంటుంది జానకి. కానీ.. రామా మాత్రం తనను ఎలాగోలా కోచింగ్ కు వెళ్లెందుకు ఒప్పిస్తాడు.

ఆ తర్వాత రామా ఓ ఫైనాన్సియర్ దగ్గరకు వెళ్తాడు. అతడు.. లక్ష రూపాయలు ఇచ్చి.. కొన్ని డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టించుకుంటాడు. ఆ డాక్యుమెంట్లు ఏంటో చదవకుండా రామా సంతకం పెడతాడు. ఆ డాక్యుమెంట్లను తీసుకున్న కన్నబాబు ఏదో ప్లాన్ చేస్తాడు.

రామాను అడ్డంగా బుక్ చేసేందుకు కన్నబాబు ఏం ప్లాన్ వేశాడు అనేది సస్పెన్స్. మరోవైపు నా కొడుకును రాత్రి పూట ఎక్కడికి తీసుకెళ్లావు అని జ్ఞానాంబ జానకిని నిలదీస్తుంది. వాడి నిద్ర ఎందుకు చెడగొడుతున్నావు. వాడి ఆరోగ్యం ఏమౌతుంది అని నిలదీస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో.

నేను ఎంత మంచిదాన్నో అంత మొండిదాన్ని. నా పెద్ద కొడుకు నా పంచప్రాణాలు. ఇంకోసారి ఇలా వాడిని అర్థరాత్రులు.. అపరాత్రులు తిప్పావో.. నా కొడుకు మీద ఉన్న ప్రేమను నీ మీద చూపించడం మరోలా ఉంది. పరిస్థితులు అంత దూరం తెచ్చుకోకు అని చెప్పి జ్ఞానాంబ జానకికి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది