Janaki Kalaganaledu : హ్యాపీ మూడ్ లో జ్ఞానాంబ ఫ్యామిలీ.. ఇంతలో అనుకోని ట్విస్ట్.. జానకి ఐపీఎస్ సంగతి జ్ఞానాంబకు తెలుస్తుందా?

Authored By Varun G | The Telugu News | Published on: June 26, 2022, 11:30 am

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు సీరియల్ 27 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 331 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి తలకు గాయం కావడంతో తనను ఇంటికి తీసుకొస్తారు. డాక్టర్ వచ్చి ట్రీట్ మెంట్ చేస్తుంది. తలకు కట్టు కట్టి.. ప్రాణాపాయం ఏం లేదు అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. జ్ఞానాంబ కూడా తన తప్పు తాను తెలుసుకుంటుంది. తమను కాపాడటం కోసం జానకి తలకు గాయం అయిందని తెలుసుకుంటుంది.

jnanamba family is in happy after janaki recovered

jnanamba family is in happy after janaki recovered

రాత్రి అయ్యాక.. భోజనం కోసం డైనింగ్ టేబుల్ ముందు కూర్చొంటుంది జానకి. ఇంతలో అక్కడికి జ్ఞానాంబ వస్తుంది. జానకితో మాట్లాడాలి అంటుంది. నన్ను క్షమిస్తావా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో జానకి షాక్ అవుతుంది. అయ్యో అత్తయ్య గారు.. మీరు నన్ను క్షమిస్తావా అని అడగడం ఏంటి అంటుంది. దీంతో లేదు జానకి. నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu : అత్తా, పెద్ద కోడలు కలిసిపోయారని కుళ్లుకున్న మల్లిక

మరోవైపు జానకి, జ్ఞానాంబ ఇద్దరూ కలిసిపోవడం మల్లికకు అస్సలు నచ్చదు. ఇద్దరూ మళ్లీ కలిసిపోయారు. ఇక నన్నెక్కడ పట్టించుకుంటారు అంటూ తనలో తానే గులుగుతుంది. మరోవైపు నన్ను నువ్వు ఎలాగైనా క్షమించాల్సిందే. నీ నిజాయితీని, మంచితనాన్ని నేను తెలుసుకోలేకపోయాను అని అంటుంది జ్ఞానాంబ.

ఆ తర్వాత రామా.. జానకి కోసం భోజనం తీసుకొస్తాడు. ఇటు ఇవ్వు నేను తినిపిస్తా అని జ్ఞానాంబ ప్లేట్ తీసుకుంటుంది. దీంతో అయ్యో అత్తయ్య గారు వద్దు.. నేను తింటాను అని చెప్పినా కూడా జ్ఞానాంబ వినదు. తనకు గోరుముద్దలు తినిపిస్తుంది. దీంతో ఫ్యామిలీ మొత్తం సంబురపడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp