
koratala siva JR NTR movie second heroine fixed
Jr NTR – Koratala Siva : యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతేడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నారు. ఈ సినిమా విడుదలై దాదాపుగా సంవత్సరం అవుతుంది. అయినా ఇంతవరకు ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి ఎటువంటి అప్డేట్ రావడం లేదు. మనకు తెలిసిందే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల డైరెక్షన్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని. అయితే ఈ సినిమా ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. ఈనెల 24 నుంచి షూటింగ్ ఉంటుందని అంటున్నారు. ఈసారి అయిన షూటింగ్ అవుతుందా లేదా మళ్లీ వాయిదా పడుతుందా అన్నది ఎవరికి అర్థం కావడం లేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
Jr NTR and Koratala Siva movie new update
ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల ఎన్టీఆర్ తో సినిమా విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లు అర్థమవుతుంది. ఎలాంటి కథతో సినిమా చేయాలనేది అర్థం కాక సతమతమవుతున్నాడు. అందుకే ఎన్టీఆర్ సినిమా ఆలస్యం అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఒక పాత్రలో అమాయకంగా, మరొక పాత్రలో యాక్షన్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. అలాగే సముద్రం, పోర్ట్, స్మగ్లింగ్ నేపథ్యంలోఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడని సమాచారం. ఇప్పటికి వచ్చిన పోస్టర్స్, వీడియోల వలన ఈ సినిమా స్టోరీ అలానే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.
Jr NTR and Koratala Siva movie new update
ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించబోతున్నారు. అలాగే ఇది రివేంజ్ డ్రామా అని సమాచారం బయటకు వచ్చింది. దీంతో ఈ సినిమా చాలా సింపుల్గా అనిపిస్తుంది. అయితే ఆచార్య లాంటి సినిమాతో రగులుతున్న కొరటాల ఇంత సింపుల్ కథని ఎంచుకున్నాడా ఎన్టీఆర్ తో ఏకంగా పాన్ ఇండియా సినిమా చేస్తాడా అన్నది చెప్పలేం. అయితే ఈ సినిమాలో ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని విషయాలు ఉంటాయని తెలుస్తుంది. కథ సింపుల్ గా ఉన్న కొరటాల టేకింగ్ తో కొత్త అంశాలు తీసుకుంటే సినిమా అదిరిపోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక ఫ్యాన్స్ గందరగోళంలో ఉన్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.