Jr NTR – Koratala Siva : ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో ఊహించని షాక్ .. ‘ నీకో దండం కొరటాల .. ‘ అంటున్న ఫ్యాన్స్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR – Koratala Siva : ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో ఊహించని షాక్ .. ‘ నీకో దండం కొరటాల .. ‘ అంటున్న ఫ్యాన్స్ !

 Authored By aruna | The Telugu News | Updated on :16 February 2023,12:00 pm

Jr NTR – Koratala Siva : యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతేడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నారు. ఈ సినిమా విడుదలై దాదాపుగా సంవత్సరం అవుతుంది. అయినా ఇంతవరకు ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి ఎటువంటి అప్డేట్ రావడం లేదు. మనకు తెలిసిందే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల డైరెక్షన్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని. అయితే ఈ సినిమా ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. ఈనెల 24 నుంచి షూటింగ్ ఉంటుందని అంటున్నారు. ఈసారి అయిన షూటింగ్ అవుతుందా లేదా మళ్లీ వాయిదా పడుతుందా అన్నది ఎవరికి అర్థం కావడం లేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

Jr NTR and Koratala Siva movie new update

Jr NTR and Koratala Siva movie new update

ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల ఎన్టీఆర్ తో సినిమా విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లు అర్థమవుతుంది. ఎలాంటి కథతో సినిమా చేయాలనేది అర్థం కాక సతమతమవుతున్నాడు. అందుకే ఎన్టీఆర్ సినిమా ఆలస్యం అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఒక పాత్రలో అమాయకంగా, మరొక పాత్రలో యాక్షన్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. అలాగే సముద్రం, పోర్ట్, స్మగ్లింగ్ నేపథ్యంలోఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడని సమాచారం. ఇప్పటికి వచ్చిన పోస్టర్స్, వీడియోల వలన ఈ సినిమా స్టోరీ అలానే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.

Jr NTR and Koratala Siva movie new update

Jr NTR and Koratala Siva movie new update

ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించబోతున్నారు. అలాగే ఇది రివేంజ్ డ్రామా అని సమాచారం బయటకు వచ్చింది. దీంతో ఈ సినిమా చాలా సింపుల్గా అనిపిస్తుంది. అయితే ఆచార్య లాంటి సినిమాతో రగులుతున్న కొరటాల ఇంత సింపుల్ కథని ఎంచుకున్నాడా ఎన్టీఆర్ తో ఏకంగా పాన్ ఇండియా సినిమా చేస్తాడా అన్నది చెప్పలేం. అయితే ఈ సినిమాలో ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని విషయాలు ఉంటాయని తెలుస్తుంది. కథ సింపుల్ గా ఉన్న కొరటాల టేకింగ్ తో కొత్త అంశాలు తీసుకుంటే సినిమా అదిరిపోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక ఫ్యాన్స్ గందరగోళంలో ఉన్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది