Taraka Ratna : తారకరత్న పార్థివ దేహం వద్ద ఏడుస్తూ అలసిపోయినా జూనియర్ ఎన్టీఆర్ వీడియో వైరల్..!!
Taraka Ratna : 39 సంవత్సరాల వయసులోనే నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై మరణించడం అందరికి షాక్ కీ గురి చేసింది. 20 సంవత్సరాల వయసులో హీరోగా సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చిన తారకరత్న.. అనుకున్న రీతిలో రాణించలేకపోయారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి కొద్దిగా దూరమై అలేఖ్య రెడ్డిని ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. ఈ వివాహాన్ని నందమూరి కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం జరిగిందట. అటువంటి సమయంలో తారకరత్న ఆర్థికంగా కష్టాలు పడుతూ ఉండగా నందమూరి ఫ్యామిలీలో ఆదుకున్న ఏకైక వ్యక్తి ఎన్టీఆర్.
తన తమ్ముడు ఎన్టీఆర్ తనని కీలక కష్ట సమయంలో ఆదుకున్నారని ఓ ఇంటర్వ్యూలో తారకరత్న చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే గుండెపోటుకు గురై బెంగళూరులో చికిత్స తీసుకుంటున్న సమయంలో స్వయంగా ఎన్టీఆర్ వెళ్లి అన్న తారకరత్న కోలుకోవాలని బతకాలని అందరూ భగవంతుని ప్రార్ధన చేయాలని కోరారు. కానీ మరణించడంతో నిన్న తారకరత్న స్వగృహంలో ఆయన పార్థివ దేహం వద్ద.. ఎన్టీఆర్ విలపించారు. ఎంతో బాధకు గురై అక్కడే మిగతా కుటుంబ సభ్యులను ఓదారిస్తూ కూర్చోవడం జరిగింది.
ఈ క్రమంలో అలసిపోయి ఏడుస్తూ తారక్ బాటిల్ పట్టుకుని విజయసాయిరెడ్డి తో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వీడియోలో ఎన్టీఆర్ ఎంతో ఆవేదనతో కనబడుతూ ఉన్నారు. ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా వచ్చి తారకరత్నకి నివాళులు అర్పించారు. అభిమానుల సందర్శనార్థం ప్రస్తుతం తారకరత్న పార్థివదేహం ఫిలిం ఛాంబర్ లో పెట్టడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.