JR NTR : ఓవైపు షూటింగ్.. ఇంకోవైపు పార్టీయింగ్.. ముంబైలో ఎన్టీఆర్ దంపతుల సందడి.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

JR NTR : ఓవైపు షూటింగ్.. ఇంకోవైపు పార్టీయింగ్.. ముంబైలో ఎన్టీఆర్ దంపతుల సందడి.. వీడియో !

 Authored By ramu | The Telugu News | Updated on :30 April 2024,12:00 pm

JR NTR : ఎన్టీఆర్ రేంజ్ ఇప్పుడు పెరిగిపోయింది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆయనకు ఏకంగా ఇంటర్నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. దాంతో పాటు ఏకంగా పాన్ ఇండియాస్టార్ ఇమేజ్ కూడా సొంతం అయిపోయింది. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలు ఎలా ఉంటాయి, ఎవరితో ఉంటాయనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. దానిపేరు దేవర. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దాంతో పాటు అటు బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు ఎన్టీఆర్.

JR NTR : దానికి సీక్వెల్ గా..

ఇప్పటికే అయాన్ ముఖర్జీ దర్వకత్వంలో వచ్చిన వార్ సినిమా చాలా పెద్ద హిట్అ యిపోయింది. అయితేఇ ప్పుడు దానికి సీక్వెల్ గా వార్-2 తీస్తున్నాడు ముఖర్జీ. ఇందులో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ కూడా కలిసి నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కు ఈ సినిమా చాలా పెద్ద క్రేజ్ ను తీసుకువస్తుందని నందమూరి అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు సౌత్ లో ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ను దృష్టిలో పెట్టుకుని ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం ఇప్పటికే ముంబైలో ఉంటున్నాడు మన జూనియర్.

అటు సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే అప్పుడప్పుడు పార్టీలో కూడా పాల్గొంటున్నారు. అయితే తాజాగా సోమవారం నాడు రాత్రి ముంబైలోని ఓ హోటల్ లో నిర్వహించిన పార్టీకి ఎన్టీఆర్ తన సతీమణి ప్రణతితో కలిసి హాజరయ్యాడు. ఇద్దరూ చాలా స్పెషల్ అట్రాక్షన్ గా ఈ పార్టీలో నిలిచారు. ఇందులో వీరితో పాటు రణ్ బీర్ కపూర్-ఆలియా భట్ దంపతులు కూడా పాల్గొన్నారు. అటు హృతిక్ రోషన్ కూడా హాజరయ్యాడు. వారితో పాటు దర్శక నిర్మాత అయిన కరణ్‌ జోహార్ కూడా ఇందులో పాల్గొన్నారు. వీరంతా సరదాగా గడిపారు. అయితే బయటకు వస్తుండగా కెమెరాలకు చిక్కారు.ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. తమ హీరో రేంజ్ అమాంతం పెరిగిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది