JR NTR : భీమ్ పాత్ర తక్కువగా ఉండడంతో అసహనం వ్యక్తం చేసిన అభిమానులు.. క్లారిటీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్
JR NTR : టాలీవుడ్ టాప్ హీరోలు, రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఏకంగా 494 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. దాదాపుగా 900 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని ఈ సినిమా అరుదైన రికార్డులను సృష్టించింది. అయితే పలు ఏరియాల్లో బాహుబలి2 సాధించిన కలెక్షన్లను ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేయడం కష్టమనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ మూడు గంటల 2 నిమిషాల నిడివితో రిలీజైన సంగతి తెలిసిందే. ఓటీటీలో డిలీటెడ్ సీన్స్ కూడా యాడ్ చేసి విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తుంది.
భారీ అంచనాలతో మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కాస్త తగ్గిందనే టాక్ మొదటి నుండి వినిపిస్తుంది. సినిమాలో చరణ్ పాత్ర ఎక్కువ హైలెట్ అయ్యిందని, తారక్ కు తక్కువ స్పేస్ ఇచ్చాడని రాజమౌళిని ఏకిపారేస్తున్నారు. అంతేకాకుండా క్లైమాక్స్ ఫైట్ లో చరణ్ హైలెట్ అయ్యేలా డిజైన్ చేశారని ఫ్యాన్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందరు అయితే రాజమౌళికి వార్నింగ్ కూడా ఇస్తున్నారట. అయితే సినిమాలో ఏ హీరోను తక్కువచేసి చూపలేదని, ఇద్దరికీ సమానమైన స్క్రీన్ స్పేస్ ఇచ్చినట్లు రాజమౌళి చాలాసార్లు చెప్పుకొచ్చాడు.

JR NTR open up on his role
JR NTR : శాంతిస్తారా..
ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ సక్సెస్ మీట్‌లో ఈ వార్తలపై తారక్ స్పందించాడు. ” ఈ సినిమాలో ఇద్దరికీ సమానమైన స్క్రీన్ స్పేస్ ని జక్కన్న ఇచ్చాడని అన్నారు. ఒక సీన్ లో చరణ్ ని ఎలివేట్ చేసే సీన్స్ ఉంటే, మరొక సీన్ లో నన్ను ఎలివేట్ చేసే సీన్స్ ఉంటాయి. ఇద్దరికీ సమానంగా నటించే అవకాశం ఇచ్చినందుకు రాజమౌళికి థాంక్స్ చెప్తున్నాను. నా పాత్రకు సంబంధించి ఎటువంటి అసహనం కానీ, అసంతృప్తి కానీ లేదు. ఇద్దరిలో ఏ ఒక్కరిని తక్కువ చేయలేము.. అసలు ఆ ఇద్దరు లేకపోతే ఆర్ఆర్ఆర్ ఇంత అద్భుతంగా వచ్చేది కాదు అంటూ ఎన్టీఆర్ మాట్లాడాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు చల్లబడతారా అన్నది చూడాలి.